Tuesday, May 17, 2022

గ్రామ పంచాయతీలకు ఆదేశాలు!?

పంచాయతీ ఎన్నికలు ముగిసిన అనంతరం ఏపీ ప్రభుత్వం కొత్త నియమనిబంధనలను విడుదల చేసింది. అవి ఏంటంటే…

1) నీటి/ ఇంటి పన్నులు వచ్చేటివి , వచ్చినవి ప్రతి నెల నోటీసు బోర్డు పై చూపాలి.

2) ప్రతి నెల వీధి లైట్స్ సరి చేసి, లైట్స్ వేయాలి,ఎన్ని వేసారో నోటీసు బోర్డు పై చూపాలి.

3) ప్రతి నెల కొత్త పింఛన్లు ఎవరికీ రావాలో వాళ్ళకు ఇప్పించాలి.

4) ప్రతి నెల లో ఒకసారి మరుగుదొడ్లను వాడడం మరియు చెత్తను చెత్త కుండీలో వేయడం లాంటివి
ప్రోగ్రామ్స్ ను చేపట్టాలి.

5) ఏదైన పండుగలు వస్తే వాటికీ ఐన ఖర్చులు నోటీసు బోర్డు లో చూపించాలి.

6) గవర్నమెంట్ ఫండ్స్ వస్తే , ఎంత వచ్చాయో,ఎంత ఖర్చు చేసారో నోటీసు బొర్ఢ్ లో చూపాలి.

7) ప్రతి నెల గ్రామసభ నిర్వచించాలి.గ్రామసభలో 100మందికి పైగా ఉన్న ఫొటో సంభదిత అధికారికి పంపాలి. ప్రజలకు గ్రామంలో ఏమి అవసరమో తెలుసుకొని వాటిని నిర్వచించాలి.

8) ప్రతి ఇంటికి మరుగు దొడ్డి లేని యెడల కొత్త మరుగు దొడ్డి ని కట్టించాలి. ఇంతక ముందు కట్టిన వారికి డబ్బులు రాకపోతే వాటికి డబ్బులు ఇప్పించాలి..

9)గ్రామంలో మరియు ప్రతి ఇంటి ఆవరణలో రెండు చెట్లను నాటించాలి.

10) రేషన్ షాప్ లో బియ్యం ఎన్ని వస్తున్నాయి ,ఎన్ని పోతున్నాయి తెలుసుకోవాలి. బయటి సరుకులు రేషన్ షాప్ లో ఆమ్మరాదు.

11)ప్రతి గ్రామంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నుండి గ్రామపంచాయతీ లకు నిధులు వస్తాయి . ప్రతి నెల గ్రామ పంచాయతీ ఈ నిధులు దేనికి ఉపయోగిస్తున్నారో గ్రామసభలో ప్రజలు అడగవచ్చు.

ఈ పదకొండు పాయింట్లలో ఏదైనా లోపం జరిగితే, ఆ నష్టం చేసిన వారిని ఆ పదవి నుండి తొలిగించే అధికారం ప్రజలకు ఉన్నది.

ప్రజలు తమకు ఏదైనా అన్యాయం జరిగినట్లయితే పైఅధికారికి తెలపచ్చు.

11)వ పాయింట్ చాలా ముఖ్యమైనది ప్రభుత్వం నుండి వచ్చిన నగదు ఎంత?
పంచాయితీ అభివృద్ధి కార్యక్రమాలకు పెట్టిన ఖర్చు ఎంత?

ఈ వివరాలన్నీ ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలి.

ఇవన్నీ పంచాయతీలు పాటించాలని ప్రభుత్వం ఆదేశించినట్లుగా అభిజ్ఞ్య వర్గాల కథనం.

కానీ ఎన్నికల్లో లక్షలు ఖర్చు చేసి అధికారంలోకి వచ్చిన ప్రజాప్రతినిధులు పాటిస్తారా ,లేదా అన్నదే సందేహం.

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe