Saturday, April 17, 2021

ఏపీ పరిషత్ పోలింగ్: షాకింగ్ ట్విస్ట్ -ఒడిశా పోలీసుల అలజడి -కోటియా గ్రామాల్లో సెక్షన్ 144 -ఈసీకీ నో ఎంట్రీ

కోటియా గ్రామాల్లో సెక్షన్ 144

ఆంధ్రా, ఒడిశా మధ్య కొఠియా గ్రూపు గ్రామాలపై దశాబ్దాలుగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆ గ్రామాలు మావంటే మావంటూ రెండు రాష్ట్రాలూ తగువులాడుకుంటోన్న క్రమంలో ఇవాళ జరిగే ఏపీ పరిషత్‌ ఎన్నికలను అడ్డుకోడానికి ఒడిశా ప్రభుత్వ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఏకంగా 22 కోటియా గ్రామాల్లో బుధవారం నుంచే సెక్షన్ 144 విధించి, జనం కదలికలపై ఆంక్షలు పెట్టింది. పోలింగ్‌ నిర్వహణకు వెళ్లిన సిబ్బందిని కూడా ఒడిశా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్థానిక అధికారులు, ఐటీడీఏ పీవో రంగంలోకి దిగి ఒడిశా యంత్రాంగంతో చర్చలు జరిపారు.

viral video: ఖాకీల రాక్షసం -మాస్కు సరిగా పెట్టుకోలేదని వ్యక్తిపై భయానక దాడి -చిన్న పిల్లాడు వేడుకున్నా..

తొలిసారి పోలింగ్ అడ్డగింత..

తొలిసారి పోలింగ్ అడ్డగింత..

కొరాపుట్‌ జిల్లా కలెక్టర్‌ అబ్దుల్‌ అక్తర్‌ ఆదేశాల మేరకు 22 కోటియా గ్రామాల్లో సెక్షన్ 144 విధించారు. గంజాయిభద్ర పరిధిలోని నేరెళ్లవలసలో గ్రామస్థులను బయటకు రానీయకుండా పోలీసులు కట్టడి చేశారు. ఎన్నికలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఎగువ, దిగువ గంజాయిభద్ర, కొటియా, దూళిభద్ర, ఎగువ, దిగువశెంబి తదితర గ్రామస్థులను ఓటింగ్‌కు హాజరుకావొద్దని ఒడిశా అధికారులు ఆంక్షలు విధించారు. కోటియా గ్రామాల సరిహద్దులను దాదాపు మూసేశారు. నేరెళ్లవలసలో గంజాయిభద్ర పంచాయతీకి చెందిన 1,291 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 628 మంది పురుషులు, 663 మంది మహిళలు. వివాదాస్పద గ్రామాల్లో ఇరు రాష్ట్రాలు ఎన్నికలను నిర్వహిస్తున్నాయి. ఒక రాష్ట్రం ఎన్నికలను మరో రాష్ట్రం ఎప్పుడూ అడ్డుకోలేదు. తొలిసారి ఏపీ స్థానిక ఎన్నికలపై ఒడిశా కన్నెర్రచేస్తోంది.

ఎక్కడున్నాయీ కోటియా గ్రామాలు?

ఎక్కడున్నాయీ కోటియా గ్రామాలు?

ఏపీలోని విజయనగరం – ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లాల మధ్య ఉండే కొటియా పంచాయతీలోని 21 గ్రామాల్ని కొటియా గ్రామాలుగా పిలుస్తారు. విజయనగరం నుంచి 60 కిలోమీటర్ల మేర కొండ ప్రాంతాల్లో ప్రయాణిస్తే కొటియా ప్రాంతాలకు చేరుకోవచ్చు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు అవతరించినప్పుడు కొటియా గ్రామాల్లో సర్వే జరగకపోవడం, వాటిని ఏ ప్రాంతాల్లోనూ కలపకపోవడంతో అవి తమ పరిధిలోనివేనంటూ ఇరు రాష్ట్రాలూ వాదిస్తున్నాయి. ఈ వివాదం 1968లోనే సుప్రీంకోర్టును చేరగా, వ్యవహారం తేలాల్సింది కోర్టులో కాదని, పార్లమెంట్‌లోనే అని అత్యున్నత న్యాస్థానం 2006లో పేర్కొంది. విలువైన ఖనిజ సంపదకు నిలయమైన ఆ ప్రాంతాన్ని వదులుకునేందుకు రెండు రాష్ట్రాలూ సిద్ధంగా లేవు. అయితే, ఎన్నికల పోలింగ్ సమయంలో అడ్డగింతలు జరగడం మాత్రం ఇదే తొలిసారి. నిన్న..

ఒడిశా పార్టీల నేతల హంగామా

ఒడిశా పార్టీల నేతల హంగామా

నిజానికి పంచాయితీ ఎన్నికల సమయంలోనే గంజాయిభద్ర, పగులుచెన్నారు, పట్టుచెన్నారులో వాటిని నిలిపివేయాలని ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఎలాంటి ఫలితం రాలేదు. దీంతో దండోపాయంతోనైనా ఏపీ పరిషత్ ఎన్నికలను అడ్డుకోవాలని ఒడిశా యంత్రాంగం ఆంక్షలు విధించి, భారీ ఎత్తున పోలీసు బలగాలను దించింది. ప్రభుత్వ యంత్రాంగమేకాదు, ఒడిశాకు చెందిన పలు రాజకీయ పార్టీలు అఖిలపక్షంగా ఏర్పడి బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కోటియా గ్రామాల్లో పర్యటించి ఏపీ ఎన్నికలను బహిష్కరించాలని గిరిజనులకు పిలుపునిచ్చారు. కాగా, ఒడిశా చేస్తున్న ప్రయత్నాలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. ఇదిలా ఉంటే..

శ్రీకాకుళం సరిహద్దులోనూ వివాదం..

శ్రీకాకుళం సరిహద్దులోనూ వివాదం..

విజయనగరం -కోరాపూట్ జిల్లాల మధ్య కోటియా గ్రామాల వివాదం కొనసాగుతుండగా, ఆంధ్ర -ఒడిశా సరిహద్దులోనే శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కౌశల్యాపురం పోలింగ్‌ స్టేషన్‌ వద్ద రెండు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంది. కౌశల్యాపురం ప్రాథమిక పాఠశాలలో పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ కోసం ఆంధ్రా అధికారులు ఏర్పాట్లు చేయగా, ఒడిశా అధికారులు అక్కడికి వచ్చి.. భూభాగానికి సంబంధించిన వివాదం కోర్టులో ఉన్నందున ఎన్నికలు నిర్వహించొద్దంటూ అడ్డుకున్నారు. దీనిపై సీతంపేట ఐటీడీఏ పీవో జోక్యం చేసుకుని ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు.


Source link

MORE Articles

Peloton is fighting a recall request on its treadmill after a child died last month

Peloton is resisting a request from the Consumer Product Safety Commission (CPSC) to recall its Tread Plus treadmill, which was involved...

Yes, Twitter was down — at least on the East Coast | Engadget

These days, fail whale sightings are few and far between, but Twitter appears to be suffering a serious outage at the moment. It's...

Internal memo: ByteDance seeks to increase China-based ad revenue from ~28B in 2020 to $39.8B in 2021; TikTok's Chinese twin Douyin had 610-620M DAUs...

Zheping Huang / Bloomberg: Internal memo: ByteDance seeks to increase China-based ad revenue from ~28B in 2020 to $39.8B in 2021; TikTok's Chinese...

Squarespace files to go public – TechCrunch

Squarespace is going public, Apple shares some music payment details and Twitter bans the founder of the right-wing media organization Project Veritas. This...

వైఎస్ షర్మిల నుంచి పిలుపు: కొండా సురేఖ దంపతులు ఏమన్నారంటే..?, జగన్‌పై సంచలనం

షర్మిల పార్టీ నుంచి పిలుపు ఈ క్రమంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మంచి అనుంబంధం ఉన్న కొండా సురేఖ,...

బీజేపీ విజ్ఞప్తికి టీఆర్ఎస్ ఓకే.. లింగోజిగూడలో పోటీకి దూరం

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలోని లింగోజిగూడ డివిజన్ ఉపఎన్నిక ఏకగ్రీవం కోసం పోటీకి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. బీజేపీ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో...

ఈ నగరానికి ఏమయ్యింది? కాకినాడ స్మార్ట్ సిటీనా, డెకాయిట్ సిటీనా!?

చిన్నప్పుడు ఎప్పుడూ షటిల్, టెన్నిస్ ఆడనివారు కూడా రాత్రి 6 నుండీ అర్ధరాత్రి 2 వరకూ కాకినాడ లో దోమల బ్యాట్ తో ప్రజలు అద్భుతమైన ఆటగాళ్లు అయిపోతున్నారు. 5వ అంతస్తులో ఉన్నా...

ఓఎల్‌ఎక్స్‌‌లో రెమిడిసివిర్ కరోనా ఇంజెక్షన్ విక్రయం, ధరంతో తెలుసా?

న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు కరోనా వ్యాక్సిన్లను అందిస్తున్న విషయం తెలిసిందే. మరో కొత్త టీకా రెమిడిస్‌విర్‌ను కూడా అత్యవసర వినియోగానికి అనుమతించిన విషయం తెలిసిందే....

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe