Saturday, July 24, 2021

కేంద్రం కరోనా వ్యాక్సిన్ ధరను ఫిక్స్ చేసిందా… ఆ ప్రచారంలో నిజమెంత…?

National

oi-Srinivas Mittapalli

|

దేశవ్యాప్తంగా మార్చి 1 నుంచి రెండో విడత వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టనున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఈసారి టీకాను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికైతే టీకా ధరను ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించలేదు,ఎటువంటి ప్రకటనా చేయలేదు. కానీ దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో కొన్ని తప్పుడు కథనాలు ప్రచారమవుతున్నాయని తాజాగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

వ్యాక్సిన్ ధర దాదాపు రూ.500గా ఉండనున్నట్లు వాట్సాప్‌లో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్ష వర్దన్ ట్విట్టర్‌లో స్పందిస్తూ… ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ పూర్తిగా ఉచితం అని చెప్పారు. ప్రైవేట్ హెల్త్ కేర్ సెంటర్స్‌లో మాత్రం ముందుగా నిర్ణయించిన ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయితే ఆ ఛార్జీలపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. వ్యాక్సిన్ తీసుకున్నవారికి క్యూఆర్ కోడ్‌తో ఉన్న సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు.

మరోవైపు గుజరాత్ డిప్యూటీ ముఖ్యమంత్రి నితిన్ పటేల్ వ్యాక్సినేషన్‌పై మాట్లాడుతూ… ప్రైవేట్ ఆస్పత్రుల్లో టీకాకు రూ.250 ఛార్జి చేయనున్నట్లు తెలిపారు. అయితే టీకా రెండు డోసుల్లో ఇస్తున్నారు కాబట్టి… ఇదే ఛార్జి రెండు డోసులకు వర్తిస్తుందా లేక ఒకే డోసుకా అన్నది ఆయన స్పష్టతనివ్వలేదు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రైవేట్‌లో టీకా ఛార్జీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

misleading claims and speculations over corona vaccine price

కాగా, ఈ ఏడాది జనవరి 16న దేశంలో తొలి విడత కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆరోగ్య కార్యకర్తలకు, కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకా అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా దేశంలో ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.

తొలివిడతలో మొత్తం మూడు కోట్ల మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. మార్చి 1 నుంచి చేపట్టే రెండో విడత వ్యాక్సినేషన్‌లో వృద్దులకు వ్యాక్సిన్ అందించనున్నారు. అలాగే 45 ఏళ్లు పైబడి, ఇతర ఆరోగ్యసమస్యలు ఉన్న వ్యక్తులకు కూడా వ్యాక్సిన్ అందించబోతున్నారు. మొత్తం 27 కోట్ల మంది వృద్దులకు వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది.




Source link

MORE Articles

Second Hand Stress: कहीं आप दूसरों का तनाव तो नहीं झेल रहे, जान लें ये संकेत

तनाव एक नैचुरल मेंटल रिएक्शन है, जो विपरीत व मुश्किल परिस्थितियों के दौरान महसूस होता है. अत्यधिक तनाव लेना आपके मानसिक स्वास्थ्य के...

YS Viveka Murder: రంగయ్య ఇంటి వద్ద భారీ భద్రత-తెర పైకి 3 పేర్లు-హైకోర్టుకు సునీల్ యాదవ్?

తెర పైకి ముగ్గురి పేర్లు... జమ్మలమడుగు మెజిస్ట్రేట్‌లో రంగయ్య ఇచ్చిన వాంగ్మూలం సంచలనం రేపుతోంది. 9 మందికి ఈ హత్యలో ప్రమేయం ఉన్నట్లుగా రంగయ్య చెప్పారన్న ప్రచారం...

Protein rich Veg Foods: प्रोटीन लेने के लिए खाएं ये 4 शाकाहारी फूड, छोड़ देंगे मीट-मछली

Vegetarian Foods for Protein: सिर्फ जिम जाने वाले या बॉडी बनाने वाले लोगों को ही प्रोटीन की जरूरत नहीं होती है. बल्कि एक...

రోడ్ల దుస్థితిపై టీడీపీ వార్ .. చింతమనేనిని అడ్డుకున్న పోలీసులు, దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్ అరెస్ట్

రామచంద్రాపురంలో గుంతలు పూడ్చే కార్యక్రమంలో చింతమనేని దెందులూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గుంతల మాయమైన రోడ్లను పూడుస్తూ తమ నిరసనను తెలియజేశారు. పెదవేగి మండలం...

రాష్ట్రపతి, ప్రధానికి ఫిర్యాదు చేశారు.. ఆ దొంగలు అంటూ రఘురామ..

రఘురామ కృష్ణరాజు మరోసారి ఫైరయ్యారు. వైసీపీ సర్కార్, సీఎం జగన్ లక్ష్యంగా మరోసారి విమర్శలు చేశారు. జగన్, విజయసాయిరెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్ చేశారు. రఘురామ కృష్ణరాజు వర్సెస్ జగన్ సర్కార్ మధ్య...

పరకాలలో హైటెన్షన్-ప్రత్యేక జిల్లాకు పోరాటం ఉధృతం-ఎమ్మెల్యే ధర్మారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు

హన్మకొండ జిల్లాలోని పరకాలలో శనివారం(జులై 24) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పరకాల పట్టణాన్ని అమరవీరుల జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండుతో చేపట్టిన బంద్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. మొదట...

Illegal affair: సిటీలో భర్త, ఇంట్లో మరిదితో భార్య మసాజ్, భర్త ఏంచేశాడంటే, తమ్ముడు మిస్ !

భర్తతో హ్యాపీలైఫ్ ఉత్తరప్రదేశ్ లోని బరాచ్ జిల్లాలోని కొట్వాలి నన్సారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజరియా గ్రామంలో రాజేష్ సింగ్, రీటా (32) దంపతులు నివాసం ఉంటున్నారు....

Here Are All the Games That Support Nvidia’s RTX Ray Tracing | Digital Trends

With a Nvidia RTX 30 series or 20 series graphics card, you can take advantage of RTX ray tracing. Only certain games support...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe