Saturday, May 8, 2021

గుజరాత్‌‌లో ఆమ్ ఆద్మీ,ఎంఐఎం పాగా…మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో సత్తా చాటిన పార్టీలు..ఎవరికెన్ని సీట్లంటే.

అహ్మదాబాద్‌లో సత్తా చాటిన ఎంఐఎం

ఈ నెల 21న గుజరాత్‌లోని అహ్మదాబాద్,సూరత్,వడోదరా,రాజ్‌కోట్,జామానగర్,భావనగర్ మున్సిపల్ కార్పోరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఈ ఆరు మున్సిపల్ కార్పోరేషన్లలో కాంగ్రెస్‌కు గతం కన్నా సీట్లు తగ్గాయి. సూరత్‌లో కాంగ్రెస్ స్థానాన్ని ఏకంగా ఆమ్ ఆద్మీ ఆక్రమించేసింది. మొత్తం ఆరు మున్సిపల్ కార్పోరేషన్లలో కలిపి 575 వార్డులకు గాను బీజేపీ 463 వార్డుల్లో గెలుపొందగా… కాంగ్రెస్ 44,ఆమ్ ఆద్మీ 27 వార్డుల్లో గెలుపొందింది. బహుజన్ సమాజ్ పార్టీ జామానగర్‌లో 3 వార్డులు గెలుచుకుంది. అహ్మదాబాద్ మున్సిపోల్స్‌లో ఎంఐఎం సత్తా చాటడం విశేషం. 21 వార్డుల్లో పోటీ చేసిన ఎంఐఎం 7 వార్డుల్లో విజయం సాధించింది. గతంలో ఈ వార్డులన్నీ కాంగ్రెస్‌వి కావడమే గమనార్హం.

ఆమ్ ఆద్మీ పార్టీకి బూస్టింగ్...

ఆమ్ ఆద్మీ పార్టీకి బూస్టింగ్…

గుజరాత్‌లో ఆమ్ ఆద్మీకి లభించిన సీట్లపై ఆ పార్టీ అధినేత,ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఫిబ్రవరి 26న ఆయన సూరత్‌లో పర్యటించనున్నారు. సూరత్‌లో ఆమ్ ఆద్మీకి ఈ విజయం లభించడం వెనుక ఆ పార్టీ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ కీలక పాత్ర పోషించారు. ఆమ్ ఆద్మీ విజయంతో గుజరాత్ ప్రజలు కూడా ఢిల్లీ తరహా పాలన కోరుకుంటున్నారని స్పష్టమవుతోందన్నారు. ఇదే స్పూర్తితో 2022 ఎన్నికలకు సిద్దమవుతామని చెప్పారు.

బీజేపీ అభివృద్దికి పట్టం : అమిత్ షా

బీజేపీ అభివృద్దికి పట్టం : అమిత్ షా

మున్సిపల్ కార్పోరేషన్ ఫలితాలపై కేంద్రమంత్రి అమిత్ షా ట్విట్టర్‌లో స్పందించారు. గుజరాత్ ప్రజలు మరోసారి బీజేపీ చేస్తున్న అభివృద్ది,ప్రగతి పట్ల విశ్వాసం ఉంచారని పేర్కొన్నారు. సీఎం విజయ్ రూపానీ,డిప్యూటీ సీఎం నితిన్ పటేల్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పేద ప్రజలు,వెనుకబడిన వర్గాల కోసం పనిచేస్తున్నాయని అన్నారు. బీజేపీ అవలంభిస్తున్న విధానాలకు,నిజాయితీకి ప్రజలు ఈ విజయం కట్టబెట్టారని అభిప్రాయపడ్డారు.


Source link

MORE Articles

ఎన్ఎస్ యూఐ మెరుపు ధర్నా.!మంత్రి మల్లారెడ్డి వైద్య కళాశాల వద్ద రచ్చరచ్చ.!

చెరువు భూములు కబ్జా చేసి హాస్పిటల్ నిర్మాణం.. మల్లారెడ్డి ఆసుపత్రిని వెంటనే ఉచిత కరోనా వైద్య హాస్పిటల్ గా మార్చాలని ఎన్ఎస్ యూఐ నాయకులు డిమాండ్...

తెలంగాణలో కొత్తగా 5186 కరోనా కేసులు.. మరో 38 మంది మృతి…

తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 5186 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 38 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ...

वजन कम करने से लेकर आंखों तक के लिए फायदेमंद है धनिया का पानी, इस तरह करें सेवन, मिलेंगे 12 गजब के फायदे

नई दिल्ली: आज हम आपके लिए लेकर आए हैं धनिया के पानी से होने वाले फायदे..धनिया हर घर के किचन में आराम से...

అడ్వకేట్ వామన్‌రావు దంపతుల హత్య కేసులో మాజీ మంత్రి పాత్ర… తెర పైకి సంచలన ఆరోపణలు…

కిషన్ రావు సంచలన ఆరోపణలు... నిజానికి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఆస్పత్రిలో చేరిన తర్వాత వామన్‌రావుకు వైద్యం అందలేదని కిషన్ రావు ఆరోపించారు. ఆయనకు మందులు...

నారా లోకేష్ పై క్రిమినల్ కేసు నమోదు.. లోకేష్ ఆ ట్వీట్ పై అనంతలో వైఎస్సార్సీపీ నేత ఫిర్యాదు

అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గం టిడిపి కార్య‌క‌ర్త మారుతి‌, సోష‌ల్‌మీడియా వేదిక‌గా ఎమ్మెల్యే అవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌శ్నిస్తున్నార‌ని గూండాల‌తో దాడి చేయించారు.(1/3) pic.twitter.com/T8aedmlfm6 — Lokesh...

ఆ గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా లేదు, కుగ్రామమే అయినా కరోనా కట్టడిలో సక్సెస్..కారణం ఇదే !!

జగిత్యాల జిల్లాలోని రాగోజిపేట్ లో ఒక్క కరోనా కేసు కూడా లేదు కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న సమయంలో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా కరోనా...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe