విజయ్ దేవరకొండ కెరీర్లో చాలా కీలకమైన సినిమా.. కింగ్‌డమ్. లైగర్, ఫ్యామిలీ స్టార్ లాంటి పెద్ద డిజాస్టర్ల తర్వాత విజయ్ కెరీర్ బాగా డౌన్ అయిపోయిన సమయంలో ఈ సినిమా టేకప్ చేశాడు. ఈ సినిమా సరిగా ఆడకపోతే అతడికి చాలా ఇబ్బంది అవుతుంది. ఐతే విజయ్ ట్రాక్ రికార్డు పట్టించుకోకుండా చాలా భారీగా ఈ సినిమాను తెరకెక్కిస్తోంది సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ. జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడం, టీజర్ వేరే లెవెల్లో ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అయినప్పటికీ విజయ్ అభిమానుల్లో ఏదో ఒక మూల కొంచెం కంగారు తప్పడం లేదు. అలాంటి వారికి ఉపశమనాన్నిచ్చే మాటలు చెప్పాడు ‘కింగ్‌డమ్’ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. ఈ సినిమా చాలా బాగుంటుందని అతను భరోసా ఇచ్చాడు.
నేపథ్య సంగీతం అందించడం కోసం సంగీత దర్శకులు చాలా ముందుగానే సినిమా చూస్తారన్న సంగతి తెలిసిందే.అందులో భాగంగానే అనిరుధ్ కూడా ‘కింగ్‌డమ్’ సినిమా 40 శాతం చూశాడట. ఔట్ పుట్ చాలా బాగుందని.. ఇప్పటిదాకా చూసిన సన్నివేశాలు మంచి కిక్కిచ్చాయని.. సినిమా కొత్తగా ఉంటుందని అనిరుధ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘కూలీ’ని పూర్తిగా చూసేశాడట అనిరుధ్. ఆ సినిమా కూడా అదిరిపోయిందని.. ఈ రెండు చిత్రాల రిలీజ్ ముంగిట ‘ఫైర్’ ఎమోజీలతో రివ్యూ ఇస్తానని అనిరుధ్ చెప్పాడు. ఈ ఏడాదికి తన నుంచి వచ్చే ఈ రెండు సినిమాలూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అతను ధీమా వ్యక్తం చేశాడు. ‘కింగ్‌డమ్’ మే 30న విడుదల కానుండగా.. ‘కూలీ’ ఆగస్టు 14న రిలీజ్‌కు షెడ్యూల్ అయింది.
The post ‘కింగ్‌డమ్’ ఔట్ పుట్ అదిరిందన్న అనిరుధ్ first appeared on namasteandhra.