ఓర్నీ వేషాలో.. ఏఐతో ‘పోప్’ కోరికను తీర్చేసుకున్న ట్రంప్

Date:

Share post:


ప్రపంచానికి పెద్దన్నకు అధ్యక్షుడిగా వ్యవహరించటం అంటే మాటలు కాదు. ఇంతటి అత్యున్నత పదవిలో ఉండి కూడా చిన్నపిల్లాడి మాదిరి వ్యవహరించే ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్.. తాజాగా మరో అల్లరి పనితో ఆగమవుతున్న పరిస్థితి. కోట్లాది మంది మనోభావాలు ఏమవుతాయన్న ధ్యాస లేకుండా.. తాను కోరుకున్నది తీర్చుకునేందుకు ఏఐను వాడేసుకోవటం చూస్తే.. ఓర్నీ వేషాలో అనుకోకుండా ఉండలేం. ఇంతకూ ట్రంప్ చేసిన సరదా పనికి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయినా.. ఇలాంటి వాటిని ట్రంప్ పెద్దగా పట్టించుకోరనుకోండి. తనకు అవకాశం లభిస్తే తానే పోప్ అవుతానని.. అదే తన మొదటి ఛాయిస్ అంటూ ఇటీవల చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. తాజాగా అన్నంత పని చేశారు. కాకుంటే.. ఏఐ ఇమేజ్ తో. పోప్ వేషధారణతో ఉన్న తన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

పోప్ వేషంలో ఉన్న ట్రంప్ ఫోటో వైరల్ గా మారింది. అయితే.. ఈ ఫోటోపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి పోప్ వేషధారణలో కనిపించటాన్ని పలువురు తప్పు పట్టారు. చాలా కొద్ది మంది మాత్రం ట్రంప్ అటెంప్టును మెచ్చుకున్నారు. పోప్ వేషంలో ట్రంప్ కనిపించటం గౌరవప్రదంగా లేదన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. పోప్ మరణించిన కొద్ది రోజులకేఇలాంటి వేళకోళం ఏమిటంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

బైబిల్ ప్రవచించిన పది నైతిక విలువలను పాతరేసిన ట్రంప్ లాంటి వ్యక్తి.. ఇప్పుడు అత్యంత గౌరవప్రదమైన పోప్ వేషంలో కనిపించటం విడ్డూరంగా ఉందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు డెమోక్రాటిక్ నేతలు. ఏమైనా.. ఇలాంటి చేష్టలు ట్రంప్ కు మాత్రమే సాధ్యమవుతాయని చెప్పక తప్పదు.

The post ఓర్నీ వేషాలో.. ఏఐతో ‘పోప్’ కోరికను తీర్చేసుకున్న ట్రంప్ first appeared on namasteandhra.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ చేపట్టిన సంగతి తెలిసిందే. పాక్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన మెరుపు దాడి...

హాట్ లైన్లో భారత్ – పాక్ మీటింగ్ షురూ.. భారత్ డిమాండ్లు ఇవే..!

కాశ్మీర్‌లోని పహాల్గాం ఉగ్రదాడి తర్వాత.. భారత్‌ చేపట్టిన.. ఆపరేషన్ సింధూర్‌ దెబ్బకు భారీ నష్టాలే చెవి చూసింది పాకిస్తాన్. తర్వాత అమెరికా అధ్యక్షుడు...

మహేష్ సినిమా విషయంలో మౌనంగా జక్కన్న.. ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ( Superstar Mahesh Babu, Director Rajamouli )కాంబినేషన్లో ఒక సినిమా...

పహల్గాం దాడి-భారత్‌ స్పందన – Navatelangana

- Advertisement - మే ఏడవ తేదీ అర్ధరాత్రి తర్వాత భారత సైనిక దళాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌ భూభాగంలోని తొమ్మిది టెర్రరిస్టు...