Monday, November 29, 2021

ఏపీ కార్పోరేషన్లలో రెండో డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్…

Andhra Pradesh

oi-Srinivas Mittapalli

|

ఏపీలో 11 కార్పోరేషన్లలో రెండో డిప్యూటీ మేయర్,75 మున్సిపాలిటీలు,నగర పంచాయతీల్లో రెండో వైస్ ఛైర్మన్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. పరోక్ష పద్దతిలో రెండో డిప్యూటీ మేయర్,రెండో వైస్ ఛైర్మన్ ఎన్నిక ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఈ నెల 30న కార్పోరేషన్లు,మున్సిపాలిటీలు,నగర పంచాయతీల్లో ప్రత్యేక సమావేశానికి ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశాలిచ్చారు.

 ఏపీలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, వైస్‌ ఛైర్మన్లు- ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం ఏపీలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, వైస్‌ ఛైర్మన్లు- ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం

మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో గెలిచిన సభ్యులు,ఎక్స్‌అఫిషీయో సభ్యులంతా ఆరోజు తప్పక సమావేశానికి హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు ఈ నెల 26వ తేదీలోగా కార్పోరేటర్లు,కౌన్సిలర్లు,ఎక్స్‌అఫిషియో సభ్యులకు సమావేశానికి హాజరుకావాలన్న సమాచారాన్ని చేరవేయాలని కోరారు. ఏలూరు కార్పోరేషన్‌కు కూడా ఈ నెల 30నే మేయర్,ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఉంటుందని తెలిపారు.

state election commission notification for second deputy mayor and municipal vice chairman

రాష్ట్రంలోని కార్పోరేషన్లలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు,మున్సిపాలిటీలు,నగరపంచాయతీల్లో ఇద్దరు వైఎస్ ఛైర్మన్ల నియామకానికి వీలుగా మున్సిపల్ చట్టంలో సవరణలు చేస్తూ ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పరిపాలనా సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర కేబినెట్‌లోనూ ఐదుగురు డిప్యూటీ సీఎంలకు అవకాశం కల్పించిన సీఎం జగన్… పట్టణ స్థానిక సంస్థల్లోనూ అదే పంథాను అనుసరించారు. మేయర్,డిప్యూటీ మేయర్,మున్సిపల్ ఛైర్మన్,వైఎస్ ఛైర్మన్ పదవులకు పార్టీలో తీవ్ర పోటీ నెలకొనడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్న వాదన కూడా ఉంది. అందుకే సాధ్యమైనంత ఎక్కువమందికి పదవులు ఇచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతారు.

English summary

The State Election Commission has issued notification for the election of second deputy mayor in 11 corporations in AP, second vice chairman in 75 municipalities and city panchayats. It was clarified that there would be an election of a second deputy mayor and a second vice chairman in an indirect manner

Story first published: Friday, July 23, 2021, 22:40 [IST]


Source link

MORE Articles

AP weather: ఏపీకి తుఫాను ముప్పు, 3న జవాద్, భారీ వర్షాలు, బంగాళాఖాతంలో అలజడి

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్ష ముప్పు వీడటం లేదు. డిసెంబర్ నెల మొదటి వారంలో బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడనుంది. దీని ప్రభావంతో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్రలో డిసెంబర్ 3 నుంచి 5...

Roborock Cyber Monday deals: Get a robot vacuum on the cheap today only!

A robot vacuum is one of the best investments you can make for your home. A good one can clean up your place...

భారత మార్కెట్లో అత్యధిక మైలేజీని స్కూటర్లు: జెస్ట్, జూపిటర్, యాక్సెస్, యాక్టివా…

రోడ్లపై స్కూటర్లు మంచి ప్రాక్టికాలిటీని కలిగి ఉండి, గేర్లతో నడిచే మోటార్‌సైకిళ్ల కన్నా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి మరియు నడపడానికి సులువుగా ఉంటాయి. సరసమైన ధర, లైట్ వెయిట్,...

కొత్త ప్లాంట్‌ ఏర్పాటుకి శ్రీకారం చుట్టిన Ather Energy.. కారణం అదేనా?

దేశీయ విఫణిలో 450X మరియు 450 ప్లస్ స్కూటర్‌లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా కంపెనీకి రెండవ ప్లాంట్‌గా కొత్త ఫ్యాక్టరీని ప్రారంభించనుంది. ఈ కొత్త ప్లాంట్ తర్వాత కంపెనీ...

Increase stamina: पुरुषों का स्टेमिना बढ़ाने का रामबाण तरीका, इन चीजों को खाने से मिलेगा गजब का फायदा

Increase stamina Symptoms causes and prevention of stamina deficiency stamina booster food brmp | Increase stamina: पुरुषों का स्टेमिना बढ़ाने का रामबाण तरीका,...

जानलेवा बीमारी के कारण बीच में ही छूट गई थी Johnny Lever के बेटे की पढ़ाई, शरीर में दिखने लगते हैं ऐसे लक्षण

comedian johnny levers son jessey lever was suffered from throat cancer know its symptoms and stages samp | जानलेवा बीमारी के कारण बीच...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe