[ad_1]
Bank Employees Strike:
కస్టమర్లకు అలర్ట్! జనవరి 30, 31న బ్యాంకు సేవలకు అంతరాయం కలగనుంది. ఆ రెండు రోజులు ఉద్యోగులు సమ్మె చేస్తుండటమే ఇందుకు కారణం. తమ డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ వివిధ బ్యాంకు ఉద్యోగ సంఘాలన్నీ ఒకే గొడుకు కిందకు వచ్చాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ (UFBU) పేరుతో నిరసన చేపడుతున్నాయని ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.
గురువారం యూఎఫ్బీయూ ముంబయిలో సమావేశమైంది. సమ్మె చేయాలని నిర్ణయించింది. ‘నేడు ముంబయిలో యూఎఫ్బీయూ సమావేశమైంది. మా డిమాండ్ల పరిష్కారానికి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా బ్యాంకు సంఘాలు స్పందించడం లేదు. అందుకే మేం నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించాం. జనవరి 30, 31న సమ్మెకు పిలుపునిచ్చాం’ అని ఏఐబీఈఏ జనరల్ సెక్రెటరీ సీహెచ్ వెంకటాచలం మీడియాకు తెలిపారు.
బ్యాంకు ఉద్యోగ సంఘాల డిమాండ్లు
- ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని
- పెన్షన్ల అప్డేషన్
- పెండింగ్ సమస్యల పరిష్కారం
- జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS)ను రద్దు చేయడం
- వేతన సవరణపై సత్వరమే చర్చల ఆరంభం
- అన్ని విభాగాల్లో ఉద్యోగులను నియమించడం
సోషల్ మీడియాలో ఏబీపీ దేశం ఫాలో అవ్వండి:
[ad_2]
Source link