భారీగా పడిపోతున్న బంగారం ధరలు

మొత్తానికి ఈ సంవత్సరం మొదటి నుంచి ఇప్పటివరకు కొండెక్కి కూర్చున్న బంగారం ధరలు కాస్త క్షీణించి సామాన్యులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇటీవల కాలంలో గరిష్టాలకు చేరుకున్న గోల్డ్ రేట్లు, రికార్డు బద్దలు కొట్టిన గోల్డ్ రేట్లు మళ్లీ ఒకసారిగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో దేశీయంగాను బంగారం ధరలు పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ఐదు రోజులుగా బంగారం ధర ఎక్కువ మొత్తంలో పడిపోతున్న పరిస్థితి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త గా మారింది.

హైదరాబాద్.. ఢిల్లీలలో బాగా తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్.. ఢిల్లీలలో బాగా తగ్గిన బంగారం ధరలు

ఇక తాజాగా బంగారం ధరల విషయానికి వస్తే ప్రస్తుతం అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కు 1842.60 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది . ఇక స్పాట్ సిల్వర్ రేట్ ఔన్స్ కు 21.76 డాలర్ల వద్ద కొనసాగుతుంది. ఇక దేశీయంగా బంగారం ధరల విషయానికి వస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 51,800 రూపాయలు వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్లో 56,510 వద్ద ట్రేడ్ అవుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు బంగారం ధర 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 51,950 వద్ద ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దేశ రాజధాని ఢిల్లీలో 56,660 రూపాయల వద్ద కొనసాగుతుంది.

ముంబైతో పాటు విశాఖ, విజయవాడలలో బంగారం ధరలిలా

ముంబైతో పాటు విశాఖ, విజయవాడలలో బంగారం ధరలిలా

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,800 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,510 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక విశాఖపట్నంలో ఈరోజు బంగారం ధర 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 51,800 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 56,510 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. ఇక విజయవాడలోనూ 56,510 వద్ద 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు కొనసాగుతుంటే, 51,800 వద్ద 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కొనసాగుతుంది.

వెండి కూడా తగ్గుముఖం

వెండి కూడా తగ్గుముఖం

ఇక బెంగళూరులో బంగారం ధరల విషయానికి వస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 51,850 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర బెంగళూరులో 56,560 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా తగ్గుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. హైదరాబాద్లో ప్రస్తుతం వెండి ధర కిలో కూడా 71,200గా కొనసాగుతుంది. ఇక ఢిల్లీలో వెండి ధర గణనీయంగా తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు కేజీ వెండి ధర 68,600గా కొనసాగుతుంది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *