Monday, November 29, 2021

కాకతీయ హెరిటేజ్ సర్క్యూట్‌గా రామప్ప అభివృద్ది… ప్రణాళికలు సిద్దం చేయాలని మంత్రి ఆదేశాలు

Telangana

oi-Srinivas Mittapalli

|

కాకతీయుల వైభవాన్ని ప్రతిబింబించేలా అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఉట్టిపడే రామప్ప దేవాలయానికి ఇటీవలే యునెస్కో గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. ప్రపంచం మెచ్చిన ఈ ఆలయాన్ని గడిచిన ఏడేళ్లుగా తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం చేసిందన్న విమర్శలున్నాయి. దీనిపై సుమోటో కేసు స్వీకరించిన హైకోర్టు ఇకనైనా ఆలయాన్ని సంరంక్షించాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో కాకతీయ హెరిటేజ్ సర్క్యూట్‌గా రామప్ప దేవాలయం,దాని అనుబంధ చారిత్రక కట్టడాలను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ రామప్ప ఆలయంపై శుక్రవారం(జులై 30) సమీక్షా సమావేశం నిర్వహించారు.

రామప్ప దేవాలయంతో పాటు దాని అనుబంధ కట్టడాలను సరంక్షించేలా,కాకతీయ హెరిటేజ్ సర్క్యూట్‌గా ఆ ప్రదేశాన్ని అభివృద్ది చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించడం పట్ల ప్రభుత్వం తరుపున కృతజ్ఞతలు తెలియజేశారు. యునెస్కో మార్గదర్శకాల ప్రకారం సమర్పించాల్సిన సమగ్ర నివేదిక రూపకల్పనపై అధికారులతో చర్చించారు. నివేదిక రూపొందించిన తర్వాత సీఎం కేసీఆర్‌తో దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

 ramappa as Kakatiya Heritage Circuit minister srinivas goud orders officials to prepare a plan

గడిచిన ఏడేళ్లలో రామప్ప ఆలయ సంరక్షణను ప్రభుత్వం గాలికి వదిలేసిందన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ కరువవడంతో ఇక్కడి పలు కట్టడాలు పాకురుపట్టిపోగా.. కొన్ని కూలిపోయే స్థితికి చేరుకున్నాయి. 2012లో చివరిసారిగా ఈ ఆలయాన్ని కెమికల్స్‌తో శుభ్రం చేశారు. ఆ తర్వాత మళ్లీ దాన్ని పట్టించుకోలేదు. తాజాగా రామప్పకు యునెస్కో గుర్తింపు లభించడంపై ప్రభుత్వం ఇప్పుడు అటువైపు దృష్టి సారించింది.

వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో రూల్ 22.7 ద్వారా యునెస్కో గుర్తింపు కోసం రామప్పను నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో భారత్‌కు రష్యా సహకరించింది. మొత్తం 17 దేశాల ఆమోదం తెలపడంతో రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చింది. యునెస్కో చారిత్రక కట్టడాల జాబితాలో ఇప్పటివరకూ 167 దేశాల నుంచి 1121 కట్టడాలు ఉన్నాయి.

ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో ఉన్న రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చాలాకాలంగా కృషి చేస్తూ వచ్చాయి. ఈ ఆలయానికి మొత్తం 20 అనుబంధ ఆలయాలు ఉన్నాయి. రామప్ప విశిష్ఠతను అంతర్జాతీయంగా చాటి చెప్పేలా కేంద్రం ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఈ బృందం 24 దేశాలకు రామప్ప విశిష్ఠత గురించి వివరించింది. ఎట్టకేలకు రామప్ప ఆలయానికి ఇటీవల యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్‌, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (యునెస్కో) గుర్తింపు లభించింది.

English summary

Minister Srinivas Goud on Friday (July 30) held a review meeting on the Ramappa Temple.The minister directed the officials to prepare conservation plan of the Ramappa temple and its ancillary structures and to develop the site as a Kakatiya Heritage Circuit.

Story first published: Friday, July 30, 2021, 22:50 [IST]


Source link

MORE Articles

AP weather: ఏపీకి తుఫాను ముప్పు, 3న జవాద్, భారీ వర్షాలు, బంగాళాఖాతంలో అలజడి

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్ష ముప్పు వీడటం లేదు. డిసెంబర్ నెల మొదటి వారంలో బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడనుంది. దీని ప్రభావంతో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్రలో డిసెంబర్ 3 నుంచి 5...

Roborock Cyber Monday deals: Get a robot vacuum on the cheap today only!

A robot vacuum is one of the best investments you can make for your home. A good one can clean up your place...

భారత మార్కెట్లో అత్యధిక మైలేజీని స్కూటర్లు: జెస్ట్, జూపిటర్, యాక్సెస్, యాక్టివా…

రోడ్లపై స్కూటర్లు మంచి ప్రాక్టికాలిటీని కలిగి ఉండి, గేర్లతో నడిచే మోటార్‌సైకిళ్ల కన్నా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి మరియు నడపడానికి సులువుగా ఉంటాయి. సరసమైన ధర, లైట్ వెయిట్,...

కొత్త ప్లాంట్‌ ఏర్పాటుకి శ్రీకారం చుట్టిన Ather Energy.. కారణం అదేనా?

దేశీయ విఫణిలో 450X మరియు 450 ప్లస్ స్కూటర్‌లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా కంపెనీకి రెండవ ప్లాంట్‌గా కొత్త ఫ్యాక్టరీని ప్రారంభించనుంది. ఈ కొత్త ప్లాంట్ తర్వాత కంపెనీ...

Increase stamina: पुरुषों का स्टेमिना बढ़ाने का रामबाण तरीका, इन चीजों को खाने से मिलेगा गजब का फायदा

Increase stamina Symptoms causes and prevention of stamina deficiency stamina booster food brmp | Increase stamina: पुरुषों का स्टेमिना बढ़ाने का रामबाण तरीका,...

जानलेवा बीमारी के कारण बीच में ही छूट गई थी Johnny Lever के बेटे की पढ़ाई, शरीर में दिखने लगते हैं ऐसे लक्षण

comedian johnny levers son jessey lever was suffered from throat cancer know its symptoms and stages samp | जानलेवा बीमारी के कारण बीच...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe