PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

క్యాన్సర్‌ రాకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి..!


Anti cancer Foods: క్యాన్సర్‌ ప్రాణాంతక వ్యాధి. ఈ మహమ్మరి.. రోగిని శారీరకంగానే కాదు మానసికంగానూ కుంగదీస్తుంది. నివేదిక‌ల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటి మందికి పైగా క్యాన్సర్‌ బారిన ప‌డుతున్నారు. క్యాన్సర్‌ కణితులు శరీరంలోని ఏ భాగంలోనైనా.. పెరిగి క్రమంగా ఇతర అవయవాలకు వ్యాపించి ప్రాణాంతకంగా మారవచ్చు. జ‌న్యుప‌ర‌మైన కార‌ణాలు, వంశ‌పారంప‌ర్యంగా, స్మోకింగ్‌, మ‌ద్య‌పానం కారణంగా క్యాన్సర్‌ వస్తుందని అనుకుంటారు. అయితే.. మూడింట రెండొంతుల క్యాన్సర్లు మన చెడు ఆహారపు అలవాట్లు , పరిసరాల ప్రభావాల కారణంగానే వస్తాయని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్‌ వచ్చిన తర్వాత బాధపడటం కంటే.. రాకుండా జాగ్రత్త పడటం మంచిదని నిపుణులు అంటున్నారు. క్యాన్సర్‌ను నివారించడానికి మన లైఫ్‌స్టైల్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలని, డైట్‌లో పోషకాహారం చేర్చుకోవాలని డాక్టర్‌ స్నితా సినుకుమార్ సూచించారు. (Dr. Snita Sinukumar (MS, MCH.), Consultant Surgical Oncologist at Jehangir Hospital)

ఈ ఆహారం తీసుకోండి..

మీ డైట్‌లో ఆరోగ్యకరమైన ఆహారం, తక్కువ ప్రాసెస్‌ చేసిన ఆహారం తీసుకుంటే.. చాలా వరకు క్యాన్సర్లను నిరోధించవచ్చని డాక్టర్‌ స్నితా సినుకుమర్‌ అన్నారు. మీ ఆహారంలో ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్స్‌, హెల్తీ ఫ్యాట్స్‌, మినరల్స్‌, విటమిన్లుతో కూడిన సమతుల్య ఆహారం తీసుకుంటే.. ప్రమాదకరమైన వ్యాధులకు దూరంగా ఉండవచ్చని సూచించారు. (image source – pixabay)

రంగురంగుల కూరగాయలు, పండ్లు తీసుకోండి..

రంగురంగుల కూరగాయలు, పండ్లు తీసుకోండి..

క్యాన్సర్‌ నుంచి రక్షణ పొందాలంటే.. మీ డైట్‌లో బెర్రీలు, ఆకుకూరలు, క్రూసిఫెరస్‌ కూరగాయలు(క్యాలీఫల్లవర్‌, క్యాబేజీ, కాలే, బ్రూసెల్‌ స్ప్రౌట్స్‌), క్యారెట్, రకరకాల పండ్లు చేర్చుకోండి. ఇవి తింటే.. శరీరానికి అవసరమైన పోషకాలు, యాంటీఆక్సిటెంట్లు, పాలీఫినాల్ .అందుతాయి. యాంటీఆక్సిడెంట్లు.. ఫ్రీ రాడికల్స్‌ మన శరీరంలోని కణాలు దెబ్బతినకుండా రక్షిస్తాయి. క్యాన్సర్‌ను కలిగించే కణాలను నిర్మూలిస్తాయి పాలీఫినాల్ క్యాన్సర్ పెరగకుండా రక్షిస్తాయి.

తృణధాన్యాలు..

తృణధాన్యాలు..

తృణధాన్యాలోల ఫైబర్‌ సమృద్ధిగా ఉంటుంది. ఫైబర్‌ క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తృణధాన్యాలలోని పోషకాలు.. క్యాన్సర్‌ కణాలతో పోరాడతాయి. క్యాన్సర్‌ను నివారించాలనుకుంటే.. మీ ఆహారంలో బ్రౌన్ రైస్‌, హోల్‌ వీట్‌, ఓట్స్‌ వంటి ఆహారం చేర్చుకోండి.

కాయధాన్యాలు..

కాయధాన్యాలు..

బీన్స్, చిక్కుడులో ఫైబర్‌, ప్రోటీన్‌, ఫైటోకెమికల్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ కణాలతో పోరాడతాయి. కాయధాన్యాలు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను అడ్డుకుంటాని అధ్యయనాలు స్పష్టం చేశాయి. క్యాన్సర్‌ను నిరోధించే ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తాయి. రక్తంలోని షుగర్ స్థాయులను ఇవి కంట్రోల్‌ చేస్తాయి.

నట్స్‌..

నట్స్‌..

నట్స్‌లోని ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిలో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి, ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచి క్యాన్సర్‌ను దూరంగా ఉంచుతాయి. మీ ఆహారంలో బాదం, వాల్‌నట్స్‌, గుమ్మడి గింజలు చేర్చుకుంటే.. క్యాన్సర్‌ ముప్పు తగ్గుతుంది. రోజు నట్స్‌ తింటే.. కొలొరెక్టల్, ప్యాంక్రియాటిక్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ల నుంచి రక్షణ లభిస్తుంది.

సాల్మన్ చేపలు

సాల్మన్ చేపలు

సాల్మన్ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ సమృద్ధిగా ఉంటాయి. వీటిలో విటమిన్‌లు, ప్రొటీన్లు, సెలీనియం మెండుగా ఉంటాయి. ఈ పోషకాలు లివర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాన్సర్‌ను నిరోధించడంలో తోడ్పడతాయి.

వ్యాయామం చేయండి..

వ్యాయామం చేయండి..

క్యాన్సర్‌ను నిరోధించేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ తేలికపాటి వ్యాయమం, వాకింగ్‌, యోగా చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుంది.

స్మోకింగ్‌కు దూరంగా ఉండండి..

స్మోకింగ్‌కు దూరంగా ఉండండి..

స్మోకింగ్‌ క్యాన్సర్‌కు అతిపెద్ద కారణం అని వైద్యులు భావిస్తుంది. స్మోకింగ్‌.. క్యాన్సర్‌ మరణాల ముప్పును 22 శాతం పెంచుతుంది. స్మోకింగ్‌ కారణంగా.. ఊపిరితిత్తులు, మూత్రాశయం, ప్యాంక్రియాటిక్ ఇతర క్యాన్సర్లు వచ్చే ముప్పు పెరుగుతుంది. క్యాన్సర్‌ను నివారించడానికి.. స్మోకింగ్‌కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *