గుండెనొప్పి వచ్చే ముందు లక్షణాలు

[ad_1]

గుండెకి రక్త సరఫరా ఆగిపోయినప్పుడు వచ్చే సమస్యనే గుండె పోటు అంటారు. ఛాతీలో ఇబ్బందిగా ఉన్నప్పుడు గుండె సమస్య వస్తుందేమోనన్న అనుమానం కలుగుతుంది. అయితే, ఇదొక్కటే కాదు. మరికొన్ని లక్షణాలు కూడా ఉంటాయి. వాటి గురించి ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

​గుండె ఆరోగ్యంగా ఉండాలంటే..

శరీరంలో గుండె చాలా ముఖ్య అవయవం. దీనికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రాణాలకే ప్రమాదం. అందుకే ముందు నుంచి గుండె విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్లే. ఒత్తిడి, నిద్రలేమి, సరైన జీవనశైలి కారణంగా గుండెపోటు, గుండె సమస్యలు వస్తున్నాయి. కాబట్టి, మంచి లైఫ్‌స్టైల్‌ని పాటించడం చాలా ముఖ్యమని గుర్తించాలి. ఎప్పుడు టెన్షన్ ఫ్రీగా ఉండాలి. వర్కౌట్ చేయాలి. ప్రతి ఆరోగ్య సమస్యకి మన లైఫ్‌స్టైలే కారం. అందుకే కచ్చితంగా మంచి లైఫ్‌స్టైల్‌ని పాటించాలి.

​గుండెనొప్పి ఎప్పుడొస్తుంది..

గుండె పనిచేసేందుకు ఆక్సిజన్‌తో కూడిన రక్తం అవసరం అవుతుంది. అయితే, గుండెకి రక్తాన్ని తీసుకెళ్ళే ధమనుల్లో కొవ్వు వంటి పదార్థాలు పేరుకుపోవడం వల్ల ప్రసరణ తగ్గడం, పూర్తిగా ఆగిపోవడం జరుగుతుంది. దీంతో గుండె నొప్పి వస్తుంది.

Also Read : Liver Problems : లివర్ ప్రాబ్లమ్స్‌‌‌లో ఎన్ని దశలు ఉంటాయంటే..

​పురుషులకే లక్షణాలు ఎక్కువ..

గుండె సమస్యలు వచ్చే ముందు లక్షణాలు కనిపిస్తాయి. అయితే, ఇవి మగవారు, ఆడవారికి ఒకేలా ఉండవని చెబుతున్నారు నిపుణులు. మగవారికి ఈ లక్షణాలన్నీ ఎక్కువగా ఉంటాయని, ఆడవారికి అన్ని లక్షణాలు కనిపించవని నిపుణులు చెబుతున్నారు.

ఆడవారికి కనిపించే లక్షణాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో పాటు మెడ, దవడలో నొప్పి వంటి అదనపు లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. చల్లని చెమటలు కూడా ఉంటాయి.

Also Read : Nail art Trends : నెయిల్ ఆర్ట్ వేసుకోవాలనుకుంటున్నారా.. ఇవే లేటెస్ట్ ట్రెండ్స్..

​చర్మ రంగులో తేడా..

లక్షణాల గురించి చాలా మంది చెబుతూనే ఉన్నారు. ఛాతీలో నొప్పి ఇబ్బందిగా అనిపించడం ఇలాంటివన్నీ గుండె నొప్పి వచ్చే ముందు లక్షణాలే. దీంతో పాటు, గుండె నొప్పి వచ్చే ముందు శరీర రంగు మారుతుందని చెబుతున్నారు నిపుణులు. మీరు ఉన్న రంగు కంటే కాస్తా తేలిగ్గా మీ రంగు మారుతుందని చెబుతున్నారు. అంటే పాలిపోయినట్లుగా మారడం. దీంతో పాటు వికారం ఉంటుందని. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు. యాంగ్జైటీగా అనిపించి కళ్ళు తిరిగినట్లుగా ఉంటుందని చెబుతున్నారు.

Also Read : Workout when fasting : తినకుండా వర్కౌట్ చేస్తే బరువు తగ్గుతారా..

సైలెంట్ హార్ట్ ప్రాబ్లమ్స్..

అయితే, కొన్ని సార్లు ఎలాంటి లక్షణాలు లేకుండానే గుండె సమస్యలు వస్తాయి. వీటినే సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటారు. ఇవి వచ్చినప్పుడు గుండెకి రక్త ప్రవాహం ఉండదు. లక్షణాలు కూడా కనిపించవు. దీంతో ప్రాణాలకే తీవ్ర నష్టం జరుగుతుంది. అయితే, ముందుగా చెప్పిన లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా ఏ మాత్రం నిర్లక్షం చేయొద్దు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మీరు ఏకాంతంగా ఉండొద్దు. ఎవరి సాయమైనా తీసుకోవడం చాలా మంచిది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *