Sunday, May 15, 2022

కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ డెలివరీలు ప్రారంభం

రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ కొత్త 2021 మోడల్ హిమాలయన్ మోటార్‌సైకిల్ డిజైన్ మరియు ఫీచర్లలో స్వల్ప మార్పులు చేర్పులు చేసింది. అయితే, దీని ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ మాత్రం మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఈ కొత్త మోడల్ ఇప్పుడు మూడు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది.

కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ డెలివరీలు ప్రారంభం

ఈ మోటార్‌సైకిల్‌పై దూర ప్రయాణాలు చేసే కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని కంపెనీ దీని సీట్లను ఇప్పుడు మరింత సౌకర్యంగా ఉండేలా రీడిజైన్ చేసింది. అంతే కాకుండా, దీని వెనుక లగేజ్ క్యారియర్, ఫ్రంట్ మెటల్ ఫ్రేమ్ మరియు కొత్త విండ్‌స్క్రీన్‌ డిజైన్‌లను కూడా అప్‌డేట్ చేసింది.

కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ డెలివరీలు ప్రారంభం

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఇప్పటికే రాక్ రెడ్, లేక్ బ్లూ మరియు గ్రావెల్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుండగా, ఇందులో కొత్తగా మిరాజ్ సిల్వర్, పైన్ గ్రీన్ మరియు న్యూ గ్రానైట్ బ్లాక్ అనే మూడు కొత్త కలర్ ఆప్షన్లను ఇందులో జోడించారు.

కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ డెలివరీలు ప్రారంభం

ఈ మోటార్‌సైకిల్‌లో మరో ప్రధానమైన మార్పుగా, ఇందులో త్త ట్రిప్పర్ నావిగేషన్‌ను అమర్చారు. ఈ ఫీచర్‌ను మొదటిసారిగా కంపెనీ అందిస్తున్న మీటియోర్ 350 మోడల్‌లో అందించారు. ఇందుకోసం కంపెనీ తమ పాత హిమాయలన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో ఎలాంటి మార్పు చేయకుండా, దానికి పక్కనే ఓ గుండ్రటి టిఎఫ్‌టి డిస్‌ప్లేను అమర్చారు.

కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ డెలివరీలు ప్రారంభం

కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌లో ఇదివరకటి సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటుగా ఈ కొత్త సింపుల్ టర్న్-బై-టర్న్ నావిగేషన్ పాడ్ కూడా ఉంటుంది. ఈ ట్రిప్పర్ నావిగేషన్‌ను స్మార్ట్ ఫోన్ ద్వారా కనెక్ట్ చేసుకొని, గూగుల్ మ్యాప్స్ మరియు ఇతర సమాచారాన్ని పొందవచ్చు. ఈ మార్పులు మినహా ఇందులో వేరే ఏ ఇతర మార్పులు లేవు.

కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ డెలివరీలు ప్రారంభం

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కొత్త 2021 హిమాలయన్ కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు తమ బ్రాండ్ యొక్క ‘మేక్-ఇట్-యువర్స్’ కస్టమైజేషన్ ఆప్షన్లను కూడా అందస్తోంది. దీని సాయంతో కస్టమర్లు ఆన్‌లైన్‌లోనే తమ హిమాలయన్ మోటార్‌సైకిల్‌ను వివిధ రకాల యాక్ససరీలతో కస్టమైజే చేసుకొని, తుది ధరను పొందవచ్చు మరియు ఇలా కస్టమైజ్ చేసుకున్న బైక్‌ని స్పెషల్ ఆర్డర్ కూడా చేయవచ్చు.

కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ డెలివరీలు ప్రారంభం

కొత్తగా అప్‌డేట్ చేయబడిన 2021 హిమాలయన్ మోటారుసైకిల్ మునుపటిలాగే అదే బిఎస్ 6 కంప్లైంట్ ఇంజన్‌ని కలిగి ఉంటుంది. ఇందులోని 411 సిసి సింగిల్ సిలిండర్ ఎస్ఓహెచ్‌సి ఎయిర్-కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 24.3 బిహెచ్‌పి పవర్‌ను మరియు 32 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ డెలివరీలు ప్రారంభం

ప్రస్తుతం మార్కెట్లో కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మిరాజ్ సిల్వర్ మరియు గ్రావెల్ గ్రే కలర్ ఆప్షన్ల ధరలు రూ.2.36 లక్షలుగా ఉండగా, లేక్ బ్లూ, రాక్ రెడ్, గ్రానైట్ బ్లాక్ వేరియంట్ల ధరలు రూ.2.40 లక్షలుగాను మరియు పైన్ గ్రీన్ కలర్ రూ.2.44 లక్షలుగానూ ఉన్నాయి (అన్ని ధరలు ఆన్-రోడ్ ఢిల్లీ).

కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ డెలివరీలు ప్రారంభం

కొత్త 2021 మోడల్ హిమాలయన్ మోటార్‌సైకిల్‌ని మార్కెట్లో విడుదల చేసిన అనంతరం రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు తమ ఇతర మోడళ్లను కూడా అప్‌డేట్ చేసే పనిలో ఉంది. ఇందులో కొత్త 2021 క్లాసిక్ 350 మోడల్‌ను ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల చేయవచ్చని సమాచారం. ఆ తరువాత ఈ బ్రాండ్ నుండి కొత్తగా ఇంటర్‌సెప్టర్ 350, కొత్త 650సీసీ క్రూయిజర్ మోటార్‌సైకిల్, అప్‌డేటెడ్ ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 మోడళ్లు కూడా రానున్నాయి.
Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe