Sunday, August 1, 2021

ఏపీలో కొత్తగా 67 కరోనా కేసులు: ఆ రెండు జిల్లాల్లో ఒక్కటీ లేదు, 619కి పడిపోయిన యాక్టివ్ కేసులు

Andhra Pradesh

oi-Rajashekhar Garrepally

|

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో 28,239 నమూనాలను పరీక్షించగా.. 67 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,89,077కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.

ఒక్క రోజు వ్యవధిలో విశాఖపట్నం జిల్లాలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనాబారినపడి మరణించినవారి సంఖ్య 7166కు చేరింది. గత 24గంటల్లో 54 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 8,81,292కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 619 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,36,44,086 కరోనా నమూనాలను పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

67 new corona cases reported in andhra pradesh: one death in last 24 hours

ఏపీలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 2, చిత్తూరులో 17, తూర్పుగోదావరిలో 10, గుంటూరులో 12, కడపలో 4, కృష్ణాలో 3, నెల్లూరులో 4, ప్రకాశంలో 2, విశాఖపట్నంలో 10, విజయనగరంలో 1, పశ్చిమగోదావరిలో 2 కరోనా కేసులు నమోదయ్యాయి. కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదు.

ఇది ఇలావుండగా, దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 12,881 కాగా, మొత్తం కేసుల సంఖ్య 1,09,50,201కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో 11,987 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 1,06,56,845కు చేరింది. గడిచిన 24 గంటల్లో 101 మంది మరణించగా, ఇప్పటి వరకు మరణాల సంఖ్య 1,56,014కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,37,342 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.


Source link

MORE Articles

వావ్.. ఓకేసారి 1000 మంది వీడియో కాల్.. టెలీగ్రామ్ నయా ఫీచర్

ప్రైవసీ పాలసీ వల్ల.. ఇటీవల కొత్త ప్రైవసీ పాలసీ కారణంగా యూజర్లు వాట్సాప్‌కు దూరం అవుతున్నారు. ప్రత్యామ్నయంగా టెలిగ్రామ్‌ యాప్‌ యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాన్నారు. దీంతో...

Wife: రాత్రి హ్యాపీగా ఎంజాయ్, పగలు పంచాయితీలు, భార్యను నరికి చంపిన భర్త, కొడవలి ఎత్తుకుని !

పెళ్లి వయసు వచ్చిన పిల్లలు ఢిల్లీలోని మంగోలిపురలో సమీర్ (45), సబానా (40) దంపతులు నివాసం ఉంటున్నారు. సమీర్, సబానా దంపతులకు 21 సంవత్సరాలు, 17 సంవత్సరాల...

The Jodie Whittaker era of Doctor Who has been far from vintage, but the show’s decline started years ago

After months of rumors, it was no surprise when the BBC finally confirmed on July 29 that Doctor Who star Jodie Whittaker and...

How to Silence Notifications With Windows 10’s Focus Assist

You're in the middle of browsing a website, creating a document, or playing a game. Then Windows 10 taps...

सेहत के लिए रोज एक उबला अंडा है बेहद फायदेमंद, मिलते हैं जबरदस्त लाभ, बस जान लीजिए सेवन का सही टाइम

benefits of boiled egg eating in breakfast: दिन की शुरूआत हमें हेल्दी नाश्ते के साथ करनी चाहिए, जिससे दिनभर के लिए शरीर को...

‘అశ్వగంధ’ కోవిడ్‌ను నయం చేయగలదా-యూకెతో భారత్‌ క్లినికల్ ట్రయల్స్-సక్సెస్ అయితే మరో ముందడుగు పడినట్లే

అశ్వగంధ రోగనిరోధకతను పెంచగలదా? అశ్వగంధ మొక్కను సాధారణంగా ఇండియన్ వింటర్ చెర్రీ అని పిలుస్తారు.సంప్రదాయ మూలిక వైద్యంలో,ఆయుర్వేదంలో ఇది దివ్యమైన ఔషధంగా చెబుతారు. ఒత్తిడిని తగ్గించి శరీరంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe