ఏపీలో కొత్తగా 1271 కరోనా కేసులు
తాజాగా నమోదైన 1326 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,09,002కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా మరణించినవారి సంఖ్య 7,244కు చేరింది.

ఏపీలో భారీగా పెరుగుతున్న యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 911 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,91,048కి చేరింది. కోలుకున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 10,710 యాక్టివ్ కేసులున్నాయి.

ఆ ఐదు జిల్లాల్లో సెంచరీ దాటిన కొత్త కేసులు
ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,52,39,114 కరోనా నమూనాలను పరీక్షించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో కొత్తగా 282 కరోనా కేసులు, గుంటూరు జిల్లాలో కొత్తగా 271 కరోనా కేసులు నమోదు కాగా, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఒక కేసు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలోనే ఐదు జిల్లాల్లో 100కిపైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

ఏపీలో జిల్లాల వారీగా పెరిగిన కరోనా కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 23, చిత్తూరులో 282, తూర్పుగోదావరిలో 29, గుంటూరులో 271, కడపలో 31, కృష్ణాలో 138, కర్నూలులో 50, నెల్లూరులో 171, ప్రకాశంలో 54, శ్రీకాకుళంలో 52, విశాఖపట్నంలో 222, విజయనగరంలో 2, పశ్చిమగోదావరిలో 1 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా కరోనా నిబంధనలను పాటించాలని ప్రభుత్వం కోరుతోంది. బయటికి వెళ్లినప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేసింది.