రుణభారం..

స్టేట్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయంతో రుణాలు ఖరీదుగా మారనున్నాయి. దీంతో భవిష్యత్తులో బ్యాంక్ నుంచి హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఆటో లోన్ తీసుకోవాలనుకునే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఫిబ్రవరి 8న రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ రిజర్వు బ్యాంక్ నిర్ణయం తీసుకోవటంతో తాజాగా ప్రభుత్వ బ్యాంక్ రేట్ల పెంపుకు ఉపక్రమించింది. అన్ని కాల వ్యవధులకు సంబంధించిన MCLRను 10 బేసిస్ పాయింట్ల మేర SBI పెంచింది.

రేటు పెంపు తర్వాత..

రేటు పెంపు తర్వాత..

పెరిగిన MCLR రేటు ఫిబ్రవరి 15 నుంచి తీసుకునే రుణాలకు వర్తిస్తాయని బ్యాంక్ వెల్లడించింది. ఈ కారణంగా కొత్తగా బ్యాంక్ నుంచి రుణాలు పొందేవారు గతంలో కంటే ఎక్కువ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో దేశంలోని ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులు రిజర్వు బ్యాంక్ ప్రకటన తర్వాత వాటి రుణ రేట్లను సవరిస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. మరికొన్ని బ్యాంకులు తమ ఫిక్స్ డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేట్లను కూడా పెంచుతున్నట్లు ప్రకటిస్తున్నాయి.

కొత్త MCLR రేట్లు..

కొత్త MCLR రేట్లు..

SBI ఓవర్‌నైట్ MCLR రేటును 10 బేసిస్ పాయింట్లు 7.85 శాతం నుంచి 7.95 శాతానికి, 1 నెల MCLR రేటును 8 శాతం నుంచి 8.10 శాతానికి, 3 నెలల MCLR రేటును 8 శాతం నుంచి 8.10 శాతానికి పెంచింది. అదే సమయంలో బ్యాంక్ 6 నెలలకు MCLR రేటును 8.30% నుంచి 8.40%కి అంటే 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇక ఒక సంవత్సరానికి MCLR 8.40% నుంచి 8.50%, MCLR 2 సంవత్సరాలకు 8.50% నుంచి 8.60%నికి పెరిగింది. అలాగే 3 సంవత్సరాలకు సంబంధించిన 8.70 శాతానికి పెరిగింది.

MCLR రేటు అంటే ఏమిటి..?

MCLR రేటు అంటే ఏమిటి..?

మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) అని పిలుస్తారు. ఇది బ్యాంకు తన కస్టమర్లకు రుణం ఇవ్వగల కనీస రేటు. వివిధ రకాల రుణాల వడ్డీ రేట్లను నిర్ణయించడానికి RBI 2016లో MCLR రేటును ప్రవేశపెట్టింది. MCLR రేటు పెరుగుదల లేదా తగ్గింపు ఆధారంగా కస్టమర్ల EMI నిర్ణయించబడుతుంది. అంటే బ్యాంక్ MCLR రేటులో మార్పులు చేసినట్లయితే అది రుణాలు తీసుకునే వారిని ప్రభావితం చేస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *