Saturday, June 12, 2021

కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు: ఇద్దరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Andhra Pradesh

oi-Rajashekhar Garrepally

|

తూర్పుగోదావరి: జిల్లా కాకినాడలోని సర్పవరం టైకి కెమికల్ ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలింది. ఈ పేలుళ్ల ధాటికి ఇద్దరు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రగాయాలపాలయ్యారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కాకినాడలోని ఆస్పత్రికి తరలించారు.

కెమికల్ బాయిలర్ పేలుళ్లకు గల కారణాలను అధికారులు తెలుసుకుంటున్నారు. మహా శివరాత్రి పర్వదినం రోజున ప్రమాదం జరగడంతో ఘటనా స్థలానికి భారీగా జనం చేరుకున్నారు.

పసుపు బాయిలర్ పేలుడు ఘటనలో చికిత్స పొందుతున్న ఇద్దరు మృతి చెందారు. కొల్లూరు మండలం ఈపూరులో పసుపు బాయిలర్ పేలి ఐదుగురు రైతులు గాయపడ్డారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రైతులు భూషణ్, రాజేష్ మృతి చెందారు. మరో ముగ్గురికి చికిత్స కొనసాగుతోంది.

గుంటూరు ప్రమాదంలో ఇద్దరు మృతి

కొల్లూరు మండలం ఈపూరు గ్రామంలో ఫిబ్రవరి 25న పసుపు బాయిలర్ పేలడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈపూరు రవివర్మ, ఈపూరు కిషోర్, ఈపూరు నాగభూషణం, నిక్కు చంద్రశేఖర్, మూల్పూరు రాజేష్‌లు తీవ్రంగా గాయపడటంతో వారిని మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం అక్కడ్నుంచి గుంటూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఐదుగురిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మరణించారు.


Source link

MORE Articles

There’s a Third Mission Going to Venus, Earth’s Evil Twin | Digital Trends

Artist’s impression of ESA’s EnVision mission ESA/VR2Planets/DamiaBouicA surface temperature hot enough to melt lead. An atmosphere so thick the pressure on the surface...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe