బంగారం ధరల దూకుడుతో ఆందోళన
ఇక ఈ సంవత్సరం ప్రారంభం నుండి విపరీతంగా పెరిగిన బంగారం ధరలు, మధ్యలో అప్పుడప్పుడు కాస్త తగ్గినట్టుగా అనిపించినా, ఆ సంతోషం ఎంతో కాలం నిలవడం లేదు. మళ్లీ బంగారం ధరలు పెరగడం పసిడి ప్రియులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది.
అంతకు ముందు రెండు వారాలపాటు తగ్గినట్టు అనిపించిన బంగారం ధరలు మళ్లీ వారం రోజులుగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న, మొన్న స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు నేడు కాస్త పెరిగినట్టు సమాచారం. భారతదేశంలోనూ ఆయా ప్రాంతాలలో వేసే పన్నులను బట్టి బంగారం ధరలలో కొద్దిపాటి మార్పు కనిపిస్తుంది.

హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో ధరలిలా
ఇదిలా ఉంటే తాజాగా ప్రస్తుతం ఈ సమయానికి బంగారం ధరల విషయానికి వస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 51,850 కాగా, 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం 56,550 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 51,850 కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 56,550 రూపాయల గా కొనసాగుతుంది.
ఇక విశాఖపట్నంలోనూ 10 గ్రాముల ఆర్నమెంట్ గోల్డ్ 51,850 రూపాయలుగా, 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం 56,550 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు ప్రధాన నగరాలలో ఒకే ధర కొనసాగుతుంది.

ఢిల్లీ, బెంగళూరు, ముంబై లలో బంగారం ధరలు ఇలా
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం నేడు ఢిల్లీలో 56,700 కాగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 51,950 రూపాయలుగా దేశ రాజధాని ఢిల్లీలో ట్రేడ్ అవుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 51,850 కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 56,550 రూపాయలుగా ప్రస్తుతం విక్రయించబడుతుంది. ఇక బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 51,900 రూపాయలు కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం బెంగళూరులో 56,600 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.

స్థిరంగా వెండి ధరలు.. నేడు ధరలిలా
ఇక బంగారంతో పాటు వెండి ధరల విషయానికి వస్తే ప్రస్తుతం వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో వెండి ధర నేడు కిలోకి 70 వేలుగా కొనసాగుతుంది. ఇక విజయవాడ, విశాఖ పట్నం లలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక ఢిల్లీలో కిలో వెండి ధర 69,900 రూపాయలుగా కొనసాగుతుంది. ముంబైలోనూ, బెంగళూరులోనూ, చెన్నై లోనూ కేజీ వెండి ధర 70 వేలుగా నమోదు అవుతుంది. ఇటీవల బంగారం ధరలు పెరుగుతున్నా, వెండి ధర కాస్త తగ్గటం, కాస్త స్థిరంగా ఉండటం కనిపిస్తుంది.