Wednesday, May 12, 2021

కిసాన్ మహా పంచాయత్ లో పాల్గొంటానని ప్రియాంకా గాంధీ వెల్లడి.. సహరాన్‌పూర్‌లో 144 సెక్షన్

సహరాన్ పూర్ వేదికగా కిసన్ మహా పంచాయత్.. రైతులకు ప్రియాంకా గాంధీ మద్దతు

అన్నదాతల ఆందోళనకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.

అందులో భాగంగా ఉత్తరప్రదేశ్లో అన్నదాతల ఆందోళనకు మద్దతు తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ జై జవాన్ జై కిసాన్ ఉద్యమాన్ని ప్రారంభించనుంది . పదిరోజుల పాటు ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని భావిస్తుంది. అంతేకాదు ఈ రోజు సహరాన్ పూర్ వేదికగా జరగనున్న కిసన్ మహా పంచాయత్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొని అన్నదాతలు ఉద్యమానికి మద్దతు ప్రకటించనున్నారు.

 సహరాన్ పూర్ లో 144 సెక్షన్, కరోనా, పండుగలు , శాంతి భద్రతల కారణాలు

సహరాన్ పూర్ లో 144 సెక్షన్, కరోనా, పండుగలు , శాంతి భద్రతల కారణాలు

ప్రియాంక గాంధీ వాద్రా కిసన్ మహా పంచాయత్ లో పాల్గొననున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో నేడు సహరాన్ పూర్ లో 144 సెక్షన్ విధించింది.

రాబోయే పండుగలు, కరోనా మహమ్మారి, శాంతి భద్రతల పరిరక్షణ వంటి వివిధ కారణాలను చూపిస్తూ 144 సెక్షన్ విధించారు. ఈ మేరకు జిల్లా మేజిస్ట్రేట్ సహరాన్పూర్ ఒక ఉత్తర్వు జారీ చేశారు . ఏప్రిల్ 5 వరకు ఉత్తరప్రదేశ్లో ఆంక్షలు విధించారు. కిసాన్ మహాపాంచాయత్ లో పాల్గొనడానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పర్యటన నేపథ్యంలో 144 సెక్షన్ విధించటం చర్చనీయాంశంగా మారింది.

రైతుల ఉద్యమానికి మద్దతుగా సహరాన్ పూర్ వెళ్తానని ప్రియాంకా గాంధీ ట్వీట్

రైతుల ఉద్యమానికి మద్దతుగా సహరాన్ పూర్ వెళ్తానని ప్రియాంకా గాంధీ ట్వీట్

అంతకుముందు అన్నదాతలకు మద్దతు తెలుపుతూ ఈరోజు కిసన్ మహా పంచాయత్ లో పాల్గొంటానని ట్వీట్ చేసిన ప్రియాంక గాంధీ వాద్రా తన ట్విటర్లో ఈ విధంగా పేర్కొన్నారు. “ఈ రోజు నేను సహరాన్‌పూర్‌లో ఉంటాను, రైతులతో నా భావాలను వినడానికి, అర్థం చేసుకోవడానికి, వారి పోరాటానికి తన మద్దతు ఇస్తాను. బిజెపి ప్రభుత్వం నల్ల వ్యవసాయ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి ” అని ప్రియాంక వాద్రా ట్వీట్ చేశారు

కిసాన్ మహాపాంచాయతీకి హాజరు కావడానికి ఆమె సహరాన్ పూర్ వెళ్లనున్నారు .

ఫిబ్రవరి 13 న బిజ్నోర్, ముజఫర్ నగర్ జిల్లాల్లో రైతులను కలవాలని ప్రియాంకా ప్లాన్

ఫిబ్రవరి 13 న బిజ్నోర్, ముజఫర్ నగర్ జిల్లాల్లో రైతులను కలవాలని ప్రియాంకా ప్లాన్

ఈ కార్యక్రమానికి హాజరయ్యే ముందు శకుంభ్రా దేవి ఆలయంలో పూజలు నిర్వహించి సహరాన్పూర్ వెళ్లనున్నారు ప్రియాంక గాంధీ వాద్రా. ఫిబ్రవరి 13 న బిజ్నోర్, ముజఫర్ నగర్ జిల్లాల్లోని రైతులతో కూడా ప్రియాంక గాంధీ వాద్రా చర్చలు జరపాలని భావిస్తున్నారు.

ఇంతకుముందు రైతులు ‘చక్కా జామ్’ పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమ ఆందోళనను ఉదృతం చేస్తున్నాయి.

ప్రియాంకా గాంధీ పర్యటన నేపధ్యంలో 144 సెక్షన్ .. ఏం జరుగుతుందో ?

ప్రియాంకా గాంధీ పర్యటన నేపధ్యంలో 144 సెక్షన్ .. ఏం జరుగుతుందో ?

కొత్తగా అమల్లోకి వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది నవంబర్ 26 నుంచి దేశ రాజధానిలోని వివిధ సరిహద్దుల్లో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం సాగిస్తోంది. అయితే తాజాగా ప్రియాంక గాంధీ వాద్రా సహరాన్ పూర్ కిసాన్ మహా పంచాయత్ లో పాల్గొన్న నేపద్యంలో 144 సెక్షన్ విధించారు అక్కడ ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రస్తుతం కనిపిస్తుంది.


Source link

MORE Articles

భారత్‌లో ప్రవేశించనున్న కొత్త హీరో ఎలక్ట్రిక్ స్కూటర్; వివరాలు

వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో భాగంగా కొత్త కంపెనీలు కూడా తమ వాహనాలను...

మిస్టర్ జగన్ రెడ్డి: లండన్‌లో సైకాలజీ ఆసుపత్రికి ఎందుకెళ్లారు?: నాకో కండోమ్స్ కావాలి: రఘురామ

మద్యం దుకాణాలెందుకు? కరోనా వైరస్ కల్లోలాన్ని రేపుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ సర్కార్.. ప్రజలను మద్యానికి బానిస చేసేలా వ్యవహరిస్తోందని రఘురామ ఆరోపించారు. పొరుగునే ఉన్న ఒడిశా,...

पुरुष रात को सोने से पहले करें दूध के साथ इस चीज का करें सेवन, फिर जो होगा यकीन नहीं करेंगे आप!

नई दिल्ली: अगर आप शारीरिक कमजोरी के शिकार है और काम करते वक्त जल्दी थक जाते हैं तो ये खबर आपके काम आ...

These two iPhone 12 Pro deals are some of the cheapest yet on the EE network

iPhone 12 Pro deals aren't exactly affordable, standing out as one of the most expensive handsets Apple has ever made. With that in...

కరోనా వల్ల అనాధలైన పిల్లల కోసం జగన్ సర్కార్ కీలక నిర్ణయం

కరోనా మహమ్మారి ఎంతో మంది చిన్నారులను అనాధలను చేసేస్తోంది. కుటుంబాలకు కుటుంబాలే కరోనా కారణంగా కల్లోల పరిస్థితులకు చేరుకుంటున్నాయి. కరోనా బారిన పడి తల్లిదండ్రులు మరణించిన చిన్నారులు అనాధలుగా మారి దీనంగా రోదిస్తున్నారు.ఇలాంటి...

Onion Benefits: सुबह उठकर करें कच्चे प्याज का सेवन, मिलेंगे यह जादुई फायदे!

नई दिल्ली: आज हम आपके लिए लेकर आए हैं प्याज के फायदे. भारत का शायद ही ऐसा कोई घर हो जहां प्याज (Onion...

కొత్త 2021 మోడల్ ఎక్స్‌ఎస్‌ఆర్125 బైక్‌ ఆవిష్కరించిన యమహా

ఈ కొత్త యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 125 బైక్‌లో చాలా హైటెక్ ఫీచర్లు ఉన్నాయి. యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 125 బైక్‌లో రౌండ్ హెడ్‌ల్యాంప్, గుండ్రని డిజైన్ ఫ్యూయల్ ట్యాంక్,...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe