PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడకుండా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

[ad_1]

Gallbladder Stones: గాల్‌బ్లాడర్‌.. దీన్ని తెలుగులో పిత్తాశయం అంటారు. జీర్ణవ్యవస్థలో పిత్తాశయం ఒక ముఖ్యమైన భాగం. పిత్తాశయం లివర్‌ కింద పియర్-ఆకారంలో ఉండే చిన్న అవయవం. ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియలో ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. లివర్‌లో ఉత్పత్తి అయ్యే.. పైత్యరసం (బైల్‌ జ్యూస్‌)ను గాల్‌బ్లాడర్‌ నిల్వ చేస్తుంది. అక్కడి నుంచి బైల్‌ డక్ట్‌ అనే పైప్‌ ద్వారా చిన్న పేగుకు సరఫరా అయ్యేలా చూస్తుంది. మనం తీసుకునే ఆహారంలో కొవ్వులూ, కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉంటే, వాటిని చిన్న చిన్న ముక్కలైపోయి జీర్ణమయ్యేలా ఈ బైల్‌జ్యూస్‌ చూస్తుంది. ఈ రోజుల్లో చాలామంది గాల్‌బ్లాడర్‌లో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఒక్కోసారి ఈ సమస్య క్యాన్సర్‌గా అయ్యే ప్రమాదం ఉంది.
పిత్తాశయంలో రాళ్ల సమస్యను నివారించడానికి మందులు వాడటం, లేదా ఆపరేషన్ చేయించుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. గాల్‌బ్లాడర్‌ రాళ్లను తొలగించడానికి, ఈ సమస్యను నివారించడానికి లైఫ్‌స్టైల్‌లో కొన్ని మార్పులు చేసుకుని, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రముఖ పోషకాహార నిపుణురాలు నితికా తన్వర్ అంటున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

గాల్‌బ్లాడర్‌లో రాళ్లు

గాల్‌బ్లాడర్‌‌లో రాళ్లు ఎలా వస్తాయి..

ఆహారంలో కరగకుండా మిగిలిపోయిన కొవ్వులు ఉంటే… వాటిని గాల్‌బ్లాడర్‌ మళ్లీ స్వీకరించి, తనలో స్టోర్‌ చేసుకుంటుంది. కొన్నిసార్లు ఆ కొవ్వులు అక్కడే పేరుకుపోయే ప్రమాదం ఉంది. ఇవన్నీ ఒకేచోట పోగుబడి రాళ్లలా మారే ప్రమాదం ఉంది. ఈ రాళ్లు బైల్‌జ్యూస్‌ స్రావాలకు అడ్డుపడే ప్రమాదం ప్రమాదం ఉంది. ఇవి ఇసుక రేణువులంత సైజు నుంచి గోల్ఫ్‌ బాల్‌ అంత సైజు వరకూ ఉండొచ్చు.

ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..

రాళ్లు ఉన్నా కూడా 75% మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. బైల్‌జ్యూస్‌ స్రావాలకు రాళ్లు అడుపడటం వల్ల.. ఈ లక్షణాలు కొన్ని నిమిషాలు, గంటలు కనిపిస్తాయి.

  • ఎగువ కుడి పొత్తికడుపులో నొప్పి
  • రొమ్ము ఎముక క్రింద ఉదరం మధ్యలో నొప్పి
  • భుజం బ్లేడ్‌ల మధ్య వెన్నునొప్పి
  • కుడి భుజం నొప్పి
  • వాంతులు
  • వికారం

రాళ్లు ఎందుకు వస్తాయి.

మనం తీసుకునే ఆహారంలో కొవ్వులు, కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండటం దీనికి ప్రధాన కారణం. మన జీన్స్‌, అధికబరువు, పెయిన్‌కిల్లర్స్‌ ఎక్కువగా వాడటం, ప్రెగ్నెన్సీ రాకుండా మహిళలు వాడే పిల్స్‌ కూడా పిత్తాశయంలో రాళ్లకు కారణం అయ్యే అవకాశం ఉంది. డయాబెటిస్, జీర్ణ సమస్యలతో బాధపడేవాళ్లుకు గాల్‌బ్లాడర్‌ స్టోన్స్‌ ముప్పు ఎక్కువగా ఉంటుంది.

మీల్స్‌ స్కిప్‌ చేయవద్దు..

బీజీ లైఫ్‌స్టైల్‌ కారణంగా.. కొంతమంది కొన్ని పూటలు భోజనం తినడం మానేస్తారు. ఇలా మీల్స్‌ స్కిప్‌ చేస్తే.. పిత్తాశయంలో ద్రవం పేరుకుపోతుంది. ఇది మీ పిత్తాశయంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది కాలక్రమంలో.. రాళ్లుగా మారతాయి.

తృణధాన్యాలు తీసుకోండి..

తృణధాన్యాలలో ఫైబర్ మెండుగా ఉంటుంది. ఫైబర్‌ పైత్యరసంలో కొలెస్ట్రాల్‌ ద్రవ రూపంలో ఉండేలా చేస్తుంది. ఫలితంగా రాళ్లు ఏర్పడే ముప్పు తగ్గుతుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తుంది. తృణధాన్యాలు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పిత్తాశయ రాళ్లను నివారించవచ్చు. ఫైబర్‌ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మన శరీరం నుంచి పిత్తాన్ని తొలగిస్తుంది. తాజా పండ్లు, పండ్లు, కూరగాయల్లోనూ ఫైబర్‌ సమృద్ధిగా ఉంటుంది.

బరువు కంట్రోల్‌లో ఉంచుకోండి..

అధిక బరువు, ఊబకాయం కారణంగానూ పిత్తాశయ రాళ్లు ఏర్పడే ముప్పు మూడు రెట్లు పెరుగుతుందని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. అధిక కొవ్వు మీ పిత్తాశయాన్ని విస్తరిస్తుంది, దీని కారణంగా పిత్తాశయం సమర్థవంతంగా పనిచేయదు. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది, ఇది రాళ్లకు కారణమవుతుంది. కాబట్టి బరువు అదుపులో ఉంచుకోవటం మంచిది. అలాగని వేగంగా బరువు తగ్గించే ఆహార అలవాట్లతోనూ ప్రమాదమే. ఇవీ పిత్తాశయ రాళ్లకు దారితీయొచ్చు. క్రమంగా బరువు తగ్గే ప్రయత్నం చేయాలి.

వేయించిన ఆహారం తగ్గించండి..

పిత్తాశయంలో రాళ్లను నివారించడానికి వేయించిన ఆహారానికి దూరంగా ఉండటం మంచిది. వీటిలో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది, ఇది మీ రక్త కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. కొవ్వు పదార్ధాలను జీర్ణం చేయడానికి గాల్‌బ్లాడర్‌ ఎక్కువగా కష్టపడాలి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *