Friday, July 30, 2021

కేజీఫ్ స్టార్ యశ్‌ ఫ్యాన్ ఆత్మహత్య… సూసైడ్ నోట్‌లో ‘చివరి కోరిక’ కోరిన అభిమాని…

National

oi-Srinivas Mittapalli

|

కేజీఎఫ్ స్టార్ యశ్,కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యలకు వీరాభిమాని అయిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీవితంలో పూర్తిగా విఫలమయ్యానని… ఇక తాను బతికి సాధించేది ఏమీ లేదని… అందుకే ఆత్మహత్య చేసుకుంటానని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. అంతేకాదు,తాను బాగా అభిమానించే యశ్,సిద్దరామయ్యలు తన అంత్యక్రియలకు హాజరవాలని.. ఇదే తన చివరి కోరిక అని చెప్పుకొచ్చాడు.

కర్ణాటకలోని మండ్యా జిల్లాలో ఉన్న కొడిదొడ్డి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తిని రాజేష్‌గా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు ముందు అతను రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘జీవితంలో నేనో ఫెయిల్యూర్‌గా మిగిలిపోయాను. నా తల్లికి మంచి కొడుకుగా ఉండలేకపోయాను. నా సోదరుడికి మంచి సోదరుడిగా ఉండలేకపోయాను. ప్రేమలోనూ విఫలమయ్యాను. ఇక నేను బతికి ఉండి సాధించాల్సింది ఏమీ లేదు. అందుకే చనిపోతున్నా. నేను అభిమానించే యశ్,సిద్దరామయ్యలు నా అంత్యక్రియలకు రావాలన్నది నా చివరి కోరిక..’ అని రాజేష్ తన సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు.

die hard Fan of KGF Star Yash Dies by Suicide in Karnataka

రాజేష్ కోరిక మేరకు సిద్దరామయ్య అతని అంత్యక్రియలకు హాజరయ్యారు. అతని మృతదేహానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘నాకు తెలిసీ నేనెప్పుడూ అతన్ని కలుసుకోలేదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో అభిమానిని కలుసుకోవాల్సి రావడం అత్యంత విచారకరం. రాజేష్‌లా ఇంకెవరూ ఇలా ఆత్మహత్యలకు పాల్పడకూడదు.’ అని సిద్దరామయ్య పేర్కొన్నారు. అతని ఆత్మహత్యపై విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు.

అభిమాని ఆత్మహత్యపై హీరో యశ్ స్పందిస్తూ… ‘అభిమానులుగా మీరు మాపై కురిపించే చప్పట్లు,విజిల్స్,మీ ప్రేమను మేము ఇష్టపడుతాం. కానీ ఇలాంటివి మీ నుంచి మేము ఆశించం.’ అని ట్వీట్ చేశారు. ‘అభిమానుల ప్రేమే మాకు జీవితం.మాకు గర్వకారణం. కానీ రామకృష్ణ లాంటి వ్యక్తులు ఇలా ప్రేమను చాటుకోవడాన్ని ఎలా ఇష్టపడగలం. అభిమానుల ప్రేమకు ఇది ఉదాహరణగా మారకూడదు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నాను. ఓం శాంతి..’ అని యశ్ ట్వీట్ ద్వారా అభిప్రాయపడ్డారు. మరోవైపు రాజేష్ ఆత్మహత్యపై మండ్యా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Source link

MORE Articles

బిగాస్ నుండి రానున్న 2 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు; ఈసారి మేడ్ ఇన్ ఇండియా..

ఈసారి బిగాస్ పూర్తిగా 100 శాతం భారతదేశంలో తయారు చేసిన రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను త్వరలోనే దేశీయ విపణిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గడచిన 2020లో లాంచ్ చేసిన...

Multani Mitti Face Pack : बारिश के मौसम में इस तरह चेहरे पर लगाएं मुल्तानी मिट्टी, ग्लो रहेगा बरकरार, खत्म होंगी ये skin problem

Multani Mitti Face Pack : पूरे देश में मानसून सक्रिय है और झमाझम का बारिश का दौर जारी है. बरसात (Monsoon) आते ही...

diseases caused by obesity: आपको इन गंभीर बीमारियों का शिकार बना सकता है मोटापा, इन 5 तरीकों से वजन करें कंट्रोल

diseases caused by obesity: उल्टा सीधा खानपान और गलत लाइफस्टाइल के चलते कई लोग मोटापे से पीड़ित (suffering from obesity) हैं. हेल्थ एक्सपर्ट...

హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో 800 మంది ఎంపీటీసీలు .. కేసీఆర్ కు ఎంపీటీసీల ఫోరం అల్టిమేటం!!

ఓరుగల్లు వేదికగా పోరు బాట పట్టిన ఎంపీటీసీలు పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లు వేదికగా ఎంపీటీసీల ఫోరం నిర్వహించిన సమావేశంలో, ఎంపీటీసీల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు...

జగన్ బెయిల్ రద్దు: షాకింగ్ పాయింట్ -14 బదులు 25 ఎలా? -ఏ2 సాయిరెడ్డి కూడా జైలుకే: ఎంపీ రఘురామ

జగన్ బెయిల్ రద్దు తీర్పు.. క్విడ్ ప్రోకో సంబంధిత పలు కేసుల్లో నిదితుడైన వైఎస్ జగన్ తన ముఖ్యమంత్రి పదవిని అడ్డంపెట్టుకుని కేసును ప్రభావితం చేస్తున్నారని, సహ...

ఏపీ బాటలో యూపీ, జగన్ ను అనుసరిస్తున్న యోగి : కళ్ళు తెరిచి చూడు బాబు అంటున్న సాయిరెడ్డి

ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థపై గతంలో టీడీపీ విమర్శలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. గ్రామ...

బసవరాజు బొమ్మై భావొద్వేగం.. శునకం చనిపోతే అలా.. అప్పటి వీడియో నేడు వైరల్

సీఎం కొడుకుగా.. బొమ్మై.. తండ్రి కూడా ఎస్ఆర్ బొమ్మై కూడా సీఎంగా పనిచేశారు. బసవరాజు బొమ్మై హోం మంత్రి నుంచి చీఫ్ మినిస్టర్‌గా ప్రమోట్ అయ్యారు. హోం...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe