Saturday, May 14, 2022

ఘట్‌కేసర్ గ్యాంగ్ రేప్: షాకింగ్ ట్విస్ట్ -ప్రియుడితో గంజాయి దమ్ము -తల్లిపై విసుగు -పోలీసులకే దిమ్మతిరిగేలా

ఆటోడ్రైవర్ల అరాచకం వట్టిదే..

ఘట్‌కేసర్‌ పరిధిలోని నాగారం చౌరస్తాలో ఫార్మసీ విద్యార్థిని అత్యాచార ఘటనలో నాటకీయ పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆరుగురు నిందితుల్ని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని భువనగిరి స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌(ఎస్వోటీ) కార్యాలయంలో విచారించారు. అయితే, పొంతనలేని విషయాలు చెబుతుండటంతో, పోలీసులు మరోసారి బాధిత యువతిని ప్రశ్నించడంతో కొత్త కోణం వెలుగు చూసింది. తనను ఆటోడ్రైవర్లు అపహరించి, అత్యాచారం చేశారంటూ యువతి పోలీసులను తప్పుదోవ పట్టించినట్లు వెల్లడైంది. నిజానికి..

ప్రియుడితో కలిసి గంజాయి పార్టీ..

ప్రియుడితో కలిసి గంజాయి పార్టీ..

ఘట్‌కేసర్‌ పరిధిలో బీఫార్మసీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధించి పోలీసులు వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం.. బాధిత యువతి ఆటో ఎక్కి రాంపల్లి వరకు వెళ్లి అక్కడ ద్విచక్ర వాహనంపై తన ప్రియుడితో కలిసి వెళ్లింది. ఆ తర్వాత అతని(ప్రియుడి) ఇద్దరు సోదరులతో కలిసి గంజాయి సేవించారు. ఈ క్రమంలో ఆమె అనుమతితోనే వారంతా శారీరకంగా ఏకాంతంగా గడిపినట్లు తెలుస్తోంది. గంజాయి పార్టీ, ఇతర కలాపాలు పూర్తయిన తర్వాత అమ్మాయి ఇంటికి వెళ్లిపోవాలని అనుకుంది కానీ..

తల్లి ఫోన్ చేసి విసిగిస్తోందని..

తల్లి ఫోన్ చేసి విసిగిస్తోందని..

బాదిత విద్యార్థిని తన ప్రియుడు, అతని సోదరులతో కలిసి గంజాయి సేవిస్తూ, మరో రకమైన కలాపాలు కూడా పాల్పడుతోన్న క్రమంలో ఆమె ఎక్కడుందోననే ఆందోళనతో ఇంట్లో తల్లి తల్లి డిల్లిపోయింది. కూతురు ఎక్కడుందో కనుక్కోవడంతోపాటు, త్వరగా ఇంటికొచ్చేయమని చెప్పేందుకు ఆ తల్లి పదే పదే ఫోన్లు చేసింది. తల్లి తరచూ ఫోన్ చేయడాన్ని విసుగుగా భావించిన ఆ యువతి.. తనను ఆటో డ్రైవర్లు గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారని అబద్దం చెప్పింది. దీంతో భయపడిన తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆ వెంటనే..

 పోలీస్ సైరన్ మోగడంతో చెల్లాచెదురు..

పోలీస్ సైరన్ మోగడంతో చెల్లాచెదురు..

తన కూతుర్ని ఆటోడ్రైవర్లు అపహరించారంటూ బాధిత యువతి తల్లి ఫోన్ చేయడంతో అప్రమత్తమైన పోలీసులు.. అనుమానిత ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆ ప్రాంతంలో పోలీస్ వాహనం సైరన్లు వినిపించడంతో.. భయపడిన యువకులు ఆమెను రహదారి పక్కన వదిలేసి వెళ్లిపోయారు. దీంతో గస్తీ కాస్తున్న పోలీసులకు యువతి తారసపడింది. గంజాయి మత్తులో ఉన్న ఆమెను పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం యువతిని ప్రశ్నించగా.. ఆటోడ్రైవర్లు అత్యాచారం చేశారని తెలిపింది. దీంతో..

నిందితుల సంగతేంటి? ప్రియడిపై చర్యలు?

నిందితుల సంగతేంటి? ప్రియడిపై చర్యలు?

బాధితురాలు తొలుత చెప్పిన వివరాల ప్రకారం దర్యాప్తు చేసిన పోలీసులు.. ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వారి ఫొటోలు, పేర్లు కూడా వివిధ ఛానెళ్లలో రివీల్ అయ్యాయి. కానీ ఇప్పుడు బాధితురాలే అసలు నిజం చెప్పడంతో తదుపరి ఎలా ముందుకు వెళ్ళాలనేదానిపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. కొందరు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన పోలీసులు.. సీసీ కెమెరాలను పరిశీలించగా యువతి ద్విచక్రవాహనంపై వెళ్తున్నట్లు కనిపించింది. దీంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. స్నేహితులతో కలిసి యానంపేట పరిసరాల్లోకి వెళ్లానని యువతి ఒప్పుకోవడం కేసులో ఊహించని ట్విస్ట్. అయితే, పోలీసుల అదుపులో ఉన్నవాళ్లు, బాధిత యువతి ప్రియుడి గ్యాంగుగా భావిస్తోన్న వ్యక్తులు ఇద్దరూ ఒకటేనా? లేక వేర్వేరా? అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.


Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe