National
-BBC Telugu

Click here to see the BBC interactive
థాయ్‌లాండ్‌లో మోడలింగ్ ఏజెన్సీ నడిపిస్తున్న ఓ వ్యక్తి కంప్యూటర్ నుంచి 5 లక్షలకుపైగా చిన్నారుల అభ్యంతరకర ఫొటోలను పోలీసులు స్వాధీనం చేసుకుని, ఏజెన్సీ యజమానిని అరెస్టు చేశారు.
చిన్నారులపై లైంగిక అకృత్యాలకు పాల్పడినవారిపై నమోదు చేసే వివిధ సెక్షన్ల కింద 23 ఏళ్ల నెనె డాన్యుడెచ్పై అభియోగాలు నమోదు చేశారు.
ఆస్ట్రేలియా నిఘా అధికారుల నుంచి వచ్చిన సమాచారంతో తాము ఈ ఏజెన్సీపై దాడి చేసినట్లు థాయ్ పోలీసులు వెల్లడించారు.
న్యూజీలాండ్‌లో చైల్డ్ ట్రాఫికింగ్‌కు వ్యతిరేకంగా పోరాడే ‘ఆపరేషన్ అండర్‌గ్రౌండ్ రైల్రోడ్’ అనే స్వచ్ఛంద సంస్థ కూడా ఈ ఆపరేషన్‌కు సహకరించినట్లు వారు తెలిపారు.
నెనె డాన్యుడెచ్ నడుపుతున్న ఈ మోడలింగ్ ఏజెన్సీకి దేశంలోనే బెస్ట్ చైల్డ్ మోడలింగ్ ఏజెన్సీగా పేరున్నట్లు బ్యాంకాక్ పోస్ట్ తెలిపింది.

నిందితుడి కంప్యూటర్లో వేలమంది థాయ్‌లాండ్ చిన్నారులతోపాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన బాలికల ఫొటోలు లభించాయని దేశాలవారీగా ఈ ఫొటోలను వర్గీకరించి చైల్డ్ పోర్నోగ్రఫీ కోసం వాడుతున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.
“ఈ స్కామ్‌ను బైటపెట్టడంపట్ల మేం చాలా గర్వంగా ఫీలవుతున్నాం” అని పోలీస్ శాఖలో డిప్యూటీ డైరక్టర్‌గా పని చేస్తున్న ఖెమాచార్ట్ ప్రఖ్యోంగ్మనీ న్యూస్ ఏషియా ఛానల్‌తో అన్నారు.
2013 నుంచి 8,400 మంది చిన్నారులు ఈ ఏజెన్సీలో మోడలింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నారని పోలీసులు గుర్తించినట్లు న్యూస్ ఏషియా ఛానెల్ పేర్కొంది.
ఆస్ట్రేలియన్ ఏజెన్సీలు సమాచారం ఇచ్చిన ఏడాది తర్వాత ఈ ఆపరేషన్ నిర్వహించారు బ్యాంకాక్ పోలీసులు. గతంలో ఆపరేషన్ కాస్టింగ్ కాల్ పేరుతో ఆపరేషన్ నిర్వహించామని, కానీ అప్పట్లో ఒకటే ఫొటో దొరికిందని పోలీస్ ఉన్నతాధికారి కల్నల్ కొరావట్ తెలిపారు.
ఈ ఫొటో తీసిని వ్యక్తిని గుర్తించి విచారించగా నెనె డాన్యుడెచ్ ఏజెన్సీలో ఇలాంటి చిత్రాలు అనేకం ఉన్నట్లు తేలిందని పోలీసులు చెప్పారు. ఈ ఏజెన్సీ అనేకమంది చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడి ఉంటుందని కల్నల్ కొరావట్ అనుమానం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)