అంతర్జాతీయంగా నేడు బంగారం ధర ఇలా

గత పది రోజులలో ఒకసారి పెరిగిన బంగారం వెండి ధరలు, మిగిలిన అన్ని రోజులలోనూ వరుసగా పడిపోతూనే వచ్చాయి. అంతర్జాతీయంగానూ, దేశీయంగాను ప్రస్తుతం బంగారం ధరలలో క్షీణత కొనసాగుతుంది. ఇప్పటికే ఓ మారు యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెంచిన క్రమంలో బంగారం ధరలు తగ్గాయి. ఇప్పుడు మరో మారు యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెరుగుతాయన్న అంచనాలతో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నట్టుగా భావిస్తున్నారు. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్ కు 1818 డాలర్ల వద్ద కొనసాగుతుంది. స్పాట్ వెండి రేటు ఔన్స్ కు 20 .65 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది.

హైదరాబాద్, ఢిల్లీలలో తగ్గిన బంగారం ధరలు ఇలా

హైదరాబాద్, ఢిల్లీలలో తగ్గిన బంగారం ధరలు ఇలా

ఇక దేశీయంగా బంగారం ధరల విషయానికి వస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం తులానికి ప్రస్తుతం 51,350 వద్ద కొనసాగుతుంది. నిన్నటితో పోలిస్తే ధర 150 రూపాయల మేర తగ్గింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర విషయానికి వస్తే 56,020గా కొనసాగుతుంది. 24 క్యారెట్ల బంగారం మీద 160 రూపాయల మేర ధర తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే ప్రస్తుతం ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 51,500 ధర పలుకుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి ప్రస్తుతం 56 వేల 170 రూపాయలు ధరగా ఉంది.

ముంబై, విజయవాడ, విశాఖలలో బంగారం ధరలు ఇలా

ముంబై, విజయవాడ, విశాఖలలో బంగారం ధరలు ఇలా

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 51,350 గా కొనసాగుతుంటే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,020 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 51,350 గా కొనసాగుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విజయవాడలో 56,020గా కొనసాగుతుంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 51 వేల 350 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,020 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది.

బెంగళూరు, చెన్నై లలో నేడు బంగారం ధరలు

బెంగళూరు, చెన్నై లలో నేడు బంగారం ధరలు

ఇక బెంగళూరులో నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,400 రూపాయలుగా ఉంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 56,070 గా కొనసాగుతుంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,010గా కొనసాగుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 56, 740 గా ట్రేడ్ అవుతుంది. దేశంలోనే అత్యధికంగా తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, కోయంబత్తూర్, మధురై లలో బంగారం ధరలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *