సారిన వీడియో టేపులను ఇవ్వలేదని కోర్టు అసహనం
పిటిషనర్ సరైన వీడియో టేపులను ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరఫున న్యాయవాది కూడా బుధవారం నాటికి సరైన వీడియో టేపులను ఇవ్వాలని న్యాయస్థానం పేర్కొంది. ఇక ఈ కేసును మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని, కోర్టుకు సహాయపడేందుకు ఈరోజు సాయంత్రం లోపు అమికస్ క్యూరీగా సీనియర్ న్యాయవాదిని నియమిస్తామని కోర్టు స్పష్టం చేసింది.
కొడాలి నాని మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, కమిషనర్ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని మంత్రి కొడాలి నానికి ఎస్ఈసి షోకాజ్ నోటీసు జారీ చేసింది.

కొడాలి నానీకి షోకాజ్ నోటీసు జారీ చేసిన ఎస్ఈసి .. ఎస్ఈసి పై కొడాలి నానీ ఫైట్
ఆ తర్వాత షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చిన కొడాలి నాని తాను ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. షోకాజ్ నోటీస్ ను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో ఈనెల 21వ తేదీన ఎన్నికలు ముగిసేవరకు కొడాలి నాని ని మీడియాతో మాట్లాడకుండా నిరోధిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని కోర్టులో సవాలు చేస్తూ కొడాలి నాని పిటిషన్ దాఖలు చేయగా ఈ పిటిషన్ పై తదుపరి విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.

మరింత లోతుగా విచారణ … కేసు బుధవారానికి వాయిదా
నాని వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ అంతా లిఖితపూర్వకంగా రాసి కోర్టు ముందుంచాలని ఆదేశించింది. ఫుటేజ్ లోని వివరాలను పరిశీలించకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు అభిప్రాయపడింది.ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ సోమయాజులు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈరోజు మరోమారు విచారణ సందర్భంగా పిటిషనర్, ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన వీడియో ఫుటేజ్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు బుధవారానికి ఈ కేసును వాయిదా వేసింది. కొడాలి నానీ ఎన్నికల కమీషన్ ఆదేశాలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చెయ్యాలని కోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నారు.