Tuesday, April 13, 2021

ఓవైసీ, సిద్ధిఖీలతో బీజేపీ భారీ కుట్ర -బయటి గుండాలను తరిమేద్దాం -బెంగాల్ ప్రచారంలో దీదీ నిప్పులు

ఆ ఇద్దరితో కలిసి బీజేపీ కుట్రలు

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ బొత్తిగా బరితెగించి విభజన రాజకీయాలు చేస్తోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. హిందూ, ముస్లింలను విభజించడానికి ఏఐఎంఐఎం, ఐఎస్ఎఫ్ పార్టీలను బీజేపీ వాడుకుంటోందని దుయ్యబట్టారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని రాయిడిఘిలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు.

 ఓవైసీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే..

ఓవైసీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే..

అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం, అబ్బాస్ సిద్ధిఖీ నాయకత్వంలోని ఐఎస్ఎఫ్ పార్టీలపై టీఎంసీ చీఫ్ మమత విమర్శలు గుప్పించారు. హిందూ, ముస్లింలను విభజించడానికి ఈ రెండు పార్టీలకు బీజేపీ డబ్బులిచ్చిందని ఆరోపించారు. ‘‘మీరు వేరుపడాలని కోరుకోకపోతే, మీరు ఎన్ఆర్‌సీని కోరుకోకపోతే, ఆ పార్టీలకు ఓటు వేయకండి. నిజానికి ఎంఐఎం లేదా ఐఎస్ఎఫ్ లకు ఓటేస్తే అది బీజేపీకి వేసినట్లే. మన ఆడబిడ్డలు కిడ్నాప్ అవుతారని వాళ్ళు బెదిరిస్తున్నారు. బయటివారైన బీజేపీ, ఎంఐఎం గూండాలకు బెంగాల్ నుంచి తరిమేద్దాం” అని మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.

అశాంతితో బీజేపీకి లబ్ది..

అశాంతితో బీజేపీకి లబ్ది..

బెంగాల్ లోని హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులంతా ‘హరే కృష్ణ హరే హరే, తృణమూల్ ఘరే ఘరే’ అంటున్నారని, కానీ బీజేపీవారు మాత్రం ‘హరే కృష్ణ హరే హరే, హిందూ, ముస్లిం భాగ్ కరే, షెడ్యూల్డు క్యాస్ట్స్ కో భాగ్ కరే’ అంటున్నారని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీవారు బెంగాల్‌ను నాశనం చేస్తున్నారని తిట్టిపోశారు. హిందువులు, ముస్లింలు కలిసి టీ తాగడం, కలిసిమెలిసి దుర్గా పూజ చేయడం బెంగాల్ సంస్కృతి అని, బెంగాల్‌లోని గ్రామాల్లో అశాంతి రాజేయడం ద్వారా లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. బెంగాల్ ఎన్నికల్లో మూడో దశ పోలింగ్ ఏప్రిల్ 6న జరుగుతుంది. ఎనిమిదో, చివరి దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరుగుతుంది.


Source link

MORE Articles

The Web Robots Pages

The Web Robots Pages Web Robots (also known as Web Wanderers, Crawlers, or Spiders), are programs that traverse the Web automatically. Search engines such as Google...

नवरात्रि के व्रत में अगर खाएंगे ये चीजें तो नहीं होंगे डिहाइड्रेशन के शिकार

नवरात्रि शुरू हो गए हैं. इन दिनों बहुत से लोग नौ दिनों तक व्रत रखते हैं. इन दिनों मां दुर्गा के नौ स्वरूपों...

పసుపు కండువాతో Jr.NTR : టీడీపీ పగ్గాలకు రెడీ – ట్రిపుల్ ఆర్ ద్వారా సంకేతాలు..?

పసుపు కండువా తలకట్టుతో జూనియర్.. ఈ పరిస్థితుల మధ్య తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కొద్దిసేపటి కిందటే విడుదలైన ఆర్ఆర్ఆర్ (RRR) ఉగాది లుక్‌లో జూనియర్ ఎన్టీఆర్...

Weight Loss Tips: जीरा और दालचीनी, किचन के ये 2 मसाले तेजी से वजन घटाने में करेंगे मदद

नई दिल्ली: जब बात मोटापा कम करने की आती है तो ज्यादातर लोग डाइटिंग (Dieting) करने लग जाते हैं और सोचते हैं कि...

Romance: ఆఫీసులో డబుల్ కాట్ బెడ్, నాటుకోడి ఆంటీతో ఇన్స్ పెక్టర్ సరసాలు, ఐఏఎస్ ఎంట్రీతో !

చెన్నై/ బెంగళూరు: రెవెన్యూ శాఖ అధికారి కామంతో రగిలిపోయాడు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఓ అధికారికి కార్యాలయం కేటాయించింది. ప్రభుత్వ కార్యాలయాన్ని ఆ అధికారి అతనికి ఎలా కావాలో అలా మార్చుకున్నాడు....

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe