అంతర్జాతీయంగా గతేడాది మార్చి కంటే ఈ ఏడాది మార్చిలో తగ్గిన బంగారం ధర
భారతదేశంలో ఏ శుభకార్యమైన కొత్త ఆభరణాలు కొనుగోలు చేయడం ఎంతోకాలంగా ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇటీవల కాలంలో బంగారం కొనుగోలుకు ఆసక్తి ఉన్నప్పటికీ విపరీతంగా పెరిగిన ధరలతో భారతదేశ వాసులు బంగారం కొనాలంటే విముఖతను వ్యక్తం చేశారు. అయితే అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులతో పెరిగిన బంగారం ధర, ఇప్పుడు మళ్లీ భారీగా తగ్గింది. గతేడాతో పోలిస్తే ఎక్కువగానే తగ్గినట్టు కనిపిస్తుంది. గతేడాది మార్చిలో అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్ కు 2052 డాలర్లు పలికితే ఇప్పుడు 1815 డాలర్లు మాత్రమే ఉంది. ఈ లెక్క ప్రకారం బంగారం ధర భారీగా తగ్గినట్టే కనిపిస్తుంది.

60 వేలకు పైగా పెరిగిన బంగారం ధరలు.. తగ్గటంతో మళ్ళీ ఆశలు
ఇక ఈ సంవత్సరం ఒక దశలో దేశీయంగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 60 వేల రూపాయల మార్కు దాటినప్పటికీ మళ్లీ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంది. ఇక బంగారం బాటలో పెరిగిన వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టింది. ఇక ప్రస్తుతం తగ్గుతున్న ధరలతో బంగారం ధరలు మళ్ళీ ఇంకా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్న చాలామంది కొనుగోలు విషయంలో వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు.

హైదరాబాద్, ఢిల్లీ లో బంగారం ధరలిలా
ఇదిలా ఉంటే తాజాగా మరోమారు బంగారం ధరలలో తగ్గుదల నమోదయింది. ఇక బంగారం ధరలలో స్థానికంగా ఉండే పన్నులను బట్టి కూడా మార్పులు ఉంటాయి. నేడు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51,400 రూపాయలకు తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్లో 56,070గా ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,550 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,210గా కొనసాగుతుంది.

ముంబై, బెంగళూరు, విజయవాడ, విశాఖలలో బంగారం ధరలు ఇలా
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51 వేల 400 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 56,070 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇక విజయవాడ విశాఖపట్నంలో బంగారం ధరల విషయానికొస్తే నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర విజయవాడ, విశాఖపట్నం నగరాలలో 51,400గా కొనసాగుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విజయవాడ, విశాఖపట్నంలో 56,070 గా కొనసాగుతుంది. ఇక బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51 వేల 450 రూపాయలుగా కొనసాగుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర బెంగళూరులో 56వేల 110 రూపాయలుగా కొనసాగుతుంది.