ఈ మేరకు కంపెనీ ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది. ‘ది సైలెంట్ బీస్ట్.. కమింగ్ సూన్..’ అంటూ ఓకినావా ఓ టీజర్‌ను విడుదల చేసింది. ఒకినావా ఓకి 100 ఎలక్ట్రిక్ బైక్‌కు సంబంధించిన మొదటి ప్రోటోటైప్‌ను తొలిసారిగా 2018 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. రానున్న వారాల్లో ఇది మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా.

వాస్తవానికి గత సంవత్సరం పండుగ సీజన్లోనే ఓకినావా ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టాలని ప్లాన్ చేసింది. అయితే, కొన్ని అనివార్య కారణాల వలన ఈ ప్రణాళికలు వాయిదా పడ్డాయి. అయితే, ఇప్పుడు ఎట్టకేలకు ఓకినావా ఓకి100 ఎలక్ట్రిక్ బైక్ భారత మార్కెట్లోకి ప్రవేశిస్తుందని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది.
MOST READ:కార్ టైర్ మారుస్తూ కనిపించిన డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి [వీడియో]

ఓకినావా వెబ్సైట్లో కూడా కంపెనీ కొత్త టీజర్‌ను అప్డేట్ చేసింది. ఓకినావా ఓకి100 మార్కెట్లో విడుదలైన తర్వాత, దీని ధర సుమారు రూ.1 లక్ష (ఎక్స్-షోరూమ్) రేంజ్లో ఉంటుందని అంచనా. ఇది ఈ విభాగంలో నేరుగా రివాల్ట్ ఆర్వి400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌తో పోటీపడే అవకాశం ఉంది.

ఓకినావా తమ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను పూర్తిగా భారతదేశంలో అభివృద్ధి చేసి, నిర్మిస్తామని గతంలో ధృవీకరించింది. ఈ మోటార్‌సైకిల్ తయారీలో పూర్తిగా 100 శాతం స్థానికీకరణను కలిగి ఉండాలని కంపెనీ యోచిస్తోంది. ఈ మోటార్‌సైకిల్‌లో ఉపయోగించబోయే బ్యాటరీ ప్యాక్స్‌ని కూడా స్థానికంగానే తయారు చేయనున్నారు.
MOST READ:45 లీటర్ల ఇంధన ట్యాంక్‌లో 48 లీటర్ల పెట్రోల్.. దీనితో మొదలైన గొడవ.. చివరికి ఏమైందంటే

ప్రస్తుతానికి ఓకినావా ఓకి100 ఎలక్ట్రిక్ మోటారుసైకిల్ యొక్క ఖచ్చితమైన పవర్‌ట్రెయిన్ గణాంకాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే, ఓకి100 గంటకు 100 కి.మీ వేగంతో పరుగులు తీస్తుందని అంచనా. ఓకినావా ఓకి100 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ పెర్ఫార్మెన్స్, ఒక సాధారణ పెట్రోల్ పవర్డ్ 125సిసి ఇంజన్‌తో నడిచే మోటార్‌సైకిల్‌తో సమానంగా ఉంటుంది.

గడచిన 2018 ఆటో ఎక్స్‌పోలో ఓకినావా ప్రదర్శించిన ఓకి100 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌లోని పవర్‌ట్రెయిన్ (ఎలక్ట్రిక్ మోటార్)ను పెట్రోల్ బైక్‌లలో మాదిరిగానే బైక్ సెంటర్లో అమర్చారు. సాధారణంగా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లలో మోటార్‌ను వెనుక చక్రంలోని హబ్‌లో అమర్చుతారు. అయితే, ఓకి100 మాత్రం బైక్ సెంటర్లో అమర్చి బెల్ట్ ద్వారా దీనిని నడిపించే అవకాశం ఉంది.
MOST READ:చెన్నైలో కొత్త డీలర్షిప్ ప్రారంభించిన వోల్వో.. పూర్తి వివరాలు

ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌లో ఎలక్ట్రిక్ మోటార్‌ను బైక్ సెంటర్లో అమర్చడం వలన బరువును సమానంగా సమతుల్యం చేయబడుతుందని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, ఇలా చేయటం వలన రైడింగ్ సామర్థ్యాన్ని మరియు హ్యాండ్లింగ్‌ను మెరుగుపరచేందుకు తక్కువ గురుత్వాకర్షణ కేంద్రాన్ని (లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ) ఏర్పాటు చేసేందుకు కూడా ఇది సహాయపడుతుంది.

ఈ ఎలక్ట్రిక్ మోటారుసైకిల్‌కు సంబంధించి మరిన్ని వివరాలను తెలియాల్సి ఉన్నాయి. కాగా, ఇందులో పూర్తి ఎల్ఈడీ లైటింగ్, పూర్తి-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లే, టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ (ఫ్రంట్ & రియర్) మరియు ఇరు వైపులా డిస్క్ బ్రేక్‌లు వంటి ఫీచర్లు లభించవచ్చని అంచనా.
MOST READ:ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ర్యాలీ చేపట్టిన కలకత్తా సీఎం.. ఎందుకో తెలుసా!