Friday, July 30, 2021

కరోనా టీకాల తర్వాత సీఏఏ అమలు -అమిత్ షా వెల్లడి -నందిగ్రామ్‌లో పోటీపై మమత సవాల్

National

oi-Madhu Kota

|

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుపై వెనుకడుగు వేయబోమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే సీఏఏను పున:ప్రారంభిస్తామని చెప్పారు. అయితే, బీజేపీ ఆటలను బెంగాల్ లో సాగనీయబోమంటోన్న టీఎంసీ అధినేత్రి, ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ.. కేంద్ర మంత్రిని మరో సవాలు విసిరారు..

2019 చివర నుంచి గతేడాది కరోనా లాక్ డౌన్ ముందు వరకూ సీఏఏ వ్యతిరేక ఉద్యమాలు దేశాన్ని అట్టుడికించిన సంగతి తెలిసిందే. కాగా, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై వదంతులను నమ్మవద్దని అమిత్ షా కోరారు. పశ్చిమ బెంగాల్‌లోని మతువాలో గురువారం ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సినేషన్ పూర్తయిన వెంటనే అందరికీ పౌరసత్వం ఇస్తామన్నారు.

సీఏఏ ద్వారా ముస్లింల పౌరసత్వాన్ని తొలగించే నిబంధన ఏదీ ఈ చట్టంలో లేదని, గడచిన 70 ఏళ్ళ నుంచి భారత దేశంలో నివసిస్తున్నవారందరికీ పౌరసత్వం ఇస్తామని, సీఏఏపై పుకార్లను ప్రచారం చేసేవారి చేతుల్లో పావులుగా మారవద్దని ప్రజలకు అమిత్ షా పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే.. బీజేపీని సీఎం మమతా బెనర్జీ వాషింగ్ మెషిన్‌గా అభివర్ణించారు. అందులోకి వెళ్లిన వారు నలుపు నుంచి తెలుపు వర్ణంలోకి మారతారని ఎద్దేవా చేశారు.

 CAA will be implemented after Covid vaccination ends, says Amit Shah, mamata slams

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా గురువారం నిర్వహించిన బెంగాల్ పర్యటనపై సీఎం మమత రుసరుసలాడారు. షా పర్యటనపై స్పందించబోనంటూనే.. ఎవరికైనా బెంగాల్ లో పర్యటించే హక్కు ఉందని, ఒక్కడికొచ్చి ఏదైనా మాట్లాడొచ్చని అన్నారు. అయితే షా మాత్రం బెంగాల్ వచ్చినప్పుడల్లా బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. అమిత్‌షా నందిగ్రామ్‌లో పోటీ చేస్తారా? అంటూ మమత సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో టీఎంసీ మరోసారి విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యాక్తం చేశారు.


Source link

MORE Articles

diseases caused by obesity: आपको इन गंभीर बीमारियों का शिकार बना सकता है मोटापा, इन 5 तरीकों से वजन करें कंट्रोल

diseases caused by obesity: उल्टा सीधा खानपान और गलत लाइफस्टाइल के चलते कई लोग मोटापे से पीड़ित (suffering from obesity) हैं. हेल्थ एक्सपर्ट...

హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో 800 మంది ఎంపీటీసీలు .. కేసీఆర్ కు ఎంపీటీసీల ఫోరం అల్టిమేటం!!

ఓరుగల్లు వేదికగా పోరు బాట పట్టిన ఎంపీటీసీలు పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లు వేదికగా ఎంపీటీసీల ఫోరం నిర్వహించిన సమావేశంలో, ఎంపీటీసీల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు...

జగన్ బెయిల్ రద్దు: షాకింగ్ పాయింట్ -14 బదులు 25 ఎలా? -ఏ2 సాయిరెడ్డి కూడా జైలుకే: ఎంపీ రఘురామ

జగన్ బెయిల్ రద్దు తీర్పు.. క్విడ్ ప్రోకో సంబంధిత పలు కేసుల్లో నిదితుడైన వైఎస్ జగన్ తన ముఖ్యమంత్రి పదవిని అడ్డంపెట్టుకుని కేసును ప్రభావితం చేస్తున్నారని, సహ...

ఏపీ బాటలో యూపీ, జగన్ ను అనుసరిస్తున్న యోగి : కళ్ళు తెరిచి చూడు బాబు అంటున్న సాయిరెడ్డి

ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థపై గతంలో టీడీపీ విమర్శలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. గ్రామ...

బసవరాజు బొమ్మై భావొద్వేగం.. శునకం చనిపోతే అలా.. అప్పటి వీడియో నేడు వైరల్

సీఎం కొడుకుగా.. బొమ్మై.. తండ్రి కూడా ఎస్ఆర్ బొమ్మై కూడా సీఎంగా పనిచేశారు. బసవరాజు బొమ్మై హోం మంత్రి నుంచి చీఫ్ మినిస్టర్‌గా ప్రమోట్ అయ్యారు. హోం...

AMD announces the Radeon RX 6600 XT, a $379 “1080p beast” that arrives on August 11

What just happened? After months of rumors, leaks, and speculation, AMD...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe