Friday, June 18, 2021

ఏపీలో టెంపుల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్… లాంచ్ చేసిన సీఎం జగన్… ఇకపై అందుబాటులోకి ‘ఈ-హుండీ’…

Andhra Pradesh

oi-Srinivas Mittapalli

|

రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాలను ఒకే వ్యవస్థ కిందికి తీసుకువచ్చేందుకు టెంపుల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. సోమవారం(మార్చి 15) తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టెంపుల్ మేనేజ్ మెంట్ సిస్టమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేవాలయాల్లో అవినీతి కట్టడికి టెంపుల్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ఉపయోగపడుతుందన్నారు. పుణ్యక్షేత్రాలు, దేవాలయాల్లో స్వచ్చమైన, పారదర్శకతతో కూడిన సేవలు అందించేందుకే ఈ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.

రూ.1300 కోట్లు మీవే కావొచ్చు: ఈ బుధవారమే పవర్‌బాల్ లాటరీ..ఎలా ఆడాలంటే..?

ఇకపై దేవాలయాల సమాచారం, భక్తులకు అవసరమైన సేవలు, ఆన్ లైన్ సేవల వివరాలు,ఆలయాల ఆదాయ వ్యయాలు, సిబ్బంది వివరాలు, పండుగ దినాల నిర్వహణ, పర్వదినాలు-ఉత్సవాల క్యాలెండర్, ఆస్తుల నిర్వహణ తదితర వివరాలన్నీ టెంపుల్ మేనేజ్ మెంట్ సిస్టమ్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. ఈ-హుండీ సదుపాయం ద్వారా భక్తులు కానుకలు సమర్పించే అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఈభక్తులు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఈ-హుండీలో కానుకలు సమర్పించవచ్చు. ఈ ఆన్‌లైన్‌ పేమెంట్‌ వ్యవస్థను యూబీఐ నిర్వహించనుంది.

టెంపుల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా తొలిసారిగా రాష్ట్రంలోని అన్నవరం ఆలయంలో ఈ-హుండీ విధానం అందుబాటులోకి వచ్చింది. సేవల ప్రారంభోత్సవం సందర్భంగా యూబీఐ రూ.10,116లను కానుకగా చెల్లించింది. ఈ నెలాఖరు నాటికి 11 ప్రధాన దేవాలయాలల్లో ఈ హుండీ విధానం అందుబాటులోకి రానుంది. తద్వారా భక్తులు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి హుండీ చెల్లింపులు చేయవచ్చు.

టెంపుల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ లాంచ్ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణి మోహన్,ఎండోమెంట్ కమిషనర్ అర్జునరావు,యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ అండ్ సీఈవో కిరణ్ రాయ్,ఎస్ఎల్‌బీసీ కన్వీనర్ బ్రహ్మానంద రెడ్డి తదితరలు పాల్గొన్నారు.


Source link

MORE Articles

Delivery service Gopuff acquires rideOS for $115 million – TechCrunch

On-demand goods, food and alcohol delivery service Gopuff has acquired fleet management platform rideOS for $115 million, sources familiar with the deal say. This...

Report: Ring provided at least 100 LAPD officers with free devices or discount codes and encouraged them to recommend its products to fellow LAPD...

Johana Bhuiyan / Los Angeles Times: Report: Ring provided at least 100 LAPD officers with free devices or discount codes and encouraged them...

హైకోర్టుకు చేరిన గెలుపు పంచాయతీ: సువేంద్ విక్టరీపై కోర్టులో మమతా సవాల్

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఊగిసిలాట మధ్య స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అయితే న్నికల ఫలితాలను సవాల్‌ చేస్తూ...

శభాష్ హర్లీ.. నదిలో కొట్టుకుపోతున్న జింక పిల్లను కాపాడి.. నెటిజన్ల ప్రశంసలు

కనిపించని హర్లీ.. అమెరికాలో హర్లీ అనే శునకాన్ని పెంచుకుంటున్నారు. అయితే అదీ ఈ నెల మొదటి వారం నుంచి కనిపించడం లేదు. దీంతో యజమాని కంగారు పడ్డారు....

इस समस्या से जूझ रहे पुरुष करें कद्दू के बीज का सेवन, मिलेंगे गजब के फायदे!

नई दिल्ली: अगर आप शुगर पेशेंट हैं या फिर शारीरिक कमजोरी से जूझ रहे हैं तो ये खबर आपके काम की है. इस...

43 కిలోల బంగారం స్వాధీనం.. రూ.21 కోట్లు విలువ.. ఇక్కడే

మణిపూర్‌లో భారీగా బంగారం పట్టుబడింది. ఇంఫాల్‌లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు చేసిన తనిఖీల్లో ఏకంగా రూ.21 కోట్లు విలువ చేసే గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. అదీ మొత్తం 43 కిలోలు...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గ్యాస్ లీకేజీ: తీవ్ర అస్వస్థతో ఒకరు మృతి, ఆస్పత్రిలో మరో ఇద్దరు

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం(రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం)లో గ్యాస్ పైప్ లీకైంది. దీంతో అక్కడే ఉన్న ముగ్గురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. నర్సింహా రెడ్డి అనే...

Woman: బాలుడి ప్రాణం పోయింది, మంత్రగత్తె అని ముస్లీం మహిళను చితకబాదేసి, ఇంట్లో నుంచి లాగి !

మంత్రాలు వేస్తున్న మంత్రగత్తె ? రాజస్థాన్ లోని బుండి జిల్లాలోని భజన్రి అనే గ్రామంలో ఓ ముస్లీం మహిళ నివాసం ఉంటున్నది. ముస్లీం మహిళ మంత్రాలు వేస్తోందని...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe