[ad_1]
తాజా పండ్లు..
మహిళలు గర్భాశయ ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి పండ్లు ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతున్నారు. మన ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు, పోషకాలు, పీచు, ఫోలిక్ యాసిడ్, సూక్ష్మపోషకాలు పండ్లలో సమృద్ధిగా ఉంటాయి. ఆయా సీజన్‌కు తగ్గ పండ్లు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పండ్లలో ఉండే విటమిన్ సీ, ఫ్లేవనాయిడ్స్ పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇవి అండాశయ క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి. పండ్లలో ఉండే బయోఫ్లేవనాయిడ్స్ ఈస్ట్రోజన్ స్థాయిలను న్యూట్రల్ చేస్తాయి. (Image source – pixabay)
నట్స్ & విత్తనాలు..
బాదం, జీడిపప్పు, వాల్‌నట్, అవిసె గింజలల్లో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్, మంచి కొవ్వులు అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు గర్భాశయ ఫైబ్రాయిడ్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ మీ సీరం కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇవి బిడ్డ నెలలు నిండక ముందే పుట్టడం, బరువు తక్కువగా పుట్టకుండా చూసుకుంటాయి. (Image source – pixabay)
ఆకుకూరలు..
చాలా మంది ఆకుకూరలు తినడానికి అంతగా ఇష్టపడరు. పాలకూర, బచ్చలికూర, తొట కూర వంటి ఆకుకూరలు.. గర్భాశయ ఆరోగ్యాన్ని అద్భుతంగా రక్షిస్తాయి. ఇవి ఆల్కలీన్ బ్యాలెన్స్‌ను నిర్వహిస్తాయి. ఆకుకూరల్లోని విటమిన్స్, ఫోలిక్ యాసిడ్స్.. గర్భశయాన్ని ఆరోగ్యాంగా ఉంచుతాయి. (Image source – pixabay)
నిమ్మకాయ..
గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం వేసుకుని తాగితే.. అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ నీళ్లు మీ గర్భాశయానికీ ఎంతగానో మేలు చేస్తాయి. నిమ్మకాయలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది గర్భాశయ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. (Image source – pixabay)
తృణధాన్యాలు..
తృణధాన్యాల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఫైబర్ ఫైబ్రాయిడ్ కణితులను నియంత్రించడంలో, నిరోధించడంలో సహాయపడుతుంది. శరీరం నుంచి అదనపు ఈస్ట్రోజెన్‌ను బయటకు పంపి.. వాటి సరైన పనితీరుకు సహాయపడతాయి. బ్రైన్‌రైస్, ఓట్స్, బార్లీ వంటి ఆహార పదార్థాలు మీ డైట్‌లో చేర్చుకోండి. (Image source – pixabay)
గ్రీన్ టీ..
గ్రీన్ టీయాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇవి గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. గర్భాశయంలో ఫైబ్రాయిడ్ల సమస్యకు చికిత్స చేయడానికీ సహాయపడతాయి. గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు ఉన్న మహిళలు 8 వారాలపాటు క్రమం తప్పకుండా గ్రీన్ టీని త్రాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఫైబ్రాయిడ్ల సంఖ్యను తగ్గిస్తుంది. (Image source – pixabay)
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply