అయితే, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను మరింత ఆసక్తికరంగా మార్చే కొన్ని హెల్దీ నోరూరించే రెసిపీస్ ఉన్నాయి. సరే, సెలవులని హెల్దీగా మార్చే కొన్ని హెల్దీ, ఎగ్జైటింగ్‌ వంటలను డైటీషియన్ గరిమా గోయల్ చెబుతున్నారు.

​హెల్దీ ఎగ్‌నాగ్..

ఈ హెల్దీ నాన్ ఆల్కహాలిక్ ఎగ్ నాగ్ చాలా ఈజీ. ఇది సాధారణ దశలను కలిగి ఉంటుంది. హెల్దీగా చేసేందుకు ఫ్యాట్ మిల్క్‌ని బాదం మిల్క్‌తో చేయండి. చక్కెర బదులు తేనె వాడండి. ఇది చేసేందుకు బాదంపాలు, తేనె, గుడ్డు సొన, దాల్చిన చెక్క, జాజికాయలను బ్లెండర్‌లో వేసి బాగా మిక్సీ పట్టండి. ఈ డ్రింక్‌ని పాన్‌లో వేసి చిక్కగా అయ్యే వరకూ ఉడికించండి. ఎగ్‌నాగ్ చిక్కబడ్డాక, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్ వేసి గుడ్డును గాలి చొరబడని కంటెయినర్‌లోకి వేసి కనీసం 6 నుంచి 8 గంటల పాటు లేదా చల్లబడేవరకూ ఫ్రిజ్‌లో పెట్టండి. దీనిని సెర్వ్ చేసే ముందు దాల్చిన చెక్క, జాజికాయ పొడి చల్లి ఆస్వాదించండి.

Also Read : Best Diet : ఈ డైట్‌తో ఏకంగా 50 కిలోల బరువు తగ్గింది..

​క్వినోవా పీనట్ బ్రిట్ల్..

ఇంట్లో తయారు చేసిన క్వినోవా పీనట్ బ్రిట్ల్ ఈ పండుగ సీజన్‌లో ట్రై చేసే హెల్దీ రెసిపీ. ఇది ఎక్కు ప్రోటీన్, ఫైబర్, కొవ్వు కలిగి ఉంటుంది. స్నాక్స్ కోసం చూస్తున్న వారికి ఇది హెల్దీ. ఈ హెల్దీ స్నాక్స్ తయారు చేసేందుకు ఓవెన్‌ని 325 డిగ్రీల వరకూ వేడి చేయండి. పార్చ్‌మెంట్ పేపర్‌తో రిమ్డ్ బేకింగ్ షీట్‌ను లైన్ చేయండి. మిక్సింగ్ గిన్నెలో వండని క్వినోవా, వండని రోల్డ్ ఓట్స్, వేరు శనగ, కోకొనట్ షుగర్, చియా, ఉప్పుని కలపండి. కొబ్బరి నూనె, స్వచ్చమైన మాపుల్ సిరప్, వెనిల్లా ఎక్స్‌ట్రాక్ట్ వేసి బాగా కలపాలి. కొబ్బరి నూనెతో వేసిన ట్రేలో క్వినోవాను వేయండి. పూర్తిగా చల్లార్చండి. దీనినిన ముక్కలుగా కట్ చేయండి.

​హెల్దీ ముయెస్లీ డెజర్ట్..

గ్రీక్ యోగర్ట్‌ని, తాజా పండ్లతో తయారైన ముయెస్లీతో హెల్దీగా ఉంటుంది. నట్స్ ఎక్కువగా ఉండడం వల్ల హెల్త్‌కి మంచిది. ఓ గాజు కప్పు, గిన్నెలో 1 స్పూన్ల ముయెస్లీని కలపండి. తర్వాత 2 టేబుల్స్పూన్ల గ్రీక్ యోగర్ట్‌ వేయండి. తర్వాత మిక్డ్స్ బెర్రీలు, పైనాపిల్ ముక్కలు వేయండి. ఇలానే కప్ నిండేవరకూ వేయండి. దీనిని సర్వ్ చేయండి.

Also Read : Heart problems : ఈ ఎక్సర్‌సైజెస్ గుండెకి చాలా మంచివట..

​వార్మ్ బెర్రీ క్రంబెల్..

నట్స్, సీడ్స్ వేయడం వల్ల గుండెకి మేలు చేసే డెసర్ట్‌ అవుతుంది. ఓవెన్‌ని 350 డిగ్రీల వరకూ వేడి చేయండి. టాపింగ్ కోసం కొబ్బరి నూనె, డేట్స్, అర స్పూన్ వెనిల్లా ఎక్స్‌ట్రాక్ట్‌ని ఫుడ్ ప్రాసెసర్‌లో వేసి పేస్ట్‌‌లా అయ్యే వరకూ బ్లెండ్ చేయండి. అప్పుడు బాదం పిండి, వాల్ నట్స్, కొబ్బరి ముక్కలు, అవిసె గింజలు అర టీ స్పూన్ దాల్చిన చెక్క వేసి ప్రాసెస్ చేయండి. ఇప్పుడు బెర్రీస్, స్టార్చ్‌‌ని ఓ గిన్నెలో వేసి బాగా కలపండి. నిమ్మరసం, మిగిలిన దాల్చిన చెక్క, వెనిల్లా ఎక్స్‌ట్రాక్ట్ వేసి బాగా కలపాలి. తేలిగ్గా గ్రీజ్ చేసిన బేకింగ్ డిష్‌లో బెర్రీ మిశ్రమాన్ని వేయండి. ఆపై టాపింగ్‌ను పైన చిలకరించాలి. బెర్రీలు బబుల్ అయ్యే వరకూ బేక్ చేయండి. టాపింగ్ గోల్డెన్ రంగులో సుమారు 30 నిమిషాలు బేక్ చేయండి. ఇప్పుడు కాస్తా చల్లబరచండి.

​క్వినోవా ఇడ్లీ..

ప్రోటీన్ ప్యాక్డ్ పిల్లోయ్ సాఫ్ట్ స్టీమ్డ్ క్వినోవా ఇడ్లీ హెల్దీ స్నాక్ డిష్. క్వినోవా, బియ్యాన్ని నీటిలో కడిగి ఆపై క్వినోవా, బియ్యాన్ని నీటిల 6 గంటల పాటు నానబెట్టి, మినపప్పుని కూడా నీటిలో కడిగి 1 టీ స్పూన్ మెంతిగింజలతో కలిపి 6 గంటల పాటు నానబెట్టండి. 6 గంటల తర్వాత నీటిలో నుంచి తీసి బ్లెండ్ చేసి మెత్తగా పేస్ట్‌లా చేయండి. దీనిని రాత్రంతా నానబెట్టి ఇడ్లీలా స్టాండ్‌లో వేసి ఇడ్లీ చేయండి.

Also Read : Pancreatic Cancer : లివర్ క్యాన్సర్ ఉంటే ఈ లక్షణాలు ఉంటాయట..

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *