Monday, May 16, 2022

కరోనా విలయంలో చైనా అద్భుతం -ఆకలి కేకలు సమాప్తం -కడు పేదలు లేరంటూ జిన్‌పింగ్‌ ప్రకటన

పేదరికంపై సంపూర్ణ విజయం..

చైనా మరో ఘనత సాధించినట్లు ప్రకటించింది. తమ దేశంలో కడు పేదలు ఎవరూ లేరని అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌ గురువారం అధికారికంగా ప్రకటించారు. పేదరికంపై సంపూర్ణ విజయం సాధించినట్లు ఆయన బీజింగ్‌లో ఘనంగా ప్రకటించారు. ఈ బృహత్తర కార్యక్రమంలో దేశం విజయం సాధించడానికి కృషి చేసిన 1,981 మందికి, 1,501 సంస్థలకు ఆయన రిప్రజెంటేటీవ్స్‌ ఆఫ్‌ నేషనల్‌ హానరీ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ అవతరించి మరో నాలుగు నెలల్లో వందేళ్లు పూర్తవుతున్న సమయంలో ఈ ప్రకటన వెలువడటం ప్రాధాన్యం సంతరించుకొంది.

 మానవ చరిత్రలోనే అద్భుతం..

మానవ చరిత్రలోనే అద్భుతం..

దేశం నుంచి కడు పేదరికాన్ని పూర్తిగా రూపుమాపడం అనే ప్రక్రియను ‘మానవ చరిత్రలోనే ఒక అద్భుతం’ అని చైనా అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. ప్రస్తుతం ఉన్న ప్రమాణాల ప్రకారం 832 కౌంటీలను, 1,28,000 గ్రామాలను , దాదాపు 10 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చినట్లు ఆ పత్రిక పేర్కొంది. రోజువారీ ఆదాయం 2.30డాలర్ల కంటే తక్కువ ఉన్న వారిని చైనాలో దారిద్యరేఖకు కింద ఉన్నట్లు భావిస్తారు. ఇది పేద దేశాలకు ప్రపంచ బ్యాంక్‌ సూచించిన 1.90 డాలర్ల రోజువారీ ఆదాయం కంటే కొంచెం ఎక్కువ. కానీ..

 చైనాలో లెక్కలు అంతేమరి..

చైనాలో లెక్కలు అంతేమరి..

అత్యధిక ఆదాయం ఉన్న దేశాలకు ప్రపంచ బ్యాంక్‌ నిర్దేశించిన రోజువారీ ఆదాయ ప్రామాణిక మొత్తం 5.50 డాలర్ల కంటే చైనాలో గణాంకాలు చాలా తక్కువ. చైనాది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. వాస్తవానికి చైనాలో పేదరిక నిర్మూలన ఉద్యమంలో వేలకొద్దీ అక్రమాలు జరిగినట్లు కేసులు నమోదయ్యాయి. అధికారులే వారి చుట్టాలను, బంధువులను పేదలుగా ప్రభుత్వ నిధులను మళ్లించడం అక్కడ సర్వసాధారణమని యునివర్శిటీ ఆఫ్‌ వెస్టర్న్‌ ఆంట్రియో ప్రొఫెసర్‌ టెర్రీ పేర్కొన్నారు. దీనికి తోడు దారిద్యరేఖ ప్రామాణిక మొత్తం జాతీయ ఆదాయ సగటుతో పోలిస్తే చాలా తక్కువ. ఇప్పటికీ చైనాలో 13శాతం మంది పేదరికంలో ఉండే అవకాశం ఉందని టెర్రీ వివరించారు.

 సంస్కరణలు ఫలించాయా?

సంస్కరణలు ఫలించాయా?

పేదరికం లెక్కలు వేయడానికి చైనా అధికారులు ఇంటింటికీ తిరిగి ఆదాయం, ఇంటి పరిస్థితులు, ఆరోగ్యబీమా, పాఠశాల మానేసిన వారిని గుర్తించి.. మెరుగుపర్చారు. ఇప్పుడు చైనాలో ప్రతి ఒక్కరూ పాఠశాలకు వెళ్లాల్సిందేనని సౌత్‌చైనా మార్నింగ్‌పోస్టు పేర్కొంది. దీంతోపాటు శిశుమరణాలు కూడా గణనీయంగా తగ్గినట్లు ఇటీవల ఐరాస పేర్కొంది. చైనాలో 1970లో ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. నాటి నుంచి 800 మిలియన్ల మందిని పేదరికం నుంచి బయటవేసినట్లు ప్రపంచ బ్యాంక్‌ పేర్కొంది. కమ్యూనిస్టు దేశమే అయినప్పటికీ, పెట్టుబడిదారీ విధానానికి ఏమాత్రం తీసిపోని విధంగా చైనాలో పాలన, సంస్కరణల అమలు సాగుతుందన్న సంగతి తెలిసిందే.


Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe