Coconut Water: వేసవికాలం స్టార్ట్‌ అయ్యింది. ఇప్పటికే.. భానుడి భగభగలు మొదలయ్యాయి. మండే ఎండల వల్ల.. గొంతు ఎండిపోతుంది, డీహైడ్రేషన్‌, అలసట, నిస్సత్తువ, తలనొప్పి వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. వేసవి తాపం తట్టుకోవడానికి.. బెస్ట్‌ రిఫ్రెష్‌మెంట్‌ డ్రింక్‌.. కొబ్బరి నీళ్లు. కొబ్బరి నీళ్లు తాగితే.. డీహైడ్రేషన్‌, ఎండ వేడిని తగ్గడమే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు. నిస్సత్తువను తరిమికొట్టే.. కొబ్బరినీళ్లు తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చో ఇప్పుడు చూద్దాం.

ఈ పోషకాలు ఉంటాయి..

కొబ్బరి నీళ్లలో 94 శాతం నీరు ఉంటుంది, కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. 250 ml కొబ్బరి నీటిలో 9 గ్రాముల పిండి పదార్థాలు, 3 గ్రాముల ఫైబర్, 2 గ్రాముల ప్రోటీన్, 10 శాతం – విటమిన్ సి, 15 శాతం – మెగ్నీషియం, 17 శాతం – మాంగనీస్, 17 శాతం – పొటాషియం, 11 శాతం సోడియం, 6 శాతం కాల్షియం ఉంటాయి. (image source – pixabay)

శరీరాన్ని డిటాక్స్‌ చేస్తాయ్..

శరీరాన్ని డిటాక్స్‌ చేస్తాయ్..

కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది మీ శరీరం నుంచి అదనపు నీటిని, వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. కొబ్బరి నీళ్లలో యాంటీఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి, ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. (image source – pixabay)

జీర్ణక్రియకు మేలు చేస్తుంది..

జీర్ణక్రియకు మేలు చేస్తుంది..

కొబ్బరి నీరు కడుపుని శాంతపరుస్తుంది. ప్రేగు కదలకలను సులభతరం చేస్తుంది. కొబ్బరినీళ్లు జీర్ణక్రియకు మేలు చేస్తుంది. మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. కొబ్బరి నీళ్లలో మంచి మొత్తంలో ఎలక్ట్రోలైట్స్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఎసిడిటీతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగితే.. ఉపశమనం లభిస్తుంది. కొబ్బరినీళ్లలోని ఆల్కలీన్‌ గుణాలు.. ఎసిడిటీకి చెక్‌ పెడతాయి. ఇవి pHను బ్యాలెన్స్‌ చేస్తాయి.

ఇమ్యూనిటీ బూస్ట్‌ అవుతుంది..

ఇమ్యూనిటీ బూస్ట్‌ అవుతుంది..

2013 అధ్యయనం ప్రకారం కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్‌తో సమర్థవంతంగా పోరాడగలవు. ఇది మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది, అనేక అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్స్‌ నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. కొబ్బరి నీళ్లలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండుగా ఉంటాయి. వీటిలో రైబోఫ్లేవిన్, థయమిన్, నియాసిన్, పైరిడాక్సిన్ విటమిన్లు, ఫోలేట్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని బూస్ట్‌ చేస్తాయి. (image source – pixabay)

గర్భిణులకు మంచిది..

గర్భిణులకు మంచిది..

గర్భిణులు.. కొబ్బరి నీళ్లు తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లలో ఉండే.. విటమిన్‌ బి9 కడుపులో బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా వేధించే.. జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. కొబ్బరి నీళ్లలోని పొటాషియం హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది.

షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది..

షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది..

షుగర్‌ పేషెంట్స్‌.. కొబ్బరి నీళ్లు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయనే అపోహలో ఉంటారు. కానీ, కొబ్బరి నీళ్లు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గంచడంలో సాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరంలోని అధిక లవణాలను తొలగిస్తాయి. కొబ్బరి నీళ్లలోని మెగ్నీషియం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అదనంగా, ఇది టైప్ 2 డయాబెటిస్, ప్రీడయాబెటిస్‌లో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది..

గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది..

కొబ్బరి నీరు తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని 2008లో జరిగిన ఓ అధ్యయనం స్పష్టం చేసింది. ఈ అధ్యయనంలో ఎలుకలుకు.. కొవ్వులు, కొలెస్టాల్‌ అధికంగా ఉండే.. ఆహారాన్ని అందించారు. వీటికి అదే మొత్తంలో కొబ్బరి నీళ్లు ఇచ్చారు. 45 రోజుల తర్వాత వాటిని పరీక్షించగా… కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్‌ స్థాయిలు తగ్గినట్లు గుర్తించారు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ అదుపులో ఉంటుంది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. కొబ్బరి నీళ్లు హైపర్‌టెన్షన్‌ను తగ్గిస్తుందని 2005లో జరిగిన ఓ అధ్యయనం తెలిపింది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *