Thursday, June 17, 2021

కరోనా సెకండ్ వేవ్ ను ఆపాలి , సత్వర నిర్ణయాలు తీసుకోకుంటే కరోనా కంట్రోల్ కష్టం : సీఎంలతో పీఎం మోడీ

సీఎం లతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ … కరోనా పరిస్థితిపై సమీక్ష

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుందని, సమర్థంగా ఎదుర్కోడానికి అన్ని రాష్ట్రాలు నిర్ణయాత్మక చర్యలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రులతో పేర్కొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ భారత్ లో తాజాగా కరోనా పరిస్థితి, వైరస్ నియంత్రణ, వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుంది తదితర అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు.

 కేసులు పెరుగుతున్న క్రమంలో అలెర్ట్ అయిన కేంద్రం

కేసులు పెరుగుతున్న క్రమంలో అలెర్ట్ అయిన కేంద్రం

దేశంలో గత కొంతకాలంగా రోజువారి కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. ఇప్పటికే పలు రాష్ట్రాలలో దారుణమైన కరోనా పరిస్థితులు, మరోమారు భారత్ ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్ లో వర్చువల్ విధానంలో సీఎంలతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

నేడు భారతదేశంలో 96% కంటే ఎక్కువ కేసులు కరోనా నుండి కోలుకున్నారని పేర్కొన్నారు.

కరోనాను నియంత్రించగలమని అతి విశ్వాసం వద్దు .. అప్రమత్తత అవసరం

కరోనాను నియంత్రించగలమని అతి విశ్వాసం వద్దు .. అప్రమత్తత అవసరం

మరణాల రేటు అత్యల్పంగా ఉన్న దేశాలలో భారతదేశం ఒకటని ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో అన్నారు. కోవిడ్ -19 వ్యాప్తికి వ్యతిరేకంగా త్వరితగతిన నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. కరోనా సెకండ్ వేవ్ ను వెంటనే ఆపాలని అన్నారు. కరోనాను నియంత్రించగలమని అతి విశ్వాసం మంచిది కాదన్నారు. గత కొన్ని వారాలుగా దేశంలోని 70 జిల్లాల్లో కేసుల సంఖ్య 150 శాతానికి పైగా పెరిగిందని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయా రాష్ట్రాల సీఎంలతో పిఎం మోడీ అన్నారు.

పరిస్థితి ఇలాగే కొనసాగితే కరోనా వ్యాప్తి లేని రాష్ట్రాలలో కూడా కేసులు పెరిగే అవకాశం

పరిస్థితి ఇలాగే కొనసాగితే కరోనా వ్యాప్తి లేని రాష్ట్రాలలో కూడా కేసులు పెరిగే అవకాశం

ఇక ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కరోనా వ్యాప్తి లేని రాష్ట్రాలలో కూడా కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు . మరోమారు దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందే పరిస్థితి రావచ్చు అని ప్రధాని చెప్పారు. చిన్న చిన్న నగరాల్లో సైతం కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని, వైద్య సదుపాయాల విషయంలో కూడా అలెర్ట్ గా ఉండాలని సూచించారు.

వ్యాక్సినేషన్ చేసిన తర్వాత వ్యర్ధాల విషయంలో జాగ్రత్త వహించాలని మోడీ ముఖ్యమంత్రులకు సూచించారు .


Source link

MORE Articles

Report: Ring provided at least 100 LAPD officers with free devices or discount codes and encouraged them to recommend its products to fellow LAPD...

Johana Bhuiyan / Los Angeles Times: Report: Ring provided at least 100 LAPD officers with free devices or discount codes and encouraged them...

హైకోర్టుకు చేరిన గెలుపు పంచాయతీ: సువేంద్ విక్టరీపై కోర్టులో మమతా సవాల్

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఊగిసిలాట మధ్య స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అయితే న్నికల ఫలితాలను సవాల్‌ చేస్తూ...

శభాష్ హర్లీ.. నదిలో కొట్టుకుపోతున్న జింక పిల్లను కాపాడి.. నెటిజన్ల ప్రశంసలు

కనిపించని హర్లీ.. అమెరికాలో హర్లీ అనే శునకాన్ని పెంచుకుంటున్నారు. అయితే అదీ ఈ నెల మొదటి వారం నుంచి కనిపించడం లేదు. దీంతో యజమాని కంగారు పడ్డారు....

इस समस्या से जूझ रहे पुरुष करें कद्दू के बीज का सेवन, मिलेंगे गजब के फायदे!

नई दिल्ली: अगर आप शुगर पेशेंट हैं या फिर शारीरिक कमजोरी से जूझ रहे हैं तो ये खबर आपके काम की है. इस...

43 కిలోల బంగారం స్వాధీనం.. రూ.21 కోట్లు విలువ.. ఇక్కడే

మణిపూర్‌లో భారీగా బంగారం పట్టుబడింది. ఇంఫాల్‌లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు చేసిన తనిఖీల్లో ఏకంగా రూ.21 కోట్లు విలువ చేసే గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. అదీ మొత్తం 43 కిలోలు...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గ్యాస్ లీకేజీ: తీవ్ర అస్వస్థతో ఒకరు మృతి, ఆస్పత్రిలో మరో ఇద్దరు

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం(రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం)లో గ్యాస్ పైప్ లీకైంది. దీంతో అక్కడే ఉన్న ముగ్గురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. నర్సింహా రెడ్డి అనే...

Woman: బాలుడి ప్రాణం పోయింది, మంత్రగత్తె అని ముస్లీం మహిళను చితకబాదేసి, ఇంట్లో నుంచి లాగి !

మంత్రాలు వేస్తున్న మంత్రగత్తె ? రాజస్థాన్ లోని బుండి జిల్లాలోని భజన్రి అనే గ్రామంలో ఓ ముస్లీం మహిళ నివాసం ఉంటున్నది. ముస్లీం మహిళ మంత్రాలు వేస్తోందని...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe