[ad_1]
Vodafone Shares: ఇవాళ్టి (సోమవారం, 09 జనవరి 2023) ఇంట్రా డే ట్రేడ్‌లో వొడాఫోన్ ఐడియా షేర్ ధర 52 వారాల కనిష్ట స్థాయి రూ. 7.35కి చేరుకుంది. మార్కెట్లో బుల్స్ బలాన్ని ప్రదర్శిస్తున్నా, ఈ షేర్లలో విపరీతమైన అమ్మకాల ఒత్తిడి కనిపించింది. భారీ వాల్యూమ్ల మధ్య సోమవారం నాటి ఇంట్రా డే ట్రేడ్‌లో ఈ స్టాక్ 6 శాతం పడిపోయింది.
2021 సెప్టెంబర్ తర్వాత మళ్లీ ఇదే ఈ షేర్లలో కనిష్ట స్థాయి. డిసెంబర్ 23, 2022న తాకిన మునుపటి కనిష్టమైన రూ. 7.61 కంటే ఇప్పుడు మరింత దిగువకు పడిపోయింది.
ఏడాదిలో సగం నష్టం
గత నెల రోజుల కాలంలో ఈ టెలికాం సర్వీసెస్ స్టాక్ దాదాపు 7 శాతం క్షీణించింది. గత ఆరు నెలల కాలంలో 15 శాతం దిగి వచ్చింది. గత ఏడాది కాలంలో చూస్తే సగానికి సగం (50 శాతం) తగ్గింది.
జాతీయ మీడియా నివేదిక ప్రకారం… డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) ఇప్పుడు వొడాఫోన్ ఐడియా మీద దృష్టి పెట్టింది. కంపెనీ స్థితిగతుల్ని అంచనా వేయడానికి ఆర్థిక లెక్కలు & కార్యకలాపాలను పరిశీలిస్తోంది. ఈ పరిశీలనల ఆధారంగా, ఈ టెల్కో పరిస్థితి మీద కేంద్ర ప్రభుత్వం ఒక అంచనాకు వస్తుంది.
News Reels
రాయిటర్స్ నివేదిక ప్రకారం… కనీసం రూ. 7,000 కోట్ల (846 మిలియన్ డాలర్లు) అత్యవసర అప్పు కోసం వొడాఫోన్ ఐడియా తాజాగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే, కొత్త అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు ఇష్టపడడం లేదు.
ఇండస్ టవర్స్‌కు (Indus Towers) వొడాఫోన్ ఐడియా రూ. 7,500 కోట్ల రూపాయలు బకాయి ఉంది. ఈ కంపెనీకి చెందిన టవర్స్‌ను వినియోగించున్నందుకు ఈ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాల్లో ఎక్కువ భాగాన్ని, ఇండస్ టవర్స్‌కు ఉన్న బకాయిల్లో కొంత మొత్తాన్ని భర్తీ చేయడానికి వొడాఫోన్ ఉపయోగిస్తుంది. దీంతోపాటు, 5G సేవలు తీసుకురావడం, 4G సేవల విస్తరణకు కూడా కొత్త రుణాలను ఈ కంపెనీ వినియోగించుకుంటుంది.
2023 జనవరి నుంచి విడతల వారీగా 100 శాతం బకాయిలు చెల్లిస్తామని ఈ టెలికాం కంపెనీ, టవర్ కంపెనీకి మాట ఇచ్చింది. మాట నిలబెట్టుకోలేక బకాయిలను క్లియర్ చేయడంలో టెలికాం కంపెనీ విఫలమైతే, టవర్ సైట్లకు యాక్సెస్‌ను కోల్పోవాల్సి వస్తుందని వొడాఫోన్ ఐడియాను ఇండస్ టవర్స్ గతంలోనే హెచ్చరించింది.
దీంతోపాటు… కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ మీద తుది ఆమోదం కోసం కూడా వొడాఫోన్ ఎదురు చూస్తోంది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం మీద వడ్డీ 1.95 బిలియన్ డాలర్లను సకాలంలో వొడాఫోన్ చెల్లించలేక పోయింది. ఆ వడ్డీ బకాయిని ఈక్విటీగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి వొడాఫోన్ ఓకే చెప్పింది. అయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా పూర్తి స్థాయి అనుమతి రాలేదు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link