టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా.. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన తాజా మూవీ హిట్ 3. శైలేష్ కొలను డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. ఫస్ట్ డే, ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కలెక్షన్ల పరంగాను దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో తన నటనతో నాని ఆడియన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించారు. మునుపెన్నడు లేని విధంగా మాస్ యాక్షన్‌తో స్క్రీన్ పై బ్లడ్ బాత్ చేసిన నాని.. మరోసారి తన సత్తా చాటుకున్నాడు. ఈ క్రమంలోనే సినిమా కలెక్షన్ల పరంగాను దూసుకుపోతుంది.
ఇక మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సినిమా ఏకంగా రూ.43 కోట్ల వసూలు కొల్లగొట్టినట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. బుక్ మై షోలో ఫస్ట్ డేనే రెండు లక్షల కంటే ఎక్కువ టికెట్లు అమ్ముడుపోయాయని సమాచారం. మొదటి రోజు మూవీ ఆక్యుపెన్సి మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే మార్నింగ్ షోకు 80% ఆక్యుపెన్సీ రాగా.. మధ్యాహ్నం నుంచి 92 శాతం ఆక్యుపేన్సి సొంతం చేసుకుంది. అలా ఫస్ట్‌డే తెలుగు రాష్ట్రాలలో రూ.13 కోట్ల కలెక్షన్‌లు కొల్లగొట్టిన ఈ సినిమా.. రెండవ రోజు కూడా నిలకడగానే బాక్స్ ఆఫీస్ జర్నీ కొనసాగించింది.
మొదటి రోజు రికార్డ్ రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొట్టిన నాని.. రెండవ రోజు కాస్త స్పీడ్ తగ్గించాడు. ఈ సినిమా మార్నింగ్ షో కు 40 శాతం ఆక్యుపేసి, మ్యాట్నీ షో, ఫస్ట్ షోకు 55% అక్యుపెన్సీ కొనసాగింది. ఈ సినిమా సెకండ్ షోకు 58% ఆక్యుపెన్సితో రన్ అయినట్లు సకనిల్క్ వెల్లడించింది. ఇక సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.8 కోట్ల మేర వసూళ్లు కోల్లగొట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. ప్రపంచ వ్యాప్తంగా రూ.63 కోట్ల కలెక్షన్‌లు కొల్లగొట్టినట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు.