ఏపీలో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల..
గత 24 గంటల్లో కరోనా బారినపడి చిత్తూరు జిల్లాలో ఒకరు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 7171 మంది బాధితులు మృతి చెందారు. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 56 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,82,275కి చేరింది. కోలుకున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల నమోదవుతుండటం గమనార్హం.

ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులు
రాష్ట్రంలో ప్రస్తుతం 871 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,40,92,251 కరోనా నమూనాలను పరీక్షించారు. ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 4, చిత్తూరులో 25, తూర్పుగోదావరిలో 13, గుంటూరులో 5, కడపలో 2, కృష్ణాలో 8, కర్నూలులో 8, నెల్లూరులో 6, ప్రకాశంలో 3, శ్రీకాకుళంలో 3, విశాఖపట్నంలో 22,
విజయనగరంలో 0, పశ్చిమగోదావరిలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి.

దేశంలో కరోనా హెచ్చుతగ్గులు.. వందలోపే మరణాలు
దేశంలో కరోనా కేసులు మరోసారి భారీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 17,407 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,11కోట్లకుపైకి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 89 మంది మరణించగా.. ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 1,57,435కు చేరింది. కాగా, నిన్న ఒక్కరోజే 14,031 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 1.08 కోట్లకుపైబడింది. దేశంలో రికవరీ రేటు 97.06శాతంగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం దేశంలో 1,73,413 యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోంది. మార్చి 3 నాటికి 1,66,16,048 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశారు. బుధవారం ఒక్కరోజే 9,94,452 మంది టీకాలు వేయించుకున్నారు.