గురుకులాల సెక్రెటరీ అలుగు వర్షిణినివెంటనే సస్పెండ్‌ చేయాలి

Date:

Share post:


– Advertisement –

– కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌ బాబు డిమాండ్‌
నవతెలంగాణ-కంఠేశ్వర్‌

దళిత విద్యార్థినీ విద్యార్థులు.. బాత్‌రూమ్‌లు కడగాలని, తరగతి గదులు, హాస్టల్‌ రూములు శుభ్రం చేసుకోవాలంటూ దళిత విద్యార్థులను కించపరుస్తూ మాట్లాడిన గురుకులాల సెక్రెటరీ అలుగు వర్షిణిని తక్షణమే సస్పెండ్‌ చేయాలని కెేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు డిమాండ్‌ చేశారు. ఆదివారం నిజామాబాద్‌ సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణి దళితుల్ని అవమానపరిచిన తీరు చాలా అభ్యంతరకరమన్నారు. దళిత పిల్లలు వారు ఏమైనా రాజ సింహాసనం నుంచి వచ్చారా.. వారేమైనా రాజులా అన్నట్టు వెటకారంగా మాట్లాడటం విద్యార్ధులను అవమానించడమేనని అన్నారు. అలుగు వర్షిణి తమ ఆఫీసు బాత్‌రూమ్‌లను వారే కడుక్కుంటున్నారా, ఆఫీసు రూములను వారే ఊడ్చుకుంటున్నారా.. అని ప్రశ్నించారు. ఒక ఐఏఎస్‌ అధికారి విద్యార్థిలోకాన్ని అవమానించడం శోచనీయమన్నారు. ఈ అవమానాలతో వారి చదువులు ఎలా సాగాలని ప్రశ్నించారు. ఈ విషయంపై తక్షణమే ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలన్నారు. దేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ రాజ్యాంగం వల్ల ఈరోజు అట్టడుగు బడుగు, బలహీన వర్గాలు చదువులు, ఆటలు, ఉద్యోగాల్లో రాణిస్తుంటే అది చూసి ఓర్వలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. మంత్రివర్గంలో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, నేతలు వివేక్‌ వెంకటస్వామి లాంటి వారు చొరవ తీసుకుని ఆమెను సస్పెండ్‌ చేయించి గురుకులాలను కాపాడాలని అన్నారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి కొండ గంగాధర్‌, జిల్లా ఉపాధ్యక్షులు సలవాల నర్సయ్య, జిల్లా నాయకులు జంగం గంగాధర్‌, సంపత్‌, రాజు, విశాల్‌ తదితరులు పాల్గొన్నారు.

– Advertisement –



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

సల్మాన్ ఖాన్‌కు మూడు జబ్బులు

బాలీవుడ్ సూపర్ స్టార్లలో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయింది ఒక్క సల్మాన్ ఖాన్ మాత్రమే. వేర్వేరు సందర్భాల్లో ఆయన ప్రేమాయణాల గురించి పెద్ద...

తమన్నకు హ్యాండ్ ఇచ్చి మరో స్టార్ బ్యూటీని లైన్లో పెట్టిన వర్మ..!

బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు మిల్కీ బ్యూటీ తమన్న తో...

భూమ్మీద నూక‌లున్నాయి.. – Navatelangana

- Advertisement - న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భూమ్మీద నూక‌లుంటే..ఎంత ప్ర‌మాదం జ‌రిగిన ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డొచ్చు అనే ఉదంతాలు చాలానే చూసి ఉంటాం. ఇటీవ‌ల జూన్ 12న...