Monday, March 1, 2021

కాల్పులు, బాంబు దాడి: టీఎంసీ కార్యకర్త మృతి, మరో ముగ్గురికి గాయాలు

National

oi-Rajashekhar Garrepally

|

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ మెడినిపూర్ జిల్లాలో ఓ టీఎంసీ కార్యకర్తను దుండగులు కాల్చి చంపారు. ఆ తర్వాత బాంబు దాడిలో మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. మృతి చెందిన వ్యక్తిని సౌవిక్ దోలాయిగా గుర్తించారు.

గాయపడినవారిని మిడ్నాపూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. నారాయణగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మక్రంపూర్‌లో రోడ్డు పక్కన కూర్చున్న నలుగురు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలపై ద్విచక్రవాహనాలపై వచ్చిన దండగులు దాడికి పాల్పడ్డారు.

TMC worker shot dead, 3 injured in bomb attack in poll-bound Bengal.

ఓ బాంబును వారిపై విసిరేశారు. కాల్పులు కూడా జరపడంతో 24ఏళ్ల దోలాయి మృతి చెందాడు. ఆ తర్వాత దుండగులు అక్కడ్నుంచి పరారయ్యారు. అయితే, పలువురు స్థానిక టీఎంసీ నేతలు ఇది బీజేపీ పనేనంటూ ఆరోపిస్తున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుమిత్ దాస్ మాత్రం టీఎంసీ ఆరోపణలను ఖండించారు. ఇది టీఎంసీలోని గొడవల ఫలితమని అన్నారు.

ఈ ప్రాంతంలో తమకు పట్టుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీని అడ్డుకోవడానికే ఈ దాడి చేశారు. ఇది బీజేపీ పనే. దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నామన్నారు టీఎంసీ జిల్లా అధ్యక్షుడు అజిత్ మైటి.

అయితే, రెండు టీఎంసీల మధ్య ఏర్పడిన గొడవల కారణంగానే ఈ దాడి జరిగిందని, వారిలో వారు దాడులు చేసుకుంటూ బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీ నేత సుమిత్ దాస్ అన్నారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, వారంతా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్నారు. నిందితులు ఇంతటి దారుణాలకు తెగబడటానికి వారికి ధైర్యం ఎవరిచ్చారని ప్రశ్నించారు. పరిపాలనా వైఫల్యాల వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఇలాంటి దాడులు రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్తితులకు దారితీస్తున్నాయి.


Source link

MORE Articles

illegal affair: పక్కింటోడి పెళ్లాంతో జల్సా, తండ్రి, కొడుకు ఆత్మహత్య, భర్త షాక్ !

తండ్రి, ముద్దుల కొడుకులు తమిళనాడులోని సేలం జిల్లా మల్లూరు ప్రాంతంలో సుబ్రమణి (54) అనే ఆయన నివాసం ఉంటున్నారు. సుబ్రమణికి శంకర్ (24), క్రిష్ణన్ (21)...

డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని ఎలక్ట్రిక్ బైక్ డెలివరీ షురూ చేసిన ఆటమ్‌మొబైల్; వివరాలు

ఇప్పుడు ఈ ఆటమ్‌మొబైల్ స్టార్టప్ కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఈ కంపెనీ హైదరాబాద్ నుంచి డెలివరీ ప్రారంభించింది. ఈ బైక్ తయారీ సదుపాయంలో...

ఫోర్జరీ సంతకాలతో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు విత్ డ్రా…ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రారంభమైన రగడ మున్సిపల్ ఎన్నికల సమయంలో కూడా కొనసాగుతూనే ఉంది. తాజాగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టిడిపి అభ్యర్థులను వైసిపి నాయకులు బెదిరింపులకు గురి చేస్తున్నారని...

Lady IPS: గోకించుకునే వయసులో గోకడం అవసరమా సార్ ?, ఏడీజీపీకి సీన్ సిడేల్, సీబీసీఐడీ !

కారు ఎక్కించుకున్న అయ్యగారు తమిళనాడు లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ (ADGP) రాజేష్ దాస్ మీద అదే రాష్ట్రంలోని డెల్టా జిల్లాలో ఎస్పీగా పని...

రేణిగుంట ఎయిర్‌పోర్టులో చంద్రబాబు నిర్బంధం

చిత్తూరు పర్యటనకు అనుమతి నో .. రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబు నిర్బంధం ఇదే సమయంలో టిడిపి నిర్వహించ తలపెట్టిన ఆందోళన కోసం అధినేత...

Alienware AW2721D 27″ Gaming Monitor Review

We're kicking things off today with our first monitor review of 2021, we're taking a look at the Alienware AW2721D, a hot item...

కేజ్రీవాల్ పార్టీకి గ్లామర్ డోస్: ఆమ్ ఆద్మీలో చేరిన మిస్ ఇండియా

న్యూఢిల్లీ: ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి గ్లామర్ డోస్ పెరిగింది. మిస్ ఇండియా ఢిల్లీ మాన్సీ సెహెగల్ కొద్దిసేపటి కిందటే ఆ పార్టీలో చేరారు. ఆమ్ ఆద్మీ సీనియర్ నేత,...

Oppo Find X3 launch date confirmed – but something might be missing from the event

After some anticipation, we've finally got confirmation of the Oppo Find X3 launch date - we're going to see the next generation of...

Kidney Stone की समस्या है तो ये चीजें भूल से भी न खाएं

नई दिल्ली: अगर आपको कभी किडनी स्टोन की प्रॉब्लम हुई हो या परिवार में किसी सदस्य को किडनी स्टोन की दिक्कत हुई तो...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe