Wednesday, May 12, 2021

ఘట్‌కేసర్ ఘటన : ఎన్నెన్నో ట్విస్టులు.. ఇంకా వీడని చిక్కుముడి.. సీన్‌రీకన్‌స్ట్రక్షన్‌లో ఏం తేలిందంటే..

సీన్‌ రీకన్‌స్ట్రక్షన్ చేసిన పోలీసులు…

యువతి చెప్పిన వివరాల ప్రకారం నలుగురు ఆటో డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారితో సీన్‌-రీకన్‌స్ట్రక్షన్ చేశారు. అయితే యువతి చెప్తున్న వివరాలకు క్షేత్ర స్థాయి వాస్తవాలకు పొంతన కుదరట్లేదని గుర్తించారు. దీంతో యువతి పేర్కొన్న ప్రాంతాల్లో మరిన్ని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఆశ్చర్యంగా.. ఘటన జరిగినరోజు సాయంత్రం 6గంటల నుంచి 7.30గంటల వరకూ ఆ యువతి ఘట్‌కేసర్,యంనంపేట,అన్నోజిగూడా తదితర ప్రాంతాల్లో ఒంటరిగానే సంచరించినట్లు వాటిల్లో స్పష్టంగా రికార్డయింది.

ఆటోడ్రైవర్లకు సంబంధం లేదు...

ఆటోడ్రైవర్లకు సంబంధం లేదు…

అనుమానితులుగా భావిస్తున్న ఆటోడ్రైవర్ల సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆ ప్రాంతాల్లో ఎక్కడా లేవని గుర్తించారు. దీంతో బాధిత యువతిని పోలీసులు మరోసారి ప్రశ్నించారు. దీంతో ఆ యువతి.. ‘చీకటి పడినా ఇంటికి రావట్లేదని తల్లి నుంచి పదేపదే ఫోన్ కాల్స్ వస్తుండటంతో ఆటోడ్రైవర్ ఎక్కడికో తీసుకెళ్లాడని..’ చెప్పినట్లు పోలీసులతో వెల్లడించింది. దీంతో ఈ కేసులో ఆటోడ్రైవర్లకు సంబంధం లేదని తేలిపోయింది. ఒకరకంగా పోలీసులను యువతి తప్పుదోవ పట్టించినట్లయింది.

అత్యాచారం జరిగిందా?

అత్యాచారం జరిగిందా?

ఆటోడ్రైవర్లకు సంబంధం లేదని తేలడంతో.. మరి ఈ కేసులో అసలు నిందితులెవరు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అత్యాచారం జరిగినట్లు పోలీసులు ధ్రువీకరించినట్లు తెలుస్తుండగా… ఇప్పటివరకూ దానికి సంబంధించిన ఆధారాలైతే లభ్యం కాలేదు. దీంతో యువతిపై అసలు అత్యాచారం జరిగిందా లేదా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. మరోవైపు యువతి మానసిక స్థితిపై కూడా పోలీసులకు అనుమానం కలుగుతోంది. ఈ విషయంపై గతంలో యువతితో సన్నిహితంగా మెలిగిన ఓ యువకుడిని ఆరా తీశారు.

మానసిక స్థితిపై అనుమానాలు...

మానసిక స్థితిపై అనుమానాలు…

ఆ యువతితో సన్నిహితంగా మెలిగిన రోజుల్లో ఒకరోజు ఆమె తనకు ఫోన్ చేసి… ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పిందని ఆ యువకుడు పోలీసులకు వెల్లడించాడు. కానీ అందులో ఎలాంటి నిజం లేదని తేలిందన్నాడు. దీంతో పోలీసులకు ఆమె మానసిక స్థితిపై అనుమానాలు మరింత బలపడ్డాయి. సాయంత్రం సమయంలో ఆ యువతి ఆయా ప్రాంతాల్లో ఒంటరిగా ఎందుకు సంచరించింది… అసలు యువతిపై అత్యాచారం జరిగిందా లేదా అన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది.


Source link

MORE Articles

కరోనా వల్ల అనాధలైన పిల్లల కోసం జగన్ సర్కార్ కీలక నిర్ణయం

కరోనా మహమ్మారి ఎంతో మంది చిన్నారులను అనాధలను చేసేస్తోంది. కుటుంబాలకు కుటుంబాలే కరోనా కారణంగా కల్లోల పరిస్థితులకు చేరుకుంటున్నాయి. కరోనా బారిన పడి తల్లిదండ్రులు మరణించిన చిన్నారులు అనాధలుగా మారి దీనంగా రోదిస్తున్నారు.ఇలాంటి...

కొత్త 2021 మోడల్ ఎక్స్‌ఎస్‌ఆర్125 బైక్‌ ఆవిష్కరించిన యమహా

ఈ కొత్త యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 125 బైక్‌లో చాలా హైటెక్ ఫీచర్లు ఉన్నాయి. యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 125 బైక్‌లో రౌండ్ హెడ్‌ల్యాంప్, గుండ్రని డిజైన్ ఫ్యూయల్ ట్యాంక్,...

iPhone 13 Models Could Be Slightly Thicker in Size Over iPhone 12 Series

iPhone 13 models will have a slightly thicker design over the iPhone 12 series and more prominent camera bumps, according to a report....

ఆగని దందా… కరోనా బాధితుల పట్ల కనికరమే లేకుండా అంబులెన్సుల దోపిడీ

కరోనా బాధితులను నిలువుదోపిడీ చేస్తున్న అంబులెన్స్ ల నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దోపిడీ మరింత ఎక్కువగా ఉంది. ఒక కిలోమీటరు మేర ప్రయాణించి కరోనా బాధితులను...

बहुत सी बीमारी का काल है नारियल, बस रोज पिएं 1 कप Coconut Milk, फिर देखिए सेहत में बदलाव

Benefits Of Coconut Milk: ऐसी बहुत कम चीजें होती है जो हमारे शरीर से जुड़ी एक से ज्यादा समस्याओं को पूरी तरह से...

The Realme 8 5G Shows the Future of Cheap 5G Phones | Digital Trends

The Realme 8 5G, as the name suggests, has a 5G modem inside ready to connect you to the fastest mobile data connection...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe