Sunday, March 7, 2021

కేటీఆర్ పర్సనల్ సెక్రటరీని అంటూ మోసాలు… ఆస్పత్రి యజమానికే టోకరా వేసే ప్రయత్నం…

Telangana

oi-Srinivas Mittapalli

|

తెలంగాణ ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పర్సనల్ సెక్రటరీని అంటూ పలువురి నుంచి డబ్బులు గుంజేందుకు ప్రయత్నిస్తున్న ఓ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 15న నగరంలోని ఓ కార్పోరేట్ ఆస్పత్రికి ఫోన్ చేసిన అతను… తాను మంత్రి కేటీఆర్ పీఎస్‌ తిరుపతిరెడ్డిని అని చెప్పాడు. ఆస్పత్రి ఛైర్మన్ నంబర్ ఇవ్వాలని అడిగి తీసుకున్నాడు. ఆపై ఆ నంబర్‌కు ఫోన్ చేసి… త్వరలో మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పాడు. ఎల్‌బీ స్టేడియంలో ఆయన ప్రమాణస్వీకారం ఉంటుందని… ఇందుకోసం మీడియాలో ప్రకటనల నిమిత్తం డబ్బులు ఇవ్వాలని కోరాడు.

అతనిపై అనుమానంతో ఆస్పత్రి యాజమాన్యం ఎంక్వైరీ చేసింది. దీంతో అతను కేటీఆర్ పీఎస్ కాదని తేలింది. వెంటనే ఆస్పత్రి యాజమాన్యం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గతంలోనూ ఇలాగే కేటీఆర్ పేరు చెప్పి పలువురి నుంచి డబ్బులు గుంజేందుకు ప్రయత్నించిన నాగరాజు అనే యువకుడే ఈ మోసానికి తెరలేపి ఉంటాడని అనుమానిస్తున్నారు. నాగరాజుపై సైబర్‌ క్రైమ్‌తో పాటు, బాలానగర్‌, జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్లలో ఇప్పటికే కేసులు ఉన్నాయి.

man arrested for allegedly demanding money in the name of minister ktr personal secretary

కేటీఆర్ పీఏని అంటూ అతను గతంలో ఓ కంపెనీ సీఎండీని బోల్తా కొట్టించాడు. ఆ సీఎండీగా ఫోన్ చేసి తనను తాను కేటీఆర్ పీఏగా పరిచయం చేసుకున్నాడు. బ్రిటన్​లో జరగనున్న టీమ్ ఇండియా అండర్-25 క్రికెట్ వరల్డ్​ కప్​కు నాగరాజు అనే నిరుపేద ఆటగాడు సెలెక్ట్ అయ్యాడంటూ తెలిపాడు. అతనికి క్రికెట్ కిట్ కోసం రూ.3 లక్షల 40 వేలు స్పాన్సర్ చేస్తే… ఆ కిట్లపై మీ కంపెనీ లోగో ఉంటుందని, పబ్లిసిటీ వస్తుందని నమ్మబలికాడు. ట్రూ కాలర్​లో ఫోన్ నంబర్ కేటీఆర్ పీఏ అని రావడం వల్ల సదరు కంపెనీ సీఎండీ అతడు ఇచ్చిన అకౌంట్​లో డబ్బును జమచేశాడు. కానీ మోసపోయానని గ్రహించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో అప్పట్లో నాగరాజు అరెస్టయ్యాడు.

గతంలో లాలాపేట్‌కి చెందిన కార్తికేయ,ఫెడ్రిక్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా ఇలాగే కేటీఆర్ పీఏలమంటూ మోసాలకు తెరలేపారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో సిబ్బందిని బెదిరించి పనులు చేయించుకున్నారు. రూ.2లక్షలకు సంబంధించి ఓ ఆస్పత్రికి నకిలీ డాక్యుమెంట్స్ సమర్పించిన కేసులో కార్తికేయను పోలీసులు అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. కార్తికేయ ఇచ్చిన వివరాలతో ఫెడ్రిక్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.


Source link

MORE Articles

viral video: జగన్ సీటుకు ఎసరు -సాయిరెడ్డి పెద్ద బేకార్ -ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలనం

ఓవైసీ గ్రాండ్ ఎంట్రీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ ద్వారా ఏపీ రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరణ కొనసాగుతుందని ఎంఐఎం పార్టీ ప్రకటించుకుంది....

ఖమ్మంలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం: తాట తీస్తాం: ఫ్యాన్స్ ఫైర్: ఘాటుగా స్పందించిన షర్మిల

పార్టీ పేరును ప్రకటించదలిచిన జిల్లాలోనే.. ఏ జిల్లాలోనైతే షర్మిల తెలంగాణ రాజకీయాల్లో తొలి అడుగు వేయాలని నిర్ణయించుకున్నారో, పార్టీ పేరును అధికారికంగా ప్రకటించాలని భావిస్తున్నారో.. అదే...

घर में रखी इस चीज का सुबह से करें इस्तेमाल, होंगे जबरदस्त फायदे

नई दिल्लीः खुद को सेहतमंद रखने के लिए हम अक्सर कई चीजों का सेवन करते है. लेकिन आज हम आपको एक ऐसे घरेलू...

पुरुष इस समय रोज खाना शुरू कर दें मुट्ठी भर भीगे हुए चने, फिर जो होगा, यकीन नहीं करेंगे आप!

नई दिल्ली: आज हम आपके लिए लेकर आए हैं भीगे हुए चने के फायदे. भीगे हुए चने का सेवन पुरुषों के लिए ज्यादा...

International Women’s Day 2021: మనిషికి మనుగడ మహిళ

National oi-M N Charya | Published: Sunday, March 7, 2021, 6:01 ...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe