Tuesday, May 24, 2022

గుండె సమస్యతో బాధపడుతున్న ఏడాది చిన్నారి తనుశ్రీ… విరాళాలతో ప్రాణాలు కాపాడుదాం..!


ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న చిన్నారి పేరు తనుశ్రీ. తనుశ్రీ తన తల్లిదండ్రులైన మరిముత్తన్ మరియు రాజేశ్వరిలతో కలిసి తమిళనాడులోని ధర్మపురి జిల్లా కోలగంపట్టిలో నివాసం ఉంటోంది. తనుశ్రీ ఆరునెలల వయసున్న సమయంలో తాను శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడింది. అంతేకాదు ఏదైనా మింగాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉండేది. పలుమార్లు అస్వస్థతకు గురయ్యేది. ఇది గమనించిన తల్లి చాలా బాధపడింది. చిన్నారి తనుశ్రీ తరుచూ దగ్గుతుండటంతో దగ్గరలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.

వైద్యులకు చూపించారు. అయితే ఆ చిన్నారి అప్పటి వరకు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు ఆ తల్లిదండ్రులకు తెలియలేదు. విషయం తెలిసి చాలా బాధపడ్డారు. ఇక హాస్పిటల్‌కు పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ తనుశ్రీ ఆరోగ్యంలో మాత్రం వృద్ధి కనిపించలేదు. ఇక ఇతరుల సలహాతో బెంగళూరులోని హాస్పిటల్‌కు కూడా తీసుకెళ్లి తనుశ్రీని చూపించారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తనుశ్రీకి రెండేళ్ల వయసు వచ్చే సరికి సర్జరీ పూర్తి చేయాలని వైద్యులు చెప్పారు.

కరోనా సమయంలో లాక్‌డౌన్ విధించడంతో వీరు బెంగళూరుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అంతేకాదు నానాటికీ చిన్నారి ఆరోగ్యం క్షీణిస్తోంది. ఇక తనుశ్రీకి సర్జరీ చేయించాలంటే భారీగా ఖర్చు అవుతోంది. తనుశ్రీ తండ్రి మరిముత్తన్ ఒక రోజువారీ కూలీ. ఇక కొద్ది రోజుల క్రితం వారి జిల్లాలోనే MIOT డాక్టర్లు క్యాంప్ నిర్వహించగా తనుశ్రీని వారికి చూపించారు. పరీక్షలు చేసిన డాక్టర్లు తనుశ్రీ టెట్రాలజీ ఆఫ్ ఫాలాట్, లార్జ్ సబ్‌ఆరోటిక్ వీఎస్‌డీ, సివియర్ ఆర్‌వీఓటీఓలో బాధపడుతుందని నిర్థారించారు.

Help to save 1 year old Thanushree from serious Heart problem

ఇక తనుశ్రీ వైద్యానికి అయ్యే ఖర్చు రూ.2,80,000గా అంచనా వేశారు. ఇందులోనే ఐసీయూ, హాస్పిటల్‌ ఛార్జీలు, ఆపరేషన్ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఛార్జీలు వస్తాయి. అయితే ఇంత పెద్ద మొత్తం వారి శక్తికి మించిన భారమే అవుతుంది. వారికి సొంతంగా ఆస్తులంటూ ఏమిలేవు. ఇక అప్పు ఇచ్చేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో తమ కూతురు బతికించుకునేందుకు వారు దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కష్ట సమయంలో తోచినంత విరాళంతో వారి కూతురును బతికించాలని కోరుతున్నారు.

Help to save 1 year old Thanushree from serious Heart problem

ఇక చిన్నారి తనుశ్రీని బతికించేందుకు మీరు ఇవ్వాలనుకుంటున్న విరాళాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..ఆ కుటుంబంలో తిరిగి సంతోషం నింపండి.

Help to save 1 year old Thanushree from serious Heart problemSource link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe