కొత్త అభివ్యక్తిని పరిచయం చేసిన’అమతం కురిసిన రాత్రి’

Date:

Share post:


– Advertisement –

నాకు చిన్నప్పటి నుంచి కవిత్వంపై మక్కువ ఎక్కువ. మా నాన్న తిరునగరి శ్రీనివాసస్వామి గారు కవి కావడం వల్ల వారు వెళ్ళే ప్రతీ సాహిత్య కార్యక్రమానికి నన్నూ వెంట తీసుకెళ్ళేవారు. అలా సాహిత్యంపై ఇష్టం ఏర్పడినప్పటి నుంచి ఎన్నో పుస్తకాలను చదవడం మొదలుపెట్టాను. మొదట్లో పద్య కవిత్వం, గేయకవిత్వం బాగా చదివేవాణ్ణి. రాసేవాణ్ణి. అలా నేను చదివిన పుస్తకాల్లో నాకు స్ఫూర్తినిచ్చి, నాలో కొత్త ఆలోచనలను రేకెత్తించిన కవితాసంపుటి ‘దేవరకొండ బాలగంగాధర తిలక్‌’ రాసిన ‘అమతం కురిసిన రాత్రి’. వచనకవిత్వంలో ఓ కొత్త ఒరవడిని సష్టించిన పుస్తకమిది. 1971లో ఈ కవితాసంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ, రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డులు వచ్చాయి. భాషలో, భావంలో, శిల్పవైవిధ్యంలో ఓ ప్రత్యేకతను సంతరించుకున్న పుస్తకమిది.
నేను ఎనిమిదవ తరగతి విద్యార్థిగా ఉన్నప్పుడు ‘అమతం కురిసిన రాత్రి’ కవితాసంపుటిని మొదటిసారిగా చదివాను. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎన్నిసార్లు చదువుకున్నానో. చదివినప్పుడల్లా ఓ కొత్తదనమే. అది వరకు పద్య కవిత్వం, గేయ కవిత్వం చదివిన నేను అమతం కురిసిన రాత్రి చదివాక వచన కవిత్వరచన వైపు అడుగులు వేశాను. ఇందులోని ప్రతీ కవిత నా హదయాన్ని సరికొత్తగా తడిమింది. ‘నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు’ వంటి పంక్తులను పదేపదే చదువుకుని అందులోని కవితాశక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడిని.
కవితలన్నీ పాఠకుణ్ణి ప్రశ్నిస్తాయి. ఆర్ద్రభావనతో స్పశిస్తాయి. పేదవాడి బతుకుచిత్రం, అవినీతిమయమైన సమాజాన్ని ఎలుగెత్తి ప్రశ్నించిన తీరు, కవిలోని భావావేశం, లోలోపల రగిలిపోతూ పైకి చెప్పుకోలేక నలిగిపోతున్న సగటు మనిషి ఆవేదనలు, గుక్కపట్టి ఏడ్చే దీనుడి ఆక్రందనలు.. అమతం కురిసిన రాత్రిలో స్పష్టంగా కనిపిస్తాయి.
‘అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళాడు?’ అనే కవిత చదివినపుడు నా గుండె ద్రవించింది. దేశరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీరసైనికుని గురించి, అతని భార్య, కొడుకు గురించి హదయ విదారకంగా తెలియజేసే కవిత ఇది. ప్రార్థన, ఆర్తగీతం, పిలుపు వంటి కవితలు దేశంలోని అశాంతిని, ఆకలిని చూసి ఆక్రోశంలో రాసిన కవితలు. నేడు ఆవిరైపోతున్న మానవత్వం, పడగెత్తి కనిపిస్తున్న అమానవీయ సంఘటనలు కళ్ళముందు కనబడినప్పుడల్లా తిలక్‌ రాసిన ‘కాలం విరిగిన బండిచక్రంలా కదలలేక పడిపోతే మొండి చేతుల మానవత్వం తెల్లబోయిన దీనదశ్యం మీరెవరైనా చూశారా? కన్నీరైనా విడిచారా?’ అనే పంక్తులే గుర్తుకొస్తారు. ‘దారిపొడుగు జనశవాలు, జారిపడే చేయి కాలు ఏ లోకం తల్లీ – యిట ఎగిరిపడే రాబందులు?’ అనే కవితాపంక్తులు పగలతో, కక్షలతో, కలహాలతో చచ్చిపడిన మతదేహాల్ని తలపింపజేస్తారు.
‘ఈ రాత్రి’, ‘కారు రాజా కారు’, ‘తపాలా బంట్రోతు’, ‘సైనికుడి ఉత్తరం’, ‘నగరం మీద ప్రేమగీతం’, ‘హార్లెమ్స్‌లో శవం’ మొ. కవితలెన్నో చదివిన ప్రతీసారి కొత్తగా, ఇంకా కొత్తగా మనల్ని ఆలోచింపజేస్తూనే ఉంటారు. తిలక్‌ కవిత్వమంతా అనుభూతివాదమే. అనుభూతుల లోయల్లో పాయలుగా సాగే అమతం కురిసిన రాత్రి లోని కవితలు నాకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగించాయి. మనసును తడిచేసే భావదశ్యాలు, వినూత్న కోణాలు ఈ కవితాసంపుటిలో కోకొల్లలుగా కనిపిస్తాయి. నేటి సాహిత్య ప్రపంచంలో అడుగులు వేస్తున్న ప్రతీ కవి, ప్రతీ రచయిత, ప్రతీ పాఠకుడు తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఈ ‘అమతం కురిసిన రాత్రి’.
– డా. తిరునగరి శరత్‌ చంద్ర, 6309873682

– Advertisement –



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

సల్మాన్ ఖాన్‌కు మూడు జబ్బులు

బాలీవుడ్ సూపర్ స్టార్లలో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయింది ఒక్క సల్మాన్ ఖాన్ మాత్రమే. వేర్వేరు సందర్భాల్లో ఆయన ప్రేమాయణాల గురించి పెద్ద...

తమన్నకు హ్యాండ్ ఇచ్చి మరో స్టార్ బ్యూటీని లైన్లో పెట్టిన వర్మ..!

బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు మిల్కీ బ్యూటీ తమన్న తో...

భూమ్మీద నూక‌లున్నాయి.. – Navatelangana

- Advertisement - న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భూమ్మీద నూక‌లుంటే..ఎంత ప్ర‌మాదం జ‌రిగిన ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డొచ్చు అనే ఉదంతాలు చాలానే చూసి ఉంటాం. ఇటీవ‌ల జూన్ 12న...