గ్లోబల్‌ స్లో డౌన్‌! ఎర్రబారిన సూచీలు – ఐటీ, మెటల్స్‌, ఫైనాన్స్‌ షేర్లు కుదేలు!

[ad_1]

Stock Market Closing 06 January 2023: 

భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. ఆర్థిక మందగమనం భయాలు వెంటాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వచ్చాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 132 పాయింట్ల నష్టంతో 17,859  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 452 పాయింట్ల నష్టంతో 59,900 వద్ద క్లోజయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 16 పైసలు బలహీనపడి 82.72 వద్ద స్థిరపడింది.

BSE Sensex

క్రితం సెషన్లో 60,353 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,388 వద్ద మొదలైంది. 59,669 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,537 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 452 పాయింట్ల నష్టంతో 59,900 వద్ద ముగిసింది.

live reels News Reels

NSE Nifty

గురువారం 17,992 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,008 వద్ద ఓపెనైంది. 17,795 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,047 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 132 పాయింట్ల నష్టంతో 17,859 వద్ద క్లోజైంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 42,649 వద్ద మొదలైంది. 41,877 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,685 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 419 పాయింట్లు తగ్గి 42,188 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 11 కంపెనీలు లాభాల్లో 39 నష్టాల్లో ముగిశాయి. బ్రిటానియా, రిలయన్స్‌, ఎం అండ్‌ ఎం, బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ లాభపడ్డాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టీసీఎస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఎఫ్‌ఎంసీజీ సూచీలు స్వల్పంగా ఎగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఐటీ, మీడియా, మెటల్‌, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్‌ సూచీలు ఎరుపెక్కాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *