ఖాళీ కడుపుతో కరివేపాకు తినండి.. ఆరోగ్యాన్ని పెంచుకోండి

Date:

Share post:


కరివేపాకు( Curry Leaves ) గురించి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.దాదాపు ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లో ప్ర‌తి నిత్యం క‌రివేపాకును విరివిరిగా వాడుతుంటారు.

 Health Benefits Of Eating Curry Leaves During Empty Stomach Details, Curry Leav-TeluguStop.com

కరివేపాకులో ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.ఆరోగ్య ప‌రంగా క‌రివేపాకు అపార‌మైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.

కూర‌ల్లోనే కాకుండా క‌రివేపాకును నేరుగా కూడా తినొచ్చు.ముఖ్యంగా ఉద‌యం ఖాళీ కడుపుతో ఐదారు కరివేపాకు ఆకులు నమిలి తింటే మ‌స్తు ఆరోగ్య లాభాలు మీసొంతం అవుతాయి.

డ‌యాబెటిస్( Diabetes ) ఉన్న‌వారికి కరివేపాకు వరం అని చెప్పవచ్చు.రోజు ఖాళీ కడుపుతో కరివేపాకును నమిలి తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అలాగే ఇటీవల రోజుల్లో వ‌య‌సుతో సంబంధం లేకుండా చాలా మందిలో కంటి చూపు మందగిస్తుంది.కొంద‌రిలో విటమిన్ ఎ లోపం ఇందుకు ప్ర‌ధాన కార‌ణం కావొచ్చు.అయితే విట‌మిన్ ఎ కొర‌త‌ను పూడ్చి కంటి చూపును( Eye Sight ) పెంచ‌డంలో కరివేపాకు ఉత్త‌మంగా హెల్ప్ చేస్తుంది.రోజు ఉదయం ఖాళీ కడుపుతో క‌రివేపాకు తింటే కళ్ళద్దాలపై ఆధార పడాల్సిన అవసరం ఉండదు.

Telugu Curry, Curry Benefits, Diabetes, Empty Stomach, Eye, Fall, Tips, Latest-T

ఖాళీ కడుపుతో క‌రివేపాకు తినడం వల్ల రక్తంలో ఉన్న విషపదార్థాలను తొలగిపోతాయి.రక్తశుద్ధి జ‌రుగుతుంది.క‌రివేపాకులో ఐరన్ అధిక మొత్తంలో ఉంటుంది.అందువ‌ల్ల కరివేపాకు రక్తహీనతను తగ్గించడంలో తోడ్ప‌డ‌తుంది.కరివేపాకులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.ఖాళీ క‌డుపుతో క‌రివేపాకు తింటే గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి.

Telugu Curry, Curry Benefits, Diabetes, Empty Stomach, Eye, Fall, Tips, Latest-T

హెయిర్ ఫాల్ ఎందరినో కామ‌న్ గా వేధించే సమస్య.అయితే హెయిర్ ఫాల్ సమస్యను నివారించడానికి కరివేపాకు చక్కగా ఉపయోగపడుతుంది.రోజు ఉదయం కరివేపాకు తింటే జుట్టుకు మంచి పోషణ అందుతుంది.హెయిర్ రూట్స్ స్ట్రోంగ్ గా మారి.జుట్టు ఊడ‌టం, విర‌గ‌డం త‌గ్గుతాయి.అంతేకాకుండా ఖాళీ క‌డుపుతో క‌రివేపాకు తింటే స్కిన్ కూడా హెల్తీగా మారుతుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?

టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో బాబీ కొల్లి(కె.ఎస్‌. ర‌వీంద్ర‌) ఒకరు. అయితే తాజాగా బాబీ కి తన అభిమాన హీరో...

వారణాసిలో ‘ వీరమల్లు ‘ ఫ్రీ రిలీజ్.. స్పెషల్ గెస్ట్ ఎవరో అసలు గెస్ చేయలేరు..?

టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్‌ను భారీ లెవెల్‌లో ప్లాన్...