Saturday, April 17, 2021

ఐసీయూ నుండి ప్రత్యేక గదికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ .. కోలుకుంటున్నారన్న రాష్ట్రపతి భవన్ వర్గాలు

National

oi-Dr Veena Srinivas

|

భారతదేశ రాష్ట్రపతి, దేశ ప్రధమ పౌరుడు రామ్ నాథ్ కోవింద్ ఎయిమ్స్‌లో కార్డియాక్ బైపాస్ సర్జరీ విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఛాతీలో కలిగిన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన రామ్ నాథ్ కోవింద్ కు మార్చి 30వ తేదీన ఢిల్లీ ఎయిమ్స్ లో కార్డియాక్ బైపాస్ సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) నుంచి ప్రత్యేక గదికి తరలించినట్లు రాష్ట్రపతి భవన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు . ఆయన ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడుతోందని అన్నారు.

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు విజయవంతంగా బైపాస్ సర్జరీ .. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడి

భారత రాష్ట్రపతి కోవింద్ ను ఈ రోజు ఎయిమ్స్ లోని ఒక ప్రత్యేక గదికి తరలించారు. ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. వైద్యులు అతని పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు మరియు విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారు అని ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు రాష్ట్రపతి భవన్ వర్గాలు .

భారతదేశ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (75) మార్చి 30 న ఢిల్లీ ఎయిమ్స్ వద్ద కార్డియాక్ బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఛాతీ అసౌకర్యం గురించి ఫిర్యాదు చేయడంతో ఆరోగ్య పరీక్షల తరువాత ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు. దీంతో ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్నారు.

కోవింద్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వారిలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా ఉన్నారు. అప్పటి బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ, ఆరోగ్యం గురించి ఆరా తీయడానికి అధ్యక్షుడు కోవింద్ కొడుకుకు కాల్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి పై వాకబు చేశారు .

శస్త్రచికిత్స తర్వాత ఒక రోజు, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తాను బాగా కోలుకుంటున్నానని ట్వీట్ చేశాడు . తనను చూసుకున్న వైద్యులు మరియు సంరక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. బైపాస్ సర్జరీ తర్వాత నేను బాగా కోలుకుంటున్నాను, వైద్యులు మరియు వైద్య సిబ్బంది యొక్క అద్భుతమైన అంకితభావానికి కృతజ్ఞతలు. భారతదేశ, విదేశాల నుండి వచ్చిన పౌరులు , ఇతర నాయకులు, తాను త్వరగా కోలుకోవాలని తనపై అభిమానం చూపించడం పై స్పందించిన ఆయన మీ అందరికీ నా కృతజ్ఞతలు! “అని రాష్ట్రపతి కోవింద్ అధికారిక హ్యాండిల్ నుండి ట్వీట్ చేశారు.


Source link

MORE Articles

Peloton is fighting a recall request on its treadmill after a child died last month

Peloton is resisting a request from the Consumer Product Safety Commission (CPSC) to recall its Tread Plus treadmill, which was involved...

Yes, Twitter was down — at least on the East Coast | Engadget

These days, fail whale sightings are few and far between, but Twitter appears to be suffering a serious outage at the moment. It's...

Internal memo: ByteDance seeks to increase China-based ad revenue from ~28B in 2020 to $39.8B in 2021; TikTok's Chinese twin Douyin had 610-620M DAUs...

Zheping Huang / Bloomberg: Internal memo: ByteDance seeks to increase China-based ad revenue from ~28B in 2020 to $39.8B in 2021; TikTok's Chinese...

Squarespace files to go public – TechCrunch

Squarespace is going public, Apple shares some music payment details and Twitter bans the founder of the right-wing media organization Project Veritas. This...

వైఎస్ షర్మిల నుంచి పిలుపు: కొండా సురేఖ దంపతులు ఏమన్నారంటే..?, జగన్‌పై సంచలనం

షర్మిల పార్టీ నుంచి పిలుపు ఈ క్రమంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మంచి అనుంబంధం ఉన్న కొండా సురేఖ,...

బీజేపీ విజ్ఞప్తికి టీఆర్ఎస్ ఓకే.. లింగోజిగూడలో పోటీకి దూరం

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలోని లింగోజిగూడ డివిజన్ ఉపఎన్నిక ఏకగ్రీవం కోసం పోటీకి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. బీజేపీ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో...

ఈ నగరానికి ఏమయ్యింది? కాకినాడ స్మార్ట్ సిటీనా, డెకాయిట్ సిటీనా!?

చిన్నప్పుడు ఎప్పుడూ షటిల్, టెన్నిస్ ఆడనివారు కూడా రాత్రి 6 నుండీ అర్ధరాత్రి 2 వరకూ కాకినాడ లో దోమల బ్యాట్ తో ప్రజలు అద్భుతమైన ఆటగాళ్లు అయిపోతున్నారు. 5వ అంతస్తులో ఉన్నా...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe