పచ్చనికాపురంలో
రాయబరేలి దాల్మయి కోట్ వ్యాలీ మండలం బలభద్రాపూర్ గ్రామంలో సంతోష్ కుమార్, భార్య రేణు, కూతురు ఆరుషి ఉంటున్నారు. తండ్రి చిట్టన్తో కలిసి వారు ఉంటున్నారు. సంతోష్ ఉద్యోగ రీత్యా ముంబైలో ఉంటాడు. ఇటీవల ఇంటికి వచ్చాడు. హోలీ పండుగ సందర్భంగా భార్య తన పుట్టింటికి వెళ్తానంటే మార్చి31న అత్తవారింట్లో దింపి వచ్చాడు.

ఇంటికి రాకపోవడంతో..
పండుగ అయిపోయినా ఆమె ఇంటికి తిరిగి రాలేదు. అత్తావారింట్లో విచారించగా పండగ అయ్యాక వెళ్లిపోయినట్టు వాళ్లు తెలిపారు. భార్యా, కుమార్తె కోసం సంతోష్ గాలించారు. ఆమె గురించి తెలిసిన వారు ఒకరు సమాచారం అందించారు. ఆమె తన ప్రియుడు సచిన్‌తో కలిసి పక్క ఊరిలో ఉంటోందని చెప్పారు. సంతోష్ ఆ ఊరు వెళ్లి తన భార్యను ఇంటికి తీసుకు వచ్చాడు. ఇంటికి వచ్చాక కూతురు విషయం అడగ్గా ఆమె సమాధానం ఇవ్వలేదు. కుటుంబ సభ్యులు అంతా గాలించారు. అయినా కూతురు ఆచూకీ లభించలేదు.

పక్క గ్రామంలో..
మర్నాడు పక్క గ్రామంలోని వ్యవసాయ బావిలో ఒక బాలిక మృతదేహాం ఉందని పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్ధలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. ఆరుషిగా తెలుసుకున్నారు. రేణును అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ప్రియుడితో కలిసి తానే హత్య చేసినట్లుగా అంగీకరించింది. హోలీ పండగకి పుట్టింటికి వెళ్లిన రేణు, పండగ అయ్యాక ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలు దేరింది. కానీ పక్క గ్రామంలో ఉన్న తన ప్రియుడు సచిన్ వద్దకు వచ్చింది. అక్కడ వారిద్దరూ సన్నిహితంగా ఉండటం చూసిన ఐదేళ్ల అరుషి తండ్రికి ఈవిషయం చెప్తానంది.

హతమార్చి
భయపడిన సచిన్, రేణు బాలికను గొంతుకోసి బావిలో పడేసినట్లు ఒప్పుకున్నారు. ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకే బావిలో పడేసినట్లు అంగీకరించారు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేణు, ఆమె ప్రియుడు సచిన్‌పై కేసు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.