Friday, July 30, 2021

ఏపీలో నేడే తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్: విజయనగరం మినహా 12 జిల్లాలోనూ..


Andhra Pradesh

oi-Rajashekhar Garrepally

|

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే చాలా కేంద్రాలకు పోలింగ్ సామగ్రి చేరింది. పోలింగ్ విధులు నిర్వహించేందుకు…. సిబ్బంది కేంద్రాలకు చేరుకుంటున్నారు.

తొలి విడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. కరోనా రోగులు చివరి గంటలో ఓటు వేసేందుకు రావాలని సూచించారు. పోలింగ్ జరిగే తీరును వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. అంతేగాక, పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా నోటా కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అయితే, నోటాకు వచ్చే ఓట్లను లెక్కించబోమన్నారు.

 Arrangements are completed for first phase Panchayat polling in andhra pradesh

విజయనగరం జిల్లాను మినహాయించి తక్కిన 12 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్ల పరిధిలో తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ, అనకాపల్లి, కాకినాడ, పెద్దాపురం, నర్సాపురం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, కావలి, నంద్యాల, కర్నూలు, కదిరి, జమ్మలమడుగు, కడప, రాజంపేట, చిత్తూరు రెవెన్యూ డివిజన్లలోని.. మొత్తం 3,249 పంచాయతీ సర్పంచ్‌, 32,502 వార్డులకు పోలింగ్‌ జరగాల్సి ఉండగా.. 525 సర్పంచ్‌, 12,185 వార్డులు ఏక గ్రీవమయ్యాయి.

ఈ క్రమంలో 2,723 సర్పంచ్‌, 20,157 వేలకు పైగా వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల పోలింగ్ కోసం.. 29,732 పోలింగ్‌ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో తొలిసారి నోటా ప్రవేశపెట్టారు. పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్టభద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఇప్పటికే జిల్లాల్లో పర్యటించిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. పోలింగ్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు.



Source link

MORE Articles

diseases caused by obesity: आपको इन गंभीर बीमारियों का शिकार बना सकता है मोटापा, इन 5 तरीकों से वजन करें कंट्रोल

diseases caused by obesity: उल्टा सीधा खानपान और गलत लाइफस्टाइल के चलते कई लोग मोटापे से पीड़ित (suffering from obesity) हैं. हेल्थ एक्सपर्ट...

హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో 800 మంది ఎంపీటీసీలు .. కేసీఆర్ కు ఎంపీటీసీల ఫోరం అల్టిమేటం!!

ఓరుగల్లు వేదికగా పోరు బాట పట్టిన ఎంపీటీసీలు పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లు వేదికగా ఎంపీటీసీల ఫోరం నిర్వహించిన సమావేశంలో, ఎంపీటీసీల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు...

జగన్ బెయిల్ రద్దు: షాకింగ్ పాయింట్ -14 బదులు 25 ఎలా? -ఏ2 సాయిరెడ్డి కూడా జైలుకే: ఎంపీ రఘురామ

జగన్ బెయిల్ రద్దు తీర్పు.. క్విడ్ ప్రోకో సంబంధిత పలు కేసుల్లో నిదితుడైన వైఎస్ జగన్ తన ముఖ్యమంత్రి పదవిని అడ్డంపెట్టుకుని కేసును ప్రభావితం చేస్తున్నారని, సహ...

ఏపీ బాటలో యూపీ, జగన్ ను అనుసరిస్తున్న యోగి : కళ్ళు తెరిచి చూడు బాబు అంటున్న సాయిరెడ్డి

ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థపై గతంలో టీడీపీ విమర్శలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. గ్రామ...

బసవరాజు బొమ్మై భావొద్వేగం.. శునకం చనిపోతే అలా.. అప్పటి వీడియో నేడు వైరల్

సీఎం కొడుకుగా.. బొమ్మై.. తండ్రి కూడా ఎస్ఆర్ బొమ్మై కూడా సీఎంగా పనిచేశారు. బసవరాజు బొమ్మై హోం మంత్రి నుంచి చీఫ్ మినిస్టర్‌గా ప్రమోట్ అయ్యారు. హోం...

AMD announces the Radeon RX 6600 XT, a $379 “1080p beast” that arrives on August 11

What just happened? After months of rumors, leaks, and speculation, AMD...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe