Sunday, July 25, 2021

కోర్టులో బోరుమన్న దిశ రవి -గ్రెటా ‘టూల్ కిట్’ కేసులో 5రోజుల రిమాండ్ -భారీ మద్దతు -అసలేంటీ కేసు?

కోర్టులో బోరుమన్న దిశ..

ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతుగా ఇచ్చిన ట్వీట్‌కు జత చేసిన టూల్‌కిట్‌ను తొలగించాలని గ్రెటా థన్‌బర్గ్‌ను దిశ రవి కోరినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. దిశ రవిని బెంగళూరులో శనివారం అరెస్టు చేసి, ఆదివారం న్యూఢిల్లీలోని కోర్టులో హాజరుపరిచారు. పాటియాలా కోర్టు కాంప్లెక్సులోని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జడ్జి దేవ్ సరోహా.. దిశను ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చారు. కోర్టు హాలులో బోరున విలపించిన దిశ.. ఆ టూల్ కిట్ తాను రూపొందించలేదని, రెండు సార్లు మాత్రమే ఎడిట్ చేశానని చెప్పుకొచ్చారు.

ఆమెనే సూత్రధారిణి అంటూ..

ఆమెనే సూత్రధారిణి అంటూ..

ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, స్వీడిష్ క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్‌బర్గ్ ఇచ్చిన ట్వీట్‌తోపాటు టూల్‌కిట్ డాక్యుమెంట్‌ను జత చేశారు. ఈ టూల్‌కిట్‌కు ఎడిటర్, రూపకర్త దిశ రవి. ఈ టూల్‌‌కిట్‌ను ఇతరులకు పంపించిన వ్యక్తి కూడా దిశ రవి. దీనిలో పేర్కొనవలసిన వివరాలను తెలియజేస్తూ, దీనిని తయారు చేయడంలో ఇతరులతో కలిసి సన్నిహితంగా దిశ రవి వ్యవహరించారు. అంతేకాకుండా వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి, టూల్‌కిట్ డాక్యుమెంట్ రూపకల్పనకు ఖలిస్థాన్ అనుకూలవాదులకు సహకరించారు. కానీ దిశ, ఆమె అనుచరులు మాత్రం ఈ ఆరోపనలను తొసిపుచ్చారు. ఈలోపే..

ఖలిస్థాన్ అనుకూలవాదుల మద్దతు

ఖలిస్థాన్ అనుకూలవాదుల మద్దతు

‘టూల్‌కిట్’ కేసులో దిశ రవి అరెస్టును ఖలిస్థాన్ అనుకూల సంస్థ పొయిటిక్ జస్టిస్ ఫౌండేషన్ (పీజేఎఫ్) వ్యవస్థాపకుడు మో ధలీవాల్ తీవ్రంగా ఖండించారు. ట్వీట్లు, హ్యాండిల్స్, హ్యాష్‌ట్యాగ్స్ ఉన్న డాక్యుమెంట్ ఆధారంగా దిశను అరెస్టు చేయడం దారుణమని ట్విటర్ వేదికగా మండిపడ్డారు. అలాంటి డాక్యుమెంట్‌ ఇండియాలో ఓ వ్యక్తిని ఎలా అరెస్టు చేయించగలిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అని చెప్పుకునే భారత దేశంలో ఓ డాక్యుమెంట్ కోసం ఎందుకు అరెస్టు చేశారో అడగాలని అంతర్జాతీయ సమాజాన్ని డిమాండ్ చేశారు.

అసలు ఏమిటీ టూల్‌కిట్?

అసలు ఏమిటీ టూల్‌కిట్?

పొయిటిక్ జస్టిస్ ఫౌండేషన్ ‘ఆస్క్ ఇండియా వై’ అనే ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనిలో భాగంగానే ఈ టూల్‌కిట్‌ను రూపొందించి, వ్యాపింపజేసింది. గ్రెటా థన్‌బర్గ్ దీనినే షేర్ చేశారు. దీని శీర్షిక ‘గ్లోబల్ ఫార్మర్స్ స్ట్రైక్-ఫస్ట్ వేవ్’. జనవరి నుంచి ఇది ప్రచారంలో ఉంది. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులకు సంఘీభావంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని ఈ టూల్‌కిట్ వివిధ వర్గాల వారిని ప్రోత్సహిస్తోంది. ఇండియన్ ఎంబసీలు, స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు, అదానీ, అంబానీ కంపెనీల కార్యాలయాల వద్ద సంఘీభావ నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని చెప్తోంది. గణతంత్ర దినోత్సవాలనాడు ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొనాలని కూడా కోరింది. ఈ ట్రాక్టర్ ర్యాలీలో పెద్ద ఎత్తున హింస జరిగింది. ఇదంతా కుట్ర పూరితంగా జరిగినట్లు పేర్కొన్న ఢిల్లీ పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. తొలిగా బెంగళూరుకు చెందిన దిశ రవిని అరెస్టు చేశారు.

 ఎవరీ దిశ రవి? ఆమె కోసం విద్యార్థులు..

ఎవరీ దిశ రవి? ఆమె కోసం విద్యార్థులు..

బెంగళూరుకు చెందిన 21ఏళ్ల సామాజిక ఉద్యమకారిణి దిశ రవి.. ‘ప్రైడే ఫర్ ప్యూచర్’ పేరుతో ఓ సంస్థను నడుపుతూ, వాతావరణ మార్పులపై అవగాహన కల్పిస్తుంటారు. బెంగళూరులోని ఓ ప్రముఖ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తూనే ఆమె పర్యావరణ ఉద్యమలో పాలుపంచుకుంటున్నారు. రైతుల నిరసనలకు ముందు నుంచీ మద్దతు తెలుపుతోన్న ఆమె.. గెటా థెన్‌బర్గ్ షేర్ చేసిన టూల్ కిట్ ను రూపొందించినట్లుగా ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నారు. కాగా, దిశపై దేశ ద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు చేయడంపై బెంగళూరులోని ఆమె స్నేహితులు, విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. దిశ విడుదల కోరుతూ వారంతా రోడ్లెక్కి ఉద్యమించేందుకు కార్యాచారణ సిద్దం చేసుకుంటున్నారని మీడియాలో రిపోర్టులు వచ్చాయి. వాతావరణ మార్పులపై పనిచేస్తోన్న పలు సంస్థలు కూడా ఆమెకు మద్దతుగా నిలిచాయి.


Source link

MORE Articles

10 Gboard shortcuts that’ll change how you type on Android

If there's one thing we Android-totin' pterodactyls take for granted, it's just how good we've got it when it comes to typing out...

గంజాయి ,గుట్కా, డ్రగ్స్ తీసుకునే మంత్రులా ఈటలను ఓడించేది, గెలిపించేది మీ వాళ్ళే : బండి సంజయ్ సంచలనం

Telangana లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ విత్తన తయారీ దారులు!! గంజాయి ,గుట్కా, డ్రగ్స్ తీసుకునే మంత్రులా ఈటలను...

‘నయా నిజాం.. కేసీఆర్ చెంప మీద కొట్టే ఎన్నిక ఇది-నన్ను కాదు,నీ బిడ్డను ఎందుకు గెలిపించుకోలేకపోయావ్’

నీ బిడ్డను ఎందుకు గెలిపించుకోలేకపోయావ్ : ఈటల 'ఈటల రాజేందర్‌కు కుడి,ఎడమ ఎవరూ ఉండొద్దు... ఆయనకు మనిషులే దొరకద్దు... ప్రాణం ఉండగానే బొందపెట్టాలి అని చూస్తున్నారు. ఇక...

ట్రాన్స్‌జెండర్ అనన్య కుమారి అలెక్స్ భాగస్వామి ఆత్మహత్య… ఆమె చనిపోయిన రెండు రోజులకే…

అనన్య ఆత్మహత్యను తట్టుకోలేకనే...!! బుధవారం(జులై 22) అనన్య కుమారి అలెక్స్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. జిజు ఇంట్లో లేని సమయంలో అనన్య ఆత్మహత్య చేసుకుంది. అనన్య...

కేటీఆర్ పుట్టినరోజునూ వదలని వైఎస్ షర్మిల .. ఆ హృదయం ఇవ్వాలని షాకింగ్ ట్వీట్ తో పాటు కానుక కూడా !!

భగవంతుడు మీకు నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపే మనసు ఇవ్వాలి పుట్టినరోజు సందర్భంగా ఇది మీకు నేను చిన్న కానుక అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. కెసిఆర్...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe